స్మృతి లయలు

నాన్నలో అమ్మను చూశా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్ని ఫొందటానికి కొన్ని పోగొట్టుకోవాలి అంటారు - కానీ తాళం చెవి పారేసుకోవడం అటువంటిది కాదు. కానీ నాకదో చెత్త అలవాటు - మెరీనా బీచ్‌కి వెళ్లాను. ఒంటరిగా వెళ్లడం ప్రాక్టీస్ చెయ్యాలనిపించింది. మహానగరంలో ‘పారిస్ బస్సు’ పట్టుకుంటే చాలు గూటికి చేరుతాను. వస్తానన్న సభాపతి రాలేదు - చాలా రోజులైంది. వైజాగ్ స్కాండల్ పాయింట్ గుర్తుకొచ్చింది. ఏకాంతం కోరింది మనసు. మద్రాస్‌లో డిసెంబర్ నెల చిత్రంగా ఉంటుంది. వున్నట్టుండి చిరుజల్లులు జలజలా.. అంతలో లైన్ క్లియర్.. సముద్రంలో ఈత కొట్టటం రాదు కానీ జీవన సాగరంలో - ఈదటానికి అవసరమైన ఫిలాసఫీని నాకు ఇచ్చేది ఆ సంద్రమే.. చెలియలికట్టకి కెరటాలకి మధ్య - పోరాటం అంటే అది పోరాటం లేదా చెలగాటం అంటే చెలగాటం - రొమాన్స్ అనుకుంటే.. ఓకే.. అట్లాగే అగపడుతుంది. ఆకాశ కన్య యొక్క కాటుకరంగు కురులు ప్రియుడి నుదురు మూర్కొంటున్నట్లు - చీకట్లు.. అంతలో - ఎన్నా సార్ ఎప్పిడి ఇరికార్ - తిరిగి చూద్దును కదా.. శున్డాళ్ పేపర్ పొట్లాం నా వేపు గురి పెడుతూ - ఓ మాడ్రన్ లేడీ... ‘ఎస్’ జ్ఞాపకం వచ్చింది.. క్రికెట్ టెస్ట్ మ్యాచ్ చూడటానికి వెళ్లానుగా.. అక్కడ విఐపి గేలరీలో పరిచయం అయిన.. క్రికెట్ సుందరి.. సారీ.. పేరు యాదాస్తు లేదు - నాకదో జబ్బు. మొహాలు హావభావాలు మరచిపోను కానీ పేరు? ఇలా శంకు ఆకారంలో పొట్లం న్యూస్‌పేపర్ చుట్టి ఇస్తారు బీచ్‌లో... శున్దాల్ - కయిముర్కులు, చనా జోర్గరం; ఇవన్నీ - సంద్రపుషైర్ సరంజామా - మా నాన్నగారికి మద్రాస్ క్లైముర్క్‌లు భలే ఇష్టం.
‘ఇహీ’మన్నాను.. జ్ఞాపకం చేసుకున్నాం.. టెస్ట్‌మ్యాచ్‌కి టిక్కెట్లు ప్రెస్ గ్యాలరీకి వస్తాయి మాకు, కానీ వాటిని బొమ్మకంటి సుబ్బారావుగారు - నేనే ఆంధ్రపత్రిక స్పోర్ట్స్ ఎడిటర్‌నని తెచ్చేసుకొనేవాడుట.. నేను సదరు ప్రెస్ రిలేషన్స్‌కి లెటర్ అఫీషియల్‌గా కొట్టి డిమాండ్ చేశాను. దాంతో వాళ్లు కంగారుపడి చెప్పారు. సుబ్బారావు అని ఓ పెద్ద మనిషి రెండు వీక్లీ ప్రెస్ కాంప్లిమెంటరీలు తీసుకున్నారు అని.. నేను అడిగాను బొమ్మకంటి వారిని - ఆయన కూడా ప్రభ నుంచి వివియన్‌తోపాటు వచ్చినవాడే - తెలుగులో స్పోర్ట్స్ బుక్ కూడా రాశాడు. ఆటలకి చెందిన వార్తలు రాయడం ఆయన వంతు. కానీ, వీక్లీ పేర వున్నవి - వీక్లీ బల్ల మీదికి రావాలిగా.. ఆయనకీ కన్నూముక్కూ ఎరుపెక్కాయి కానీ ఇవ్వక తప్పదుగా.. నాకు క్రికెట్ పిచ్చి వున్నది అని తెలిసిందే కదా? మా నాన్నగారు ఒక బైనక్యూలర్ ఇచ్చారు. అదే మొదటిసారి నేనంత స్టేడియం ప్లస్ జనం చూడటం... మా వూళ్లో న్యూస్ రీల్లో చూపించే క్రికెట్ న్యూస్ చూసేవాళ్లం.. మరో ఛాన్స్ లేదు. సరే - ఈమె నాకు విఐపి వరుస నాలుగు సీట్లకి అవతల కూర్చునినది. బెంగళూరు సిల్కు చీర ‘నెమలి కంఠం డిజైన్’ బాగా ‘సాఫిస్టికేటెడ్’గా ఉంది. ఆట మొదలైంది. నెహ్రూ స్టేడియం కిటకిటలాడింది. నారికంట్రాక్టర్ కెప్టెన్. హేమాహేమీలు పటౌడీ నవాబ్, ఉమ్రిగర్, మన జయసింహాలు హీరోలు. ఓసారి బైనాక్యులర్ ఇవ్వమని సైగలతో అడిగింది. ఇచ్చాను - తిరిగి ఇచ్చేయ్‌మన్నట్లు అవతల ఆట కూడా చూడకుండా - అటే కనే్నసి.. సరే, ఇలా తీసుకుని మళ్లీ ఆవిడకి అలా ఇవ్వడం - పైగా నాకు బోలెడు సిగ్గు - ఆమె బిరుసుగానే ఉన్నది వర్కింగ్ గర్ల్ కదా. నా ప్రక్క వాడు విసుగ్గా చూసి - నువ్విటు రావమ్మా అంటూ తన సీటు వదిలేసి ఆమె సీట్లోకి మారిపోయాడు. అలా కలిసింది స్నేహం. (మద్రాసులో ఇంగ్లీషు హిందీ సినిమాలకు పోతే - పెద్ద క్యూలుంటే, అకస్మాత్తుగా చక్కని పడుచు పిల్లలు వచ్చి ‘గర్లపోలైట్గా’ - మూడు భాషల్లోను ‘టిక్కెట్ తెచ్చిపెట్టామా’ అని అడుగుతారు. సభాపతి మెడికల్ కాలేజీయే కదా. అతనికి తెలుసు. ఆడాళ్ల క్యూ చిన్నది ఉంటుంది - మూడు టిక్కెట్లకి డబ్బులు ఇచ్చాడు మా వాడు! సినిమా ఎలిజబెత్ టేలర్ నటించిన ‘సడన్లీ లాస్ట్ సమ్మర్’ అనుకుంటాను. మూడెందుకు? నా డౌటు.. తనకోటి వద్దా? అట్లా ఆ అమ్మాయి మనకి కంపెనీ ఇస్తుంది. ఇస్తే కూల్‌డ్రింక్ తాగుతుంది లేదా మారుమాట్లాడకుండా చివరిలో వెళ్లిపోతుంది - ఇట్ డిపెండ్స్’ అన్నాడు సభా.
