స్మృతి లయలు

వెండితెర హాస్య సమ్రాట్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ రోజులు వేరు. రూఫాయికి బోలెడు విలువ. ఆం.స.వా. పత్రిక ఏడాది చందా పదమూడు రూపాయలు. విడి ప్రతి పావలా. రైలు - టపా అయితే - కానీ, విదేశాలకు రేట్లు ఇలా ఉండేవి. ఓడ టపా (సముద్రం మీద స్టీమర్‌లో) బ్రిటన్, జర్మనీ, ఐరోపాలకు, ఆఫ్రికన్ దేశాలకు అయితే 114 రూపాయలు. మనకి దూరంగా వున్నా, ఎంతో దగ్గరగా వున్న అమెరికాకి మాత్రం 176 రూపాయలు, ఆస్ట్రేలియాకి 135 రూపాయలు ఏడాది చందా - ఓడ మీద వెళ్లే చందాలు వుండేవని సులువుగా తెలిసేది. వారపత్రిక వోడెక్కి చిరునామా దారునికి చేరడానికి ఎనిమిది నుంచి పది వారాలు పట్టేది. అప్పుడు సీరియల్స్ వారంతా చదివేవారు. అప్పుడు ఐతే, ఉత్తరాల శీర్షికకు వాళ్ల పుణ్యమా అని ఎయిర్ టపాలో లెటర్స్ పడేసేవారు. ప్రేమకు పగ్గాలు అయిపోయాక దాని తర్వాత సీరియల్ పూర్తి అవుతుండగా అభిప్రాయాలు అందేవి. కాకపోతే వాళ్లకు సీరియల్ చదివేటందుకు వరుసగా కాపీలు అందేవి. కనుక పేచీ లేదు. అవి పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ రోజులు ‘కలర్స్’ రచనలలోనే ప్రదర్శించేవాళ్లం. 1995 దాకా మొబైల్ అంటే ఏమిటో? తెలియదు. ఓ కవర్ పేజీని మూడు వారాల ముందు ప్రింటింగ్ మొదలు పెట్టి ట్రై కలర్స్‌లో ఒకదాని తరువాత ఒకటి రంగులను ప్రింట్ చేసుకుంటూ పోవాలి. రోటరీ మీద ఇన్నర్ రేపర్స్ మాత్రం చేసి రోల్ ఎక్కించి లాగేసేవాళ్లం. ఆ కారణం చేతనే లోపలి అట్టల మీదికి ప్రకటనలు అందేవి కావు. తారల బొమ్మలు వేసేవాళ్లం. అక్కడ కాబోయే నటీమణుల ప్రయివేటు చిత్రాలు పడేవి. కె.ఆర్.విజయ, సంధ్య, మీనా లాంటి తారలు ఎందరో వున్నారు. సినిమా లోకం - మా పత్రికా లోకానికి యించుమించు మరో లోకం లాగానే ఎంతో దూరంగా ఉండేది. ఇక అసలు పాఠకులు కూడా మరో రాష్ట్రంలో అంటే ఆంధ్ర దేశంలో వుండేవారు. అయినా అనుబంధం అభిరుచి రెండూ పోషించడం మా వంతు. ‘ఆంధ్రదేశం’లో (ఈ మాట కావాలనే వాడుతున్నాను) జన జీవన స్రవంతి ఎట్లా మారుతున్నది? జన మహాజనులు సాంక్ర, ఆర్థిక, రాజకీయ అభిరుచులు, అలవాట్లు వగైరాలు గమనించాలి.
తిరుపతికి వచ్చి తేలిక పడి అక్కణ్ణుంచి మద్రాస్ ట్రిప్పుకి వచ్చే రచయిత మిత్రులు, అభిమానులు తప్ప బెజవాడలో పోనీ హైదరాబాద్‌లో పత్రిక ఉంటే వచ్చినట్లు - సందర్శకుల తాకిడి వుండేది కాదు. ఇంటరాక్షన్, స్పందన, ప్రతిస్పందనలకు స్కోప్ తక్కువ. అయినా ఉత్తరాలు చాలా సంగతులు చెప్పేవి. వాటిని బట్టి ప్లానింగ్ ఉండేది.
