స్మృతి లయలు

భాష ఏదైనా.. కథలకే పెద్దపీట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీక్లీ ఇంఛార్జిగా రాగానే - బాధ్యతనెత్తిన టన్ను బరువులాగా పడ్డది. సమన్వయ సమర్థత అనేది ఇంకా కష్టం. వీటికోసం బెరుకుగా భయంగా ఎక్కడ తప్పు జరిగితే అది ముప్పు తెస్తుందో? ఐతే, అప్పట్లో ప్రకటనదారుల బెదిరింపు తక్కువ. వెనుక అట్ట ప్రకటన కోసం డిమాండు వుండేది. మద్రాస్ మ్యూజియం క్యురేటర్ నీలం హరినారాయణరెడ్డి గారొచ్చాడు మా ఆఫీసుకి. తన వ్యాసాలమీద నా కథలమీద చర్చతో మొదలయింది మా దోస్తీ. ఆయన ఫ్రాన్స్ దేశంలో- అధికారికంగా మ్యూజియమ్‌ల మీద -అధ్యయన పర్యటన చేసి వచ్చాడు. కొన్ని వ్యాసాలు పారిస్ వింతలు అని అక్కడి ఫ్రెంచ్ మ్యూజియంల విశేషాలు కూడా బొమ్మలతో తెచ్చి ఇచ్చాడు. వాటిని లాయకీ చేసి వేశాము- ఆయన మంచి మేధావి- సాహితీ ప్రియుడు. ‘అయ్యా! నేను మీ ‘ప్లాట్ఫారం కథని ఎప్పుడో ఇంగ్లీషులోకి అనువాదం చేసి పెట్టుకున్నాను. ‘‘ఎలా కాంటాక్టు చేసి పర్మిషన్ తీసుకోవాలా? అని చూస్తూ వుంటే రాధాకృష్ణ గారే చెప్పారు మీరిక్కడే వున్నారు అని’’ అంటూ నా కథల మీద చర్చించారు నా ‘ప్లాట్ఫారం’ కథకి బాపు వేసిన బొమ్మ కూడా అందులో వున్న జీవనవేదనని ప్రతిబింబించింది అన్నారు -సరే, ఈ ప్లాట్ఫామ్ కథని కొండముది శ్రీరామచంద్రమూర్తి కూడా- నేనూ ‘‘చేద్దామనుకున్నాను’ అంటూ ఆ కథలో ‘ ఎగ్జిస్టన్స్ యాలిజం’ వున్నది అన్నాడు- సరే , నేను వీరాజీని ‘మునగచెట్టు’ ఎక్కిస్తాను అనగా వీరాజీ రాసిన ఆ పేరుగల కథని ‘డ్రమ్ స్టిక్ ట్రీ’గా ట్రాన్స్ లేట్ చేస్తాను అన్నాడు .
అంతేనా? 1976లో తను ఇండియన్ ఎక్స్ ప్రెస్ (సండే స్టాండర్డ్ )కి చేసిన రైటర్స్ ఆఫ్ రేప్యూట్ అనే సాహితీ ఫీచర్లో ‘టాప్లో’నెం.’’ త్రీ’’ గా వేశాడు. ప్లాట్ఫారం కథ ఇది- విశ్వం ఫ్రెండ్స్ కాలేజీ డేస్ లో-వాళ్ళ వాళ్ళ అసలు ఆశయాలు విశ్వం పరంగా అన్వయించుకుంటూ ‘ఒరే, నువ్వు కలెక్టర్ అవుతావురా నువవు టెన్నిస్ చాంప్ అవుతావురా.. నువ్వు అదవుతావు - ఇది అవుతావు- అంటూ ఊదర కొడుతూ ఉండగానే చదువులైనాయి -ఒక్కోడు ఒక్కోదిశగా ఇంటర్వ్యూలకి ఉద్యోగాలకి -చెక్కేస్తూ -బెజవాడ జంక్షన్ కనుక అతన్ని ప్లాట్ఫారం మీదకి రమ్మని-కలసి కబుర్లు చెప్పి తలోదారి పోతూ వుంటారు-ఒక్క అతని స్నేహితురాలు తప్ప అట్లా(కథలో)విశ్వం తను ప్లాట్ఫారం లాంటి వాణ్ని అయ్యాను స్టేషనుకి రమ్మనే వాళ్ళే తప్ప మాతో ‘రా’ అనే వాళళు లేరు అని నిస్పృహ చెందుతాడు. అతనికి ప్రేమ-సంసారం లాంటి మాటలన్నీ - హృదయభారమే అవుతాయి- ఈ ఫ్లాట్ఫారం నా కొద్దు దీన్ని తోసేస్తాను.. అనుకున్న విశ్వం -దాన్ని తొయ్యగలిగాడా ? అదే ముగింపు. దీన్ని సెంట్రల్ సాహిత్యఅకాడమీ వారి పత్రిక ఇండియన్ లిటరేచర్ ప్రచురించింది. హరినారాయణ -నీలంహరి అనే పేరుతో రాసేవాడు. ‘‘ఎద్దు’’ అన్న నా టిపికల్ (ప్ర)కథ-తను ఇంగ్లీషు చేసినదే లండన్ పత్రిక థాట్ అనేది వేసింది. పది కథలు వేసి- ఓ వీక్లీని తయారు చేసి హిగ్గింబాతంస్‌లో పడేస్తే చాలు అని అనేవాడు ఆనందవాణి కాళిదాసుగారు పది కథలు వేసి- ఓ వీక్లీని తయారు చేసి హిగ్గింబాతంస్ లో పడేస్తే చాలు హాట్ కేక్ అని అనేవాడు ఆనందవాణి కాళిదాసు గారు. కథలకి అన్ని దేశాలలో పెద్దపీటయే. నీలం వారితో మద్రాస్ మ్యూజియంకి వెళ్ళాను ప్రాంగణంలో చెట్ల క్రింద ‘‘పగడాలు’’ (గురివిన్దలా?) ఏరుకోడం కోసం-అటు తరువాత ఆయన మ్యూజియం డైరెక్టర్‌గా కూడా చాలాకాలం చేశాడు.
‘‘ఘోటక బ్రహ్మచారిని నాకు అనువాదము కోసం బోలెడు టైము కూడా వుంటుంది అనేవాడు. నేనూ, సభాపతి- నీలంహరి ముగ్గురం కలిసేవాళ్ళం అంటే మా చర్చ ఇంగ్లీషు ఫిక్షన్ మీదే. అట్లాగే రాధాకృష్ణ గారు- బోలెడు అనాలిసిస్ ఇచ్చేవాడు. చుట్టూ తిరిగి వోడవుస్ దగ్గర ఆగేవాడు. మద్రాసు సెంట్రల్ స్టేషన్ దగ్గర మై లేడీస్ గార్డెన్ అని ఓ పార్కు చిన్ని అందాల ఉద్యానవన- లవర్స్ పార్కు అనీ అంటారు- అక్కడో చిన్న సరస్సులాంటిది అందులో బోటుసైరు- అది మా మీటింగు పాయింటు (ఇప్పుడు లేదు) అది ప్రేయసీ ప్రియులకే కాదు మాలాంటి కబుర్ల రాయళ్లకి కూడా ‘‘పాయింటే’’ - లింకు భాష మనకి ఇంగ్లీషే - నీలమ్ వారి లాగే మేము మాత్రం బ్రహ్మచారులంగామా?ఐతే, తేడా వుంది. కాని ‘‘ఆడ-సంబంధం’’ మీద అసలు చర్చించే వాళ్ళం కాదు. అంతా లింకు సాహిత్యం మీదే .’’