పశ్చిమగోదావరి

ఇక స్లో అవ్వండి...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, డిసెంబర్ 18: కాల్‌మనీ కాలాంతకుల వ్యవహారం బయట పడిన దగ్గరనుంచి రాష్టవ్య్రాప్తంగానే వడ్డీ వ్యాపారులను ఒకరకంగా చెప్పాలంటే నిలువునీడ లేకుండా చేసేశారనే చెప్పాలి. పోలీసుల వరుస దాడులతో వ్యాపారులంతా బెంబేలెత్తిపోయారు. ఇదే సమయంలో మరికొంతమంది లైసెన్సు తీసుకుని వ్యాపారం చేసుకుంటుంటే ఈ వేధింపులు ఏమిటంటూ ప్రశ్నించటం ప్రారంభించారు. ఈనేపధ్యంలోనే దాడుల వ్యవహారాన్ని ఇక స్లో చేయాలంటూ పోలీసులకు వౌఖిక ఆదేశాలు అందినట్లు శుక్రవారం రాత్రి నుంచి ప్రచారం జరుగుతోంది. దానికితగ్గట్టుగానే గణపవరంలో ఈవిధంగా దాడులు నిర్వహించి చివరకు ఆదేశాలు అందటంతో కేసు నమోదు చేయకుండా బృందాలు వెనుదిరిగినట్లు సమాచారం. ఇక శనివారం నుంచి మరింత స్లోగా ఈ దాడుల వ్యవహారం సాగే పరిస్దితి ఉంటుందని చెపుతున్నారు.