‘రేలంగి’ తెర మీద - తెర వెనుక ఎప్పుడు? అని ఉత్తరాల దాడి మొదలయింది. అతి పాతది. అదీ చాలా ప్రాచీనమయినది. మన ఆంధ్రపత్రిక కనుక ప్రపంచంలోని అన్ని దిక్కుల నుండి, అన్ని రకాల దేశ విదేశీ మ్యాగజీన్‌లు వచ్చేవి. టెలిప్రింటర్ రూమ్‌లో - అవి గుట్టలు గుట్టలుగా పడి ఉండేవి. అవన్నీ నా బల్ల ప్రక్కన పడేయమన్నాను. ‘సాటర్ డే ఈవెనింగ్ పోస్ట్’ అలాగే. ‘వుమన్, ఇల్లస్ట్రేటెడ్’కి, ‘టైమ్’ ‘న్యూస్ వీక్’ మాగజీన్‌లకి కూడా చందాదారులమే. ‘ప్రభ.’ ‘పత్రిక’ అనే వాళ్లం ఆ రెండింటినీ. లండన్ ‘డైయిలీ మిర్రర్’కి సముద్ర టపా చందా కట్టాము.
‘లోకం పోకడ’ తెలియని వాడా! కల్లాకపటం ఎరుగని వాడా!’ అన్నట్లుండే - సచిత్ర వారపత్రికను ‘సకల పాఠక మిత్ర’గా ఎలా చేయడం? అయితే మేము దేన్నీ గ్రుడ్డిగా అనుకరించకూడదు. నేల విడిచి సాము వీలు లేనిదీ అనుకున్నాము. అప్పటి పాఠకులు దీక్షోదాత్త మనస్కులు - అంత తేలికగా దగా పడేవారు కాదు.
రేలంగి అంటే అందరికీ ఇష్టమే!
మజా మజా మధురసం/ మాసిపోవు నీరసం/ మరిపించు మానసం’ అంటే అది ఏ రసం? నిస్సందేహంగా హాస్యరసమే. తెలుగు చలనచిత్ర సీమలో సదరు హాస్య రసాన్ని పండించి, పోషించిన హాస్య సమ్రాట్ అప్పటికి డబుల్ సెంచరీకేసి పరుగులు తీస్తున్న - రేలంగి వెంట్రామయ్యే గదా!
చాలా విన్నాను రేలంగి గురించి మా సర్కిల్స్‌లో- సెట్ మీద డైలాగు కాస్త పొడుగ్గా వున్నా అసిస్టెంట్ డైరెక్టర్ల మీద మండిపడిపోతాడని - నవ్వించే నటుడే కానీ సెట్స్ మీద పేచీకోరుగా ఉంటాడనీ. కానీ ఈ అభిప్రాయం పటాపంచలై పోయింది. ఎంతో సాధు స్వభావుడు. ఫొటోగ్రాఫర్ ప్రభాకర్ వేపు నా వేపు చూస్తూ నవ్వుతూ ‘మీ ఇద్దరిలో ఎవరేటి హీరో? కెమేరా అట్టుకున్నాడు గనుక - చేతిలో కలం లేకపోయినా ఈ బాబే మన హీరో అన్నమాట. రండి రండి’ అంటూ ఆహ్వానించాడు. నేను నమస్కరించి ‘ఇదుగో కలం’ అంటూ తీశాను. ‘అమ్మో! నాకు ‘పోట్లు’ అంటే ‘గాభ్రా’ కలం పోట్లు అయినా సరే’ అంటూ హాలులో కూర్చోబెట్టాడు.
‘రాజులు సైన్యంతోను, కవులు కవనంతోను, రేలంగి హాస్యంతోను జైత్రయాత్ర చేస్తాడన్నది’ నా కాప్షన్.
బొంగరాలాడే వయస్సులోనే నాటకాలాడిన రేలంగి మొదటిలో ఆడ వేషాలు, ఆడంగి వేషాలు కూడా వేశాడు. కానీ 1933లో ఏకంగా ఇంద్రుడు వేషంతో తెరకెక్కిన ‘రేలంగి’గారు హాస్య రసేంద్రుడు - డే అయినాడు. వెకిలితనం మొరటు సంభాషణం హాస్యం అనుకునే వాళ్లకి రేలంగి షాక్ ఇచ్చాడు. అతి సున్నితమైన, అమాయకమైన హాస్యరస గుళికల్ని పంచి పెట్టాడు. తెలుగు తెర మొట్టమొదటి హీరోయిన్ సురభి కమలాబాయ్‌తో శ్రీకృష్ణుడి వేషంలో డాన్స్ చేస్తూ (జయభేరి) ప్రేక్షకులతో వాళ్ల ఇండ్లకు విడివిడిగా వెళ్లిపోయాడు.