జార్ జ బెర్నాడ్ షా నాటకాలు మాత్రమే రాయగలడు , సోమర్సెట్ మాం సర్కిల్ అనే నాటకం రాసినా, నవలా రచయితగానే అతన్ని మనం చూడాలి అనేవాడు నీలంహరి. ఇంగ్లీషు ద్వారానేగా ప్రపంచభాషల సాహిత్యంతో మనకి లింకు ఏర్పడ్డది ఫ్రెంచ్ రష్యన్ ఇటాలియన్ భాషలలోని సాహితీ మాధుర్యం మనకి ఎట్లా అందింది? లింకు..ఆంగ్లమేగా. కాని మేము ఉంటున్న తమిళనాడులో అరవం మాత్రమే మాట్లాడాలి హిందీ ఊసు ఎత్తకుండా ఉంటేనే మంచిది కాని- హిందీ అన్నది ఉత్త్తరభారతంతో మనకి వున్న సాహితీ లింకు కాదా? అన్నది లోపాయకారీగా మా వాదన. సభాపతి అనేవాడు -తమిళ్ నుంచి నేను తెలుగు చెయ్యగలనేగాని-అంటూ బాధ పడ్డాడు- ఎన్ని చెప్పండి. తర్జుమాలో ఒరిజినల్ ఇది రాదు అనేవాడు రాధాకృష్ణ గారు . ఎందుకని సార్? మనం చదువుకున్న టాల్ స్టాయ్ -బాల్జాక్, ఆల్బర్ట్ మొరవియా, వగైరాని ఒరిజినల్స్‌లో ఎంజాయ్ చేసామా? నా కథ-ఆటకట్టు - మీరు భారతిలో వేసిందే ..రష్యా భాషలోకి తర్జుమాఅయి వాళ్లకి అవగాహనా అయిందిగా అన్నాను.
అయితే మన ఆంధ్ర పత్రిక త్రిభాషా సూత్రానికి -మన కేంద్ర ప్రభుత్వం దానికోసం శ్రీకారం చుట్టడానికి ముందే-కట్టువడిపోయింది - హిందీ పాఠాలు వేసేవారు. అది అలా వుంచి, హిందుస్తానీ పాఠకులు కూడా బాగా కథలు చదువుతారు వాళ్ళకి మాయా, మనోహర కహానియాన్ అనే హిందీ కథల మాసపత్రికలు -రెండు బోలెడు సర్క్యులేషన్ల మాసపత్రికలు. నేను చిన్నప్పుడు ధర్మయుగ్ -టైమ్స్ వాళ్ల హిందీ మాగజిను కూడబలుక్కుని చదివే వాణ్ని. కాస్త పెద్దఅక్షరాలు వెయ్యరాదా? ..నేను పత్రికలో చేరే దాకా నాకు ఈ డౌట్ తీరలేదు.
నాకు అర్థం కానిది ఏమిటీ అంటే?-అన్నాళ్లు ఒక్కటిగా సంయుక్తంరాష్ట్రంగా వున్నాం కాని తమిళ మలయాళ కన్నడ భాషలు మన మధ్య నలగలేదు.-సదరు సమకాలీన కథలు మనం వేసుకోలేదు. ఎంతసేపు బెంగాలీ గాలి మనకి సోకింది-మన ‘కంపోజిట్ స్టేట్’ కథలు ఇచ్చిపుచ్చుకోడాలు వాటిని తెలుగులోకి తీసుకొని అనువాదాలు చెయ్యడంగట్రా లేదు. మన కల్చరుకి దగ్గరగావున్నా భాషలలోని సాహిత్యం కథలుగా వారానికి ఓ తమిళ లేదా మలయాళీ కథలు వేసుండవలసింది అనుకునే వాణ్ని. కన్నడం భాషా సాహిత్యాన్ని ముఖ్యంగా త్రివేణి రచనలను బాగానే వేశాము. కాని మన భాషల సినిమాలు, పత్రికలూ కూడా మద్రాసు లోనే ప్రక్కప్రక్కన -ఉమ్మడి సిబ్బందితో తయారుఅయ్యేవి మరి.
