స్మృతి లయలు

అర్ధరాత్రి ఎయిర్‌పోర్ట్‌లో సినీ సందడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరవై నాలుగు, జూన్ 28 రాత్రి అక్కినేని నాగేశ్వరరావు కోసం మధ్రాసు మీనంబాక్కం ఎయిర్‌పోర్టుకు వెళ్లాను. అభిమానులు, హితైషులు ఎందరో వున్నారు. అమెరికా పర్యటన ముగించుకొని తిరిగి వస్తున్న తెలుగు వాళ్ల ‘దేవదాసు’ని ముందుగా పలకరించి నాలుగు మాటలు ఏర్చికూర్చి మర్నాడు ఉదయం - వీక్లీకి ఎక్కించాలని అదో కోరిక. మర్నాడే వీక్లీ అంతా రెడీగా ఉంది. వీక్లీ ప్రింటింగ్ మొదలైపోతుంది. కానీ దఅమిటో సాధారణంగా అక్కినేని విమానం నాలుగైదు గంటలు లేటు అయిపోతూ ఉంటుంది.
ఓసారి బెజవాడలో మరోసారి రాజమండ్రిలో మాకు ఇది బాగా అనుభవమే.
ఆకాశం మేఘావృతమై ఉంది - కానీ సాయంకాలం వీరి కోసం వచ్చిన నాటి మేటి నిర్మాతలు, దర్శకులు, అభిమానులు, మరి కొందరు నటులు కూడా వున్నారు. కాక కొంతమంది ప్రెస్సు వారు (నాతో సహా) వున్నారు. అర్ధరాత్రి అయినా ఎవరూ తిరిగిపోలేదు. వచ్చిన వాళ్లలో అమెరికా సమాచార శాఖ ఏక్టింగ్ కల్చరల్ ఆఫీసర్ ఫ్రాన్సిస్ కవర్ట్, వారి తెలుగు చీఫ్ ఎడిటర్ బి.ఎస్.ఆర్.కృష్ణ ఉన్నారు. హేమాహేమీలు అంతమందీ వున్నారు. కానీ కుర్ర ఉత్సాహంతో నేను అర్ధరాత్రి దాటిన అరగంట తర్వాత - విమానం దిగి ముందుకు వస్తున్న నాగేశ్వరరావుని పట్టుకున్నాను. అతనిని - ఇప్పుడు మన భూమి మీదకు అడుగు పెట్టంగా ఎలా ఉంది? అంటూ చెవుల్లోకి అరిచాను. చేతులు పట్టుకు వూపుతూ వదిలి ‘్థంక్స్ థాంక్స్’ అన్నాడు. ‘్భలేగా ఉంది’ అంటుంటే ‘నేను ఆంధ్రపత్రికని.. ప్రొద్దునే్న మిమ్మల్ని పట్టుకుంటాను. ఎక్కడ ‘బస?’ అంటూ అరిచాను. ‘ఉడ్‌లాండ్స్.. ఉడ్‌లాండ్స్ కాటేజీ’ అన్నాడు.
అవతల నాగయ్య, గుమ్మడి, ఆదుర్తి, ప్రత్యగాత్మ, డి.మధుసూదనరావు వగైరాలు, హీరోలు కాంతారావు, జగ్గయ్య, జెమినీ గణేశన్, జానకి, కృష్ణకుమారి, జమున, సావిత్రి, సూర్యకాంతమ్మ అందరూ వున్నా పత్రిక వాళ్లకి పోజులిచ్చాడు.
‘టుమారో మార్నింగ్ అనగా టుడే మార్నింగ్’ అంటూ కదిలాను.
అక్కడ నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఉడ్‌లాండ్స్ కాటేజీకి ఎలా వెళ్లానో? నాకే అర్థం కాలేదు. అదో అడ్వంచర్. ఎయిర్‌పోర్ట్‌లో వున్నంతసేపు ఫ్రెండ్స్‌తో, బి.ఎస్.ఆర్. కృష్ణతో బాగానే కాలక్షేపం అయింది. ‘ప్రభ వెంకట్’ని పట్టాను. అతనో కారులో వచ్చాడు. మనకి ‘లిఫ్టు’ కావాలిగా. బి.ఎస్.ఆర్.కృష్ణ అమెరికన్ సమాచార పత్రిక ఎడిటర్‌గానే కాక, నాకు మంచి ఫ్రెండ్. అంతలో ఎవరో వచ్చి బి.ఎస్.ఆర్.ని చూస్తూ ‘మీరు అక్కినేని డ్యూపా?’ అని అడిగాడు.
- అసలు కృష్ణగారు బాగా పొడుగ్గా, కాస్త వీపు వంగి ఉంటాడు. కాకపోతే పొందూరు ఖద్దరు పంచె, లాల్చీ, కండువా అవీ అక్కినేని మాదిరిగానే ధరిస్తాడు. కాస్త బట్టతల కూడా. నాగేశ్వరరావు పోలికలుంటాయి. అంతవరకు. కానీ ఎక్కడా అసలు పోలికలు ఉండవు. అందరికీ కడుపుబ్బ నవ్వు వచ్చింది.