ఈ క్రికెట్ ఫ్రెండు ‘నన్ను తినుబండారాలు కొనమనలేదు’ పైగా, కేకు కూల్‌డ్రింకు కూడా తనే చనువుగా కొనిపెట్టింది. పెద్ద కంపెనీలో ‘స్టెనో’ట. ఫోను నెంబర్ ఇచ్చింది. పత్రికావా? - తెరియాదు అన్నది కాని ఏళ్ల తరబడి ఫ్రెండ్స్‌లాగా ఎంతో హుందాగా డీసెంట్‌గా చేయి ఊపి వెళ్లిపోయింది. నాకు ప్లేయర్లు ఎవరెవరో అర్థంకాలేదు. ఇంటికి వచ్చేసరికి జ్వరం వచ్చేసింది. అసలే సయినటిస్ గాన్ని. ఈ ముక్కుదిబ్బడ చిన్నప్పటి నుంచి ఉంది - అటు తరువాత, ఇదే అకస్మాత్తుగా - ఆమె కేక. మెరీనా బీచ్ ఒక తిరణాల లాగా ఉంటుంది ఎప్పుడూ.. అయనా భీడ్ మే అకేలా అంటే గుంపుల మధ్య ఉన్నా ఒంటరితనం.. ఆమె కబుర్ల పుట్ట. ఇంగ్లీషు తమిళం మిళాయించి మరో రెండు, చనాజోరుగరం (ఉత్తరాది వారి కోసం ఇవి హిందుస్తానీ దుస్తులు ధరించిన వాళ్లు చనా జోర్గార్మం. జోర్గారాం అంటూ అమ్ముతూ తిరుగుతారు. రెండు పాకెట్లు ఖతం.
వాళ్లింటికి రమ్మన్నది - ఓ గ్రాండ్ మా బియ్యే చేస్తున్న చెల్లి - అంబిక వున్నారుట. మేము తమిళియన్స్ కాదు - కామత్స్‌మి.. చెప్పింది.. అంతలో చినుకులు మొదలినాయి.. అంతా, యువజంటలు ముఖ్యంగా - రోడ్డు వేపు ఇంచుమించు పరుగులు ‘చిటపట చినుకులు పడుతూ వుంటే.. చెలికాడే చెంతను వుంటే’ (నాకా పాట, బి.సరోజాదేవి కూడా ఇష్టం).. కాకపోతే ఇక్కడ చెట్టునీడ లేదు - చెలి కూడా లేదు - ఫ్రెండూ నేను - సరి - సిటీ బస్సు షెల్టర్ కోసం పరిగెట్టాము. ఇంత సన్నంగా కలువకాడలాగ వున్నదేనని చూసినప్పుడే అనుకున్నాను. నాన్ టామిలియన్స్ అని - అప్పటి జనం మీద ఇంటర్నెట్ ప్రభావం ఊహలోకి కూడా లేదు -ఆడ మగా - పరస్పరం ‘అదే’ దృష్టితో చూసుకోవడం చాలా అరుదు. ‘ప్లేటోనిక్ ప్రేమ’ అనేది తరచూ మేము క్యాంపస్‌లో మాట్లాడుకునేవాళ్లం. సినిమా స్టార్ల ఇంటర్వ్యూలు చెయ్యడం చేత నాకు సభా పిరికితనం బాగా తగ్గింది. ఆమె కొంగు నెత్తిన వేసుకుని ఇంగ్లీషులో వాతావరణం భలేగా ఉంది కదూ.. అన్నది. నడచిపోదామా? చిన్న పిసరు చలికి ఇలా చేతులు ముడుచుకుని అన్నాను - వరసాగ్గా. ‘్భం భాం’ అంటూ బస్సులేవో - వాటి వెంట మిడిల్‌క్లాస్.. ఆటోని పలకరించడమే - కష్టం కానీ ఆమె నా రెక్క పట్టుకుని ఓ బస్సులోకి లాక్కెళుతూ - ఎక్కింది - పర్వా ఇల్లెసార్ - వాన్గో ఓ సెంటర్‌లో దిగి అక్కడ్నుంచి మన బస్సులెక్కుదం - ఇక్కడ మన ఏరియా బస్సు కోసం వెదక్కోలెం.. వాన ఠక్కున స్విచ్ ఆఫ్ చేసినట్లు ఆగిపోయింది.