దేవానంద్‌కి గ్రెగరీ పెక్, రాజ్‌కపూర్‌కి క్లార్క్ గేబుల్ ఇట్లా స్టార్స్‌కి రోల్ మోడల్స్ వున్నారు. కానీ రేలంగికి చార్లీ చాప్లిన్ నుంచి జెర్రీ లూరుూస్ దాకా వున్న హేమాహేమీ ఇంగ్లీషు హాస్యనట బ్రహ్మలెవరూ కూడా ‘రోల్ మోడల్స్ కారు’. రేలంగిదో స్కూలు. అదో సొంత బాణీ.
అతను ఏడుపు మొహం పెడితే ‘సొగసయిన క్రాఫ్‌బోయే నగుమోము చిన్నబోయే’ అంటూ పాటకి ప్రేక్షకులకు కడుపు చెక్కలయ్యేది. రేలంగి వారు హీరో వేషం కూడా వేశాడు అంజలీదేవితో ‘పక్కింటి అమ్మాయి’లోను. సావిత్రితో ‘మామకు తగ్గ అల్లుడు’లోను, హీరో అయిన రేలంగికి ఆ మహా నటీమణులు హారతులిచ్చి సన్మానించడం విరోధాభాస కాదు.
పక్కింటి అమ్మాయి కథ హిందీ చలనచిత్ర సీమలో ఒక ‘ల్యాండ్ మార్క్’ అయిపోయింది. సునీల్‌దత్, కిషోర్, సైరాబానోలు నటించిన ఆ చిత్రం సునీల్ దత్ రేలంగిని కొన్ని సన్నివేశాలలో ఇమిటేట్ చేయబోయి ‘ఖంగు’ తిన్నాడు.
చైనా దేశంలో ఆడింది. ‘పాతాళ భైరవి’ - దాని హిందీ వర్షన్‌లో అప్పుడు ‘టాప్ బిల్లింగ్’ వున్న అంజాద్‌ఖాన్ చేత ఆ వేషం వేయించి చతికిలపడ్డారు. నాలిక్కరుచుకున్నారు.
ఆ రోజుల్లో ‘రేలంగి’ ఉంటే మెయిన్ ట్రాక్‌తోపాటు సైడు ట్రాక్ మస్టు. అంత ఇదిగాను సాగాల్సిందే. హీరో హీరోయిన్స్‌తో సమానంగా బాక్సాఫీసు ‘పుల్లింగ్’ వున్న రేలంగి పేరు ఎప్పుడూ టాప్‌గానే వుండింది. చివరి దాకా.. ఎన్నో ఫొటోలు వారి యింట తీశాము...
పాతాళ భైరవిలో ‘అక్కూ అక్కూ’ మాయాబజార్‌లో ‘అహ సుందరి ఓహొ సుందరీ’ లాంటి వేషాలు అసలు నటుల్ని మ్రింగేసేటంతగా! జనరంజన చేశాయి.
అలనాడు ఊరూరా.. ‘వినవే బాలా నా ప్రేమ గోలా’ పాటే మార్మోగింది. కేవలం అమాయకుడిగానే కాదు. పాతకాలపు హిందీ నటుడు యాకూబ్ ఖాన్ లాగ ‘రోజులు మారాయి’ చిత్రంలో ‘హాస్య విలనీ’ని కూడా ప్రదర్శించాడు.
నేను సరదాగా ఇంటర్‌వ్యూ చేస్తుంటే అక్కినేని ప్రసక్తి వచ్చింది. రావడం కాదు నేనే తెచ్చాను. ఆ ఇద్దరికీ బయట ‘డైలాగులు’ లేవు. పచ్చిగడ్డి ఆ ఇద్దరి మధ్య ఫీల్డులో ఎవ్వరూ వెయ్యరు. వేసే భగ్గుమంటుందది. రేలంగి గారు టాప్‌గేరులో పడిపోయాడు. ‘్భమికి జానెడు మనిషి’ ‘ఆ...’ కూడా హీరో ఏంటండీ? అంటూ ప్రభాకర్ వైపు తిరిగి - ‘నువ్వు చెప్పు బాబూ! ఇదుగో ఈ అబ్బాయిని హీరోగా ఎట్టుకోండి (నా భుజం గట్టిగా తట్టి) హీరో అవుతాడు. ఈ అబ్బాయి బ్రహ్మాండంగా అవుతాడు. బస్తీ మే సవాల్ అంటూంటే భాష జోరందుకుంది అని గ్రహించి మెల్లిగా ‘ట్రాకు’ మార్చాను.