ఈయన కాదు డ్యూప్.. అదుగో అక్కడ వున్నాడే. అతను అక్కినేని ‘డ్యూప్’ అంటూ బెజవాడ నుంచి వచ్చిన మా ఏజెంట్‌గారి అబ్బాయి నిమ్మగడ్డ రాజేంద్ర ప్రసాద్‌ను చూపించాను. సినిమా స్టార్‌ల పటాలం జోలికి సినిమా జర్నలిస్టులు అటు పోవడంతో మేము ఇంచక్కా కబుర్లు చెప్పుకున్నాం అర్ధరాత్రి దాకా.
మర్నాడు ఉదయం అక్కినేనికి ‘ఆంధ్ర సచిత్ర వారపత్రిక’ అభినందనలు, అభినందనలు! అంటూ పలకరిస్తూ హాజరైనాను. అందంగా, ఆనందంగా కనపడుతున్నారు అన్నాను - ఆనందంగా.
స్నానం చేసి పదహారణాల తెలుగు వేషంలో వచ్చిన అక్కినేని మహదానందంగా ఇంకా రెండు రోజులు ఆగితే ఇంకా అందంగా కనిపిస్తాను. అసలు ‘మలయా’లోనే అలసిపోయాను.. మన తెలుగు, మలయాళ, తమిళ సోదరుల కార్యక్రమాలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. కాస్త బడలిక - నాలుగు పౌన్లు బరువు మాత్రం తగ్గాను’ అన్నాడు.
ఈ పొందూరు ఖద్దరు పంచె, జుబ్బా తెలుగు వేషం అక్కడి వాళ్లకి ఎంతో నచ్చింది అన్నాడు. కాకపోతే వీటిని ఉతికించి ఇస్ర్తి చేయించుకోవడంలో ఇబ్బంది, చేత ఎక్కువ ఈ దుస్తులు ధరించలేక పోయాను అని చెప్పాడు.
మీ అనుభవాలు రాసి మాకే ఇవ్వండి. సీరియల్ చేస్తాము అంటూ ‘మాట’ తీసుకుని వచ్చేశాను షేక్‌హ్యాండ్ ఇచ్చి.
ఆఫీసుకు ఉరకలు తీశాను. వీక్లీ ‘రోటరీ’ మీద - స్టేషన్ వదిలే రైలు ఇంజన్‌లాగా రెడీ - ‘ఆగండి... ఆగండి’ అంటూ పైకి పోయి పర్యటనానంతరం ఆనందంగా.. అక్కినేనితో వెంటనే పది నిమిషాలపాటు కబుర్లు వీరాజీ - అంటూ రాసి ఎనిమిది గంటలకి వర్కర్లు డ్యూటీ ఎక్కగానే. తలో ముక్క పేజీ చింపి ఇచ్చి, కంపోజింగ్ చేయించుకున్నాను. చివరి పేజీ పీకి పడేసి అందులో ఇది పెట్టి వీక్లీని వదిలాను. ఈ ప్రక్రియనే ‘రిప్ ఓపెన్’ అంటారు.
తృప్తిగా ఉంది. ‘థ్రిల్లింగ్’గా వుంది. ఇదేదో ‘డైలీ’ మాదిరి చేశాను. వీక్లీ కోసం - ఆంధ్రదేశంలో ప్రేక్షకులకు ఇది మూడోనాడే అందిపోతుంది అన్న ఆనందమే అందుకు కారణం. పాఠకుల ఆనందమే మాకు మృష్టాన్న భోజనం అనుకుంటూ రూముకు వచ్చి నాన్నగారు లేచి, దిగిన ఆయన ‘పడక’ (అంటే గోద్రేజ్ పొడువాటి బల్ల) మీదకి ఎక్కి నిద్రాదేవి వొడిలోకి జారుకున్నాను.
(ఈ ఇంటర్వ్యూ పూర్తి పాఠం 1964 జులై, 17 సంచికలో వుంది)
‘దిన ‘వార’ పత్రికల అంతరం!
వారపత్రిక అంటే నాలుగు సీరియల్సు - ఐదు కథలు, ఆనక సినిమా కబుర్లు, తారల బొమ్మలు మాత్రమే అనుకుంటే పొరపాటు. ప్రపంచం, దేశం, స్థానికం ఇలా అన్ని అంశాల మీద వైవిధ్యం, సమాచారం, రొమాన్స్ వున్న అంశాలు ఉండాలి. వీక్లీకి ‘రాజకీయాలు’ లేవు అనడానికి వీలు లేదు. శ్రీకృష్ణగారి ఢిల్లీ లేఖ, వూమెన్‌గారి కార్టూన్స్ అవీగాక హైదరాబాద్ లేఖ ఇది మస్టు - కాకపోతే ‘కరెంట్ అఫైర్స్’ చెప్పే లోటు పూడ్చటానికి నా శీర్షిక ‘తాజాకాలమ్’ లాంటి శీర్షికల్ని రూపొందించాము.
ఈ రోజుల్లో ‘ఖగోళం’ మీద, అంతరిక్షం మీద వున్నంత జ్ఞానం భూగోళం మీద వుండటం లేదేమో? గాని, నాడు ప్రపంచాన్ని పాఠకుల దగ్గరికి తేవడానికి ‘సిండికేటు’ వ్యాసాల ధర్మమా? అని వుండేది. సినిమా - హాలీవుడ్ సినిమా - స్టార్‌లలో గ్లామర్ ప్రఖ్యాతిగల నటీమణుల కథలు వాళ్లు గగుర్పొడిచే విధంగా, బొమ్మలతో వేశాము. మార్లిన్ మన్రