బిజినెస్

ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యం: సింగరేణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 29: తెలంగాణ రాష్ట్భ్రావృద్ధిలో ప్రధానమైన విద్యుత్తుత్పత్తికి అవసరమైన బొగ్గు ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తున్న సింగరేణి ఉద్యోగుల రక్షణ, సంక్షేమం కోసం సింగరేణి పలు నిర్ణయాలు తీసుకుంది. సింగరేణి కాలరీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీధర్ అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్‌లో డైరెక్టర్ల సమావేశం జరిగింది. వరంగల్ జిల్లా భూపాలపల్లి ప్రాంతంలోని వెయ్యి మిలీనియం, డిటైవ్ క్వార్టర్ల నిర్మాణానికి రూ. 110.95 కోట్లు, 96ఎంబి టైప్ క్వార్టర్ల నిర్మాణానికి రూ. 26 కోట్లు, ఉద్యోగులకు ఆస్ట్రేలియా నిపుణులచే శిక్షణ, సామాజిక బాధ్యత నిర్వహణకు రూ. 40 కోట్లు మంజూరు చేస్తూ ఆమోదించారు. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని రోడ్డు వెడల్పు కోసం రూ. 2.18 కోట్లు, రూ. 13 కోట్లతో ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో 48 మిలీనియం బి టైప్ క్వార్టర్ల నిర్మాణం, రూ. 13 కోట్లతో భూపాలపల్లిలో క్వార్టర్ల నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేస్తూ డైరెక్టర్ ఆఫ్ బోర్డు తీర్మానించింది.
సర్వీసు లింక్డ్ ప్రమోషన్లు..
సింగరేణి కాలరీస్‌లో పనిచేస్తున్న మూడువేలకు పైగా ఉద్యోగులకు నూతన సంవత్సర కానుకగా లింక్డ్ ప్రమోషన్లు ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏడు సంవత్సరాలు అదే గ్రేడ్‌లో పనిచేస్తున్న భూగర్భ గని కార్మికులకు, ఎనిమిది సంవత్సరాలు అదే గ్రేడ్‌లో పనిచేస్తున్న సర్వీస్ ఉద్యోగులకు జనవరి ఒకటి నుంచి అమలయ్యేలా ఉత్తర్వులు జారీ చేశారు.
సిఎంపిఎఫ్ కార్యాలయం తరలింపు లేదు
సింగరేణి కాలరీస్ గోదావరిఖనిలో ఉన్న సిఎంపిఎఫ్ (కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్) కార్యాలయాన్ని హైదరాబాద్‌కు తరలిస్తామంటూ మీడియాలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని సింగరేణి పౌరసంబంధాల శాఖ ముఖ్య అధికారి ప్రకటించారు.