ఇంటికొచ్చేసరికి ఎనిమిది అయిపోయింది. తాళం నా దగ్గర ఉండిపోయింది గదా - నాన్నగారు ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్నారో? సారీ సార్ అంటూ జేబులో చెయ్యి దోపాను.. అరె.. లేదు కీ - మరో జేబు.. మరోసారి ‘పోయింది’ ఎక్కడో పడిపోయింది.. కీ. నాన్నగారు వెంటనే నన్ను పట్టుకొని ఆ దవడా ఈ దవడా వాయించేస్తే ఎంతో బాగుండేది. కానీ ఆ శాంతమూర్తి - బీడీ తీసి పట్టుకుని జేబులోకి అగ్గిపెట్టె కోసం తడుముకుంటూ క్రిందికి జాగ్రత్తగా దిగి మంగమ్మకి కానీ నరసయ్యకి గానీ చెప్పు అన్నారు.
మంగమ్మ చలించిపోయింది. ఇస్వనాదం గారిని ఈడ లోన కూర్చోబెట్టే వోల్లంగా. ఒక్కడివే దిగినావేమి..? అని బాధపడ్డది. ఫుట్‌పాత్‌కి అవతలవేపు ఓ పాత తాళాల మరమ్మత్తుల ‘ఆలు’ (మనిషి) వుండాడు అని వానిని పట్టుకొచ్చాడు వెంకటి.. ఆ తాళం కప్ప గాడ్రేజ్ కప్ప. అది చితకలేదు.. వాడు తలుపుకొక్కెం మీది స్క్రూలు విప్పేసి తీసి మా చేతిలో పెట్టాడు.. మేము తిన్నా క్యారేజీ తీసుకుపోతూ మంగమ్మ - కుర్చీ ఈడ్చి లోన తలుపునకు మోడ్చి (అంటే మోపు చేసి) పండుకోండి.. అంటూ నా వేపు తిరిగి ఆమె తీక్షణంగా చూసిన చూపు.. ట్రాన్స్‌లేట్ చేస్తే ఓ బండెడు తిట్లు అయ్యేది.
గప్‌చిప్‌గా పడుక్కున్నా నిద్ర పట్టలేదు.. శంకరా! అంటూ ఆయన ఆవలించడమే గమనించా.. ఏదో నిద్రలోకి జారాలని ప్రయత్నం.. పశ్చాతాపాగ్ని దహిస్తోంది.
‘లైట్‌హౌస్ మీదికి ఎక్కితే.. అనుకున్నానో సారి’ ఎక్కితే ఎక్కు గానీ తాళం చెవి తీసుకుపోబాకు అన్నది మనసు. అంతలో గుండెలో మంట కడుపులో తిప్పుడు.. ఏదో ఏమో.. తెలియని బాధ.. మెలికలు తిరిగిపోతూ.. సార్ - నిద్రపోతున్నారా? గట్టిగా మూలిగెను.. అమ్మా.. అమ్మమ్మా.. నాన్నగారు లేచారు. లైట్ వేశాడు. ఒంటిగంట దాటింది. కంగారుపడ్డారు. బాధతో మూలుగుతున్న నన్ను చూడలేక కిందికి మూడంతస్తులు ఎలా దిగారో? ఆ మసక వెలుతురులో - బిల్డింగ్ ఆవరణ వెనుక పిట్టగోడ ఎక్కి దూకి మరీ వెళ్లి వెనుక వీధి క్రాస్‌రోడ్డులోనున్న డాక్టర్ ఒకర్ని లేపుకొచ్చారు. ఆయన ఎన్నడూ బయటికి పోలేదు. ఆఫీసుకి - వౌంట్ రోడ్డు - తిరిగి రూముకి జార్జిటౌన్ - అంతే.. డాక్టర్ పరీక్షించి ‘తడిశాడు - పైగా తిన్నదేదో