‘మీరు నిర్మాతగా మారితే? నేను హీరో. మా ప్రభాకర్ కెమెరామేన్ అవుతాము సార్!’ అన్నాను. ‘సారీ’ మద్రాసులో వూత పదం చాలా ఎఫెక్టు గలది. ‘వామ్మో!.. వద్దు వద్దు.. బాబూ ప్రొడక్షన్ వద్దు.. ‘తప్పు’ ‘తప్పు’ (అతని పాపులర్ సినిమా డైలాగు) ఇంకేముందీ?.. ‘పీసు.. పీసు’ అంటూ మేము ‘పారిపోవాలి’ అన్నట్లు చెయ్యి ఇలా వూపుతూ! ‘గయే గయేం..’ అన్న విన్యాసం చేశాడు. ‘పీసు’ అంటే శాంతి శాంతి అని.
అతని చేత ట్రానిస్టర్ ఉంది. ఈ ‘సెట్’నీ పేకాటని చేతి విన్యాసాలతో సంకేతిస్తూ ఆ ‘సెట్టు’ చాలు కాలక్షేపానికి.. రిపేర్లు అంటారా? ఇంట్లో వస్తువులన్నీ ‘రిపేరి’కి మనమే...
అంతలో రాజబాబు వస్తూనే సాష్టాంగ పడిపోయాడు. ‘లేరా లేరా!’ అన్నాడు. సీనియర్ నటుడు రేలంగి జూనియరని అక్కినేని, ఘంటసాల బలరామయ్యగారి గురించి విన్నాను. సినిమా ఫీల్డులో మొదట ఎదురయ్యే ‘కరోడా’తనం గురించి జ్ఞాపకం వచ్చింది. రాజబాబు నేనా? మరొకడికైనా? ఆరంభంలో ‘బాట’ అంతా పల్లేరుకాయల మాటేగా. సరే అదుగో రేలంగిని ఆ రోజు నిజంగా రకరకాల వేషాలు వేయించాను. గ్లాస్కో పంచె బనియను తలపాగా అది మార్చి టైటు ప్యాంటు, శ్లాక్‌షర్టు అది కాదని, ధోతీ కండువా.. ప్రయివేటుగా అడిగిన పోజులన్నీ ఇచ్చేశాడు పాపం! అప్పటికే కొంత అస్వస్థత ఉన్నది ఆయనకి. చివరిగా వాళ్ల డాబా మీద పిట్టగోడ వుంది. దాని వెనుక నుంచి కొబ్బరి చెట్లు వచ్చి దానిమీద ఇలా వ్రాలుతున్నాయ్. ఆ గోడ (వెడల్పుగా వుంది లెండి) ఎక్కమన్నాను. ‘్ఠవి’గా పోజులు ఇవ్వాలి సమ్రాట్’
‘్భలే భలే సిగరెట్టూ.. ఇది దొరలు త్రాగు సిగిరెట్టూ’ అన్నట్లు పోజు ఇమ్మని చేతిలో సిగిరెట్టు పెట్టాను. ‘నాన.. నాన.. నాన..’ అని పాడుతూ నవ్వాడు.
అది రొంబకష్టమబ్బా అన్నాడు.
‘పడితే గోవిందా’.. అన్నాడు. కుర్చీ వోటిలాగి - ఇదెక్కి - దీని మీద కాలెట్టుకుని దర్జాగా ఫోజు ఇవ్వమన్నాను. ఆ ‘్ఫటో’ తెర మీద - తెర వెనుక’లో ఫుల్‌పేజీగా ఆ బొమ్మ వేశాను. అందరూ ‘్ఫల్డు’లో కూడా సంతోషించారు. (్ఫటో చూడండి) శివాజీ గణేశన్‌గారి ‘హాకీ’ (తారల హాకీ) టీములో వున్న ‘రేలంగి’గారు ‘చెడుగుడు కూడా ఆడతారు’ అన్నాను నేను పొగుడుతూ.
‘నీ అమ్మ.. కడుపు చల్లగా, వెయ్యేళ్లు..’ (ఇంకా బోలెడుంది)

-వీరాజీ veeraji.columnist@gmail.com 92900 99512