ఏదో ఒక రకమైన భయం చేత కాబోలు- వీరాజీ అన్న పేరుతో గాక ఎక్కువ కృష్ణానంద్ అని లేదా పి.కృష్ణానంద్ అని ముఖ్యంగా సినిమా మీద తెలుగు సినిమా లోకం అంటూ సిరీస్ మొదలెట్టి తెగ వ్యాసాలు రాశాను. లేకపోతే మరో పేరెందుకు? ఈ వ్యాసాలమీద ఫిర్యాదులు వస్తే-సర్దుబాటు చేసి- డామేజి రిపేరు చెయ్యొచ్చు. రెండోది తనకేం? పేరు కోసం ఏదైనా వేసేసుకుంటాడు? అంటూ రెండ్సార్లు పేరు కనపడేసరికి - మన సహచరులు ప్రిజుడిస్ అవడం ఖాయం. అసలు కథలు (సినిమా) అంటే అర్థాలు వేరే ఉంటాయా? అన్న శీర్షికలో వీక్లీ లో కొన్ని కొంటె వ్యాసాలు రాశాను మన సినీ కథల ట్రెండ్స్‌ని ఎండగట్టేడు కృష్ణానంద్ అన్నారు. ఫీల్డులో ఇది బాగా నలిగింది. పాండీబజారులో నారాయణా కేఫ్ లో కలసిన జూనియర్ సముద్రాల గారు నాకు పెసరట్టు తెప్పించి పెట్టి మరీ ఓ గంట ఎడాపెడా.....
కథా అంటే? అది నిర్మాతని మొదలుకొని ఆఖరి నేలతరగతి ఆడియన్స్ దాక నచ్చాలే అంటూ చెప్పి అలసిపోయాడు.’’ ఇలాంటివి మీరు (అంటే వీరాజీ) రాయాలి -ఆయనెవడో ‘కిస్టానంద్’ ట, మరీ ‘కమ్మ’లు కట్టేస్తున్నాడు’’ అన్నాడు. ఆరుద్రగారు
‘తేనాం పేట’ ఎగ్జిబిషనులో కనబడ్డప్పుడు.. స్పీడు బాగుంది కాని సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి అని సినిమా కథ రాయడం కత్తిమీదసాము.. మనకెందుకూ?.. అని సలహా కూడా ఇచ్చాడు. శ్రీ ఆరుద్ర తన ముగ్గురు ఆడపిల్లలతో (బాగా చినవాళ్ళు) కనబడ్డాడు . కాసేపు కబుర్లు చెప్పుకున్నాక ‘‘ఎట్లా పోతారు?.. తిరిగి’’ అన్నాను- మాకో సైకిల్ రిక్షా వుంది అన్నాడు. కవితా లలితా త్రివేణి -ఆ రోజుల్లో మోబైకులే అరుదు- సైకిల్ (రిక్షా)యుగం అని ప్రధాని నెహ్రూ అంటూ వుండేవాడుగా.
అప్పట్లో ఆడపిల్లలు ఉద్యోగం చేస్తే అదనపు హోదా! మగపిల్లాడు ఉద్యోగం చెయ్యకపోతే రికామీ గాడు. బేవారిసుగాడు, అదీ సంగతి. మావాళ్ళు అంటే -పత్రిక లేడీస్ట్ఫా-‘‘ నెలాఖరున చీర ఒకటి కొనుక్కున్న తరువాతనే, ఇంట్లో జీతం ఇచ్చేవాళ్ళం అని చెప్పేవాళళు. స్కర్టులు లేడీ ప్యాంట్స్ గట్రా ‘‘ఇల్లే..’’నాడు. ఆరుద్ర మా ‘వీక్లీ కి ఇంటింటి పజ్యాలు అని చమత్కార కవిత్వం రాసేవాడు ‘‘పహలా... పహలా.. పచ్చీసు పరువం లోని లేడీసు -మగాళ్లతోటి సమానమంటూ ఎక్కారండి సైకిల్సు- అన్న ఆరుద్ర సిని పాటహిట్టు.
నేనూ... వాళళు ‘‘కట్టారండీ బిల్డింగ్స్ !’’అంటూ దాన్ని సాగదీశాను. అనకాపల్లి లోని ఓలేడి తాపిమేస్ర్తిని గురించి బొమ్మతో ఇంటర్వ్యూ తెప్పించి వేశాను.
భాషకి కంపోజింగు ఏమిటి సంబంధం?
