ఆటాపోటీ

సెలక్టర్ల ఇష్టారాజ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత జాతీయ సెలక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారన్నది నిన్నమొన్నటి విమర్శకాదు. ఒక రకంగా మన దేశంలో ఇది అనాదిగా వస్తున్న ఆచారం. చాలా మంది ఆటగాళ్లను వివిధ టూర్లకు తీసుకెళ్లడం, వారితో ఒక్క మ్యాచ్‌ని కూడా ఆడించకుండానే ఉద్వాసన పలకడం భారత సెలక్టర్ల అలవాటు. అసమాన ప్రతిభతో రాణించినప్పటికీ ఎన్నోసార్లు ఉద్వాసనకు గురైన మొహీందర్ అమర్‌నాథ్ కడుపుమండి సెలక్టర్లను ‘జోకర్ల గుంపు’గా అభివర్ణించాడు. రంజీ ట్రోఫీల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు సృష్టించిన రాజీందర్ గోయల్‌కు ఒక్క టెస్టుకు కూడా ఎంపిక చేయకపోవడం సెలక్టర్ల వ్యవహార శైలికి నిదర్శనం. బిషన్ సింగ్ బేడీ సమకాలీనుడు కావడమే గోయల్ పాలిట శాపమైంది. దేశవాళీ పోటీల్లో గొప్పగా రాణించిన వారికి జాతీయ జట్లలో స్థానం దక్కాలి. కానీ, గోయల్ విషయంలో సెలక్టర్లు ఈ సూత్రాన్ని విస్మరించారు. కెరీర్‌లో 157 ఫస్డ్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతను 39,781 బంతులు వేశాడు. 13,940 పరుగులిచ్చి 750 వికెట్లు కూల్చాడు. రంజీల్లో అతను సాధించిన వికెట్లు 637 వికెట్లు సాధించాడు. వెంకట రాఘవన్ 530, సునీల్ జోషి 479, నరేంద్ర హీర్వాణీ 441, భగవత్ చంద్రశేఖర్ 437 రంజీ వికెట్లతో వరుసగా రెండు నుంచి ఐదు స్థానాలను ఆక్రమించారు. అత్యధిక వికెట్లు పడగొట్టినప్పటికీ గోయల్‌కు టెస్టు క్రికెట్‌లో ఎందుకు స్థానం లభించలేదన్న ప్రశ్నకు సమాధానం లేదు. బ్యాట్స్‌మెన్ విషయంలోనూ ఇలాంటి అన్యాయమే జరిగింది. జాతీయ జట్టుకు ఎంపికయ్యేందుకు అత్యంత కీలకంగా చెప్పుకొనే రంజీ ట్రోఫీల్లో వసీం జాఫర్ అత్యధికంగా 10,054 పరుగులు చేశాడు. అమోల్ మజుందార్ 9,202, మిథున్ మిన్హాస్ 8,480 పరుగులు చేసి, వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ‘టాప్-10’లో నాలుగు నుంచి పది వరకు గల స్థానాల్లో దేవేంద్ర బుందేలా (8,164 పరుగులు), హృషీకేశ్ కనీత్కర్ (8,059 పరుగులు), అమర్‌జిత్ కేపీ (7,623 పరుగులు), పంకజ్ ధర్మానీ (7,621 పరుగులు), సీతాంశు కోటక్ (7,607 పరుగులు), రష్మీ పరీదా (7,516 పరుగులు), అజయ్ శర్మ (7,438 పరుగులు) ఉన్నారు. వీరిలో జాఫర్ 31 టెస్టులు ఆడాడు. హృషీకేశ్ కనీత్కర్‌కు రెండు, అజయ్ శర్మకు ఒకటి చొప్పున టెస్టులు ఆడే అవకాశం లభించింది. మిగతా ఏడుగురికీ అసలు టెస్టుల్లో స్థానమే దక్కలేదు. సెలక్టర్లుది ఇష్టారాజ్యమనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? (చిత్రం) రాజీందర్ గోయల్