జంక్‌ఫుడ్. పాయిజినింగ్ అయింది.. అంటూ నో ప్రాబ్లెం నో వర్రీ అంటూ ఓ ఇంజక్షన్ పొడిచాడు. రెండు మాత్రలు తీసి మింగించాడు. వాంతులయినా.. విరోచనాలయినా.. అప్సెట్ కావద్దు.. రేపు క్లినిక్‌కి రండి ‘డ్రిప్’ పెట్టేస్తాను.. చాలా వీక్‌గా ఉన్నాడు.. అన్నాడు. ఫీజు ఇచ్చి దిగబెట్టి వచ్చారు. క్రింద పేవ్‌మెంట్ వాసులు వున్నారుగా.. వాళ్లు హెల్ప్ చేశారు. అర్ధరాత్రి వేళ. ఉదయం సర్దుకున్నాను - సిగ్గుతో వొళ్లు కుంచించుకు పోయింది.. నాన్నగారి వేపు భయంగా - క్షమాపణ కోరే దృక్కులతో చూశా.. ‘సెలవు పెట్టు నాన్నా’ అన్నారు. వెళ్తా సార్.. ఇవాళ ఫస్టు సెట్ (పేజీలు) ఇచ్చెయ్యాలి.. కానీ తలుపు తాళం? గడియ లేదు వెలుపల - కొక్కెం తీసేశాడుగా. బోలెడు ఫిలాసఫీ మా నాన్నగారి నవ్వులో.. నేను వెళ్లాలి.. మస్ట్.. తలుపు లాగి వేసుకుని వెళ్లు.. ఎవరూ రారూ.. ఈవెనింగ్ చూద్దాం అని వెళ్లారు.
నాన్నగారిలో అమ్మని చూశాను... అమ్మ అయితే ఈపాటికి చడామడా తిట్టేది - ఆనక ఓసారి ముక్కు చీదేసేది. ఏడ్చి కనులు తుడుచుకుంటూ.. కానీ కన్నతండ్రి నిజరూప దర్శనమైంది. ఆయనో సంద్రం.. తండ్రి.. అనగా ‘అసలు వేరు’ - ప్రదర్శించని దయ, ఆర్ద్రత, త్యాగనిరతి నాన్నగారిలోనే ఉంటుంది. జీవన ఒరవడి - ‘బడి’ బిడ్డ ‘అభివృద్ధికి పెట్టుబడి అన్నీ నాన్నవే.. కన్నీళ్లు కార్చవు కానీ తండ్రి కనులు బడబాగ్నులు భరించగలవు.. మా క్రింది (అంతస్తు) రూమ్ నెంబర్ 9లో వున్న మద్ది సుబ్బారావు వచ్చి - పరామర్శించి - ఓ పేపరు చింపి మడత పెట్టి తలుపు క్రింద గుచ్చు - తలుపు వెనక్కి పోదు అని ఐడియా ఇచ్చాడు.. అట్లా నాలుగు రోజులు.. ఓపెన్‌గా ఉంది రూము. సుబ్బారావు గుంటూరు పారిశ్రామికవేత్త మద్ది సుదర్శనంగారి చిన్న కొడుకు. ఆయన వస్తే రూమ్ నెం.9లోనే ఉంటారు. మన సుబ్బారావు ఇక్కడ వుండీ ‘ఏమ్బియే’ చేస్తున్నాడు.. మా నాన్నగారికి శిష్యుడు - ఆయన యువకులను భలే ఆకర్షించేవారు. ఈ సుబ్బాది గ్రేట్ ‘మా’ రూమ్‌లో ఫోను హెడ్డ్ఫాసుకు పట్టుకుపోయాక ఎంతో పనికొచ్చాడు. ఆతను రూమ్‌లో ఉంటే తప్పక ఫోను చేసుకోనిచ్చేవాడు - దానికీ ఓ కారణం ఉంది లెండి...

(ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com