మాకు వీక్లీ లోను డైలీ లోను కూడా -మోనో కంపోజింగు -తగరం మూస అక్షరాల కంపోజింగు వుంది.. స్పీడుగా అవ్వాలి అంటే -తప్పదు. వౌనము ఔదార్యము -లాంటి మాటల మూస అక్షరాలు అసాధ్యం. ఈ సంగతి తెలియకుండా ఓ మహా రచయిత్రి నిష్టూరంగా రాసింది. మీకు వౌనం రాయడం రాదా ? అంటూ తోకమీద లేచింది. నవ్వుకున్నాము. డిటిపి ఎలక్ట్రానిక్ కంపోజింగ్ వచ్చేదాకా. ఎన్ని అవస్థలు పడ్డామో? కొందరు రచయితలు నోరు తిరగని చిత్రమైన పేర్లెట్టేవారు పాత్రలకి. సరళంగా రాయండి పేర్లు.. అని మా రిక్వెస్టు. శ్రీలక్ష్మి, క్షీరసాగర్ అబ్భా?...మృదుల ఎంత కఠినం.. అట్టి తరి : మేము సమకాలీన తమిళ కథలను ఎత్తి అనువదింఛి వెయ్యాలి అనుకుంటూనే.. నేను దినపత్రికలోకి బెజవాడకి మారిపోయాను- వీక్లీ ఊసులు వదిలేశాను.’’కథలు రాయడం లేదా? అంటే- రేడియోవాళ్ళు యువ, జయశ్రీ జ్యోతి లాంటి పత్రికలకి వాళళుఅడుగుతూనే వుండేవారు కనుక రాసేవాణ్ణి. కథలు రాయడం మానేశారా? అని మా రా.కృగారంటే-ఓ కథ రాసేవాన్ని అల్లా రాసినదే, నా ‘కరివేపాకు’- అదీ మాయ అనే కథా-ఎనలేని పేరు తెచ్చాయి. మాయ అంటే జ్ఞాపకం వచ్చింది మద్రాసు లొకేషను. తేనాంపేట కాంగ్రెస్స్ గ్రౌండ్‌లో జరిగే ఎగ్జిబిషన్ని వాడుకున్నాను. (బెజవాడ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లాంటిది) రోజులలో అదే స్టార్ అట్రాక్షను. మరోసారి ఎగ్జిబిషన్ - ఆదివారం నాడు వెళ్లాను. దొరికిందో జంట. వాళ్ళని నేను జైంట్ హీల్ మీదా కూడా ఫాల్లో అయ్యానని వాళ్లకి తెలియదు. ‘స్టోరీ మాయ’ కథలో ఆ ఇద్దరే నా పాత్రలు. ‘‘రూపాయి రొమాన్స్‌ని కూడా కంట్రోలు చెయ్యగలదు.’’ మనస్తత్వ విశే్లషణ రెండే పాత్రలు వున్నప్పుడు చాలా అవసరం అట్లాగే సుఖం కోసం నవలకి కూడా నేను మద్రాసు రంగస్థలం చేసుకున్నాను- దీనికి బీజం 1961లోనే అప్పుడు వీక్లీ వారు కథకుల ప్రత్యేక సంచిక వేస్తూ నన్నూ అడిగారు. సుఖం అన్నకథ రాశాను దానే్న నవలగా మలచి-1966 (చాలా కాలం పట్టింది) లో మద్రాసులో పూర్తి చేసాను.’ ’67లో ఇంటింటి గ్రంథాలయం సిరీస్ లో (11)గా పబ్లిష్ అయ్యింది.
‘‘ఎమెస్కో’’ బాస్ శ్రీ రావుగారు ఎం ఎన్ రావుగారు దొడ్డమనిషి ! (ఫ్రాంక్ఫర్ట్ లో జరిగిన వరల్డ్ బుక్ ఫెయిర్కి దీన్ని పంపారు. ఈ సుఖం కోసం’ నవలకి బాపు వేసిన థీముగల- ముఖచిత్రానికి ఒక అవార్డు.. నాకు ఇటాలియన్ భాషలోకి అనువాదం చేస్తామన్న ఆఫరూ వచ్చాయి.
(ఇంకా బోలెడుంది)

-వీరాజీ veeraji.columnist@gmail.com 92900 99512