యువ

ఈ వాచెస్ భలే స్మార్ట్ గురూ !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హ్యూలెట్-ప్యాకార్డ్ సంస్థ తొలిసారిగా మొవడో వాచ్‌మేకర్‌తో కలసి బోల్డ్ మోషన్ పేరుతో స్మార్ట్‌వాచ్‌కి రూపకల్పన చేస్తోంది. ఇది 44మిల్లీమీటర్ల స్టెయిన్‌లెస్ స్టీల్ వేరబుల్ డివైస్. ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ స్మార్ట్ఫోన్లపై ఇది పనిచేస్తుంది.

==================

స్మార్ట్ వాచీలు ఎప్పటినుంచో ఉన్నాయంటే మీకు ఆశ్చర్యం కలగొచ్చు. సీకో వాచీలు ఎక్స్‌టర్నల్ కీబోర్డ్‌తో 1983లోనే సంచలనం సృష్టించిన సంగతి కొందరికైనా గుర్తుండే ఉంటుంది. అయితే ఆ కాలపు వాచీలను ఇప్పటి స్మార్ట్ వాచీలతో పోల్చలేం. వాటికీ, ఆధునిక స్మార్ట్‌వాచ్‌లకు గల తేడా- టెలీఫోన్‌కీ స్మార్ట్ఫోన్‌కీ ఉన్నంత తేడా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వచ్చే సంవత్సరం మార్కెట్లోకి వచ్చే స్మార్ట్ వాచ్‌లు మరిన్ని హంగులతో, స్మార్ట్ ఫోన్లకు దీటుగా వస్తున్నాయన్నది నిపుణుల మాట. ఈ నేపథ్యం లో రాబోయే స్మార్ట్ వాచెస్ ఏమిటి? వాటిలో ఉండే ఫీచర్లేమిటో ఓసారి చూద్దాం.
యాపిల్ వాచ్ 2
యాపిల్ సెకండ్ జనరేషన్ స్మార్ట్ వాచ్ ఏప్రిల్‌లో మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు. ఫేస్‌టైమ్ కెమెరా, వైఫై కనెక్టివిటీ, ఇమెయిల్స్, టెక్స్ట్ మెసేజ్‌లను రిసీవ్ చేసుకునే వెసులుబా టు వంటి ఫీచర్లతో అలరించబోతోంది.
ఫాసిల్ క్యూ
ఫ్యాషన్‌ను, టెక్నాలజీని కలగలిపి రూపొందించిన ఫాసిల్ క్యూ ఆండ్రాయిడ్ వేర్ స్మార్ట్‌వాచ్...వేరబుల్ డివైసెస్‌పై మోజు పడేవారిని అలరించేందుకు త్వరలో రాబోతోంది.
టాగ్ హ్యూయర్ కనెక్టెడ్
ఒకసారి చార్జి చేస్తే 40 గంటలపాటు నిర్విరామంగా పనిచేసే బ్యాటరీతో వస్తున్న టాగ్ హ్యూ ర్ కనెక్టెడ్ స్మార్ట్‌వాచ్‌పై వినియోగదారులకు చాలా అంచనాలు ఉన్నాయి. అమెరికన్ మా ర్కెట్లో నవంబర్‌లోనే అమ్మకాలు మొదలైనా వచ్చే ఏడాది ఆరంభంలోగాని ఈ స్మార్ట్‌వాచ్ ఆసియా మార్కెట్లోకి ప్రవేశించే అవకాశాలు లేవు. దీని ధర 1400 డాలర్లు.
మోటోరోలా మోటో 360 స్పోర్ట్
సెప్టెంబర్‌లో జరిగిన ఐఎఫ్‌ఎ సదస్సులో త్వరలో సరికొత్త స్మార్ట్‌వాచ్‌తో మార్కెట్లోకి రా బోతున్నట్టు మోటోరోలా ప్రకటించింది. బిల్టిన్ జిపిఎస్ ఇందులో ప్రధాన ఆకర్షణ. అలాగే ‘ఎనీలైట్ హైబ్రిడ్’ టెక్నాలజీని ప్రవేశపెడుతున్నామని, దీనివల్ల స్మార్ట్‌వాచ్‌లో డేటాను ఎండ తీవ్రతలోనూ చూసుకోవచ్చనీ కంపెనీ చెబుతోంది.
బోల్డ్ మోషన్
హ్యూలెట్-ప్యాకార్డ్ సంస్థ తొలిసారిగా మొ వడో వాచ్‌మేకర్‌తో కలసి బోల్డ్ మోషన్ పేరుతో స్మార్ట్‌వాచ్‌కి రూపకల్పన చేస్తోంది. ఇది 44మిల్లీమీటర్ల స్టెయిన్‌లెస్ స్టీల్ వేరబుల్ డివైస్. ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ స్మార్ట్ఫోన్లపై ఇది పనిచేస్తుంది. టైమ్, డేట్‌తోపాటు ఇమెయిల్స్, టెక్స్‌ట్ మెసేజ్‌లు, సోషల్ మీడియా అప్‌డేట్స్, కాలెండర్ అపాయింట్‌మెంట్స్ వంటి ఫీచర్లను బోల్డ్ మోషన్ అందించబోతోంది. దీని ధర 795 డాలర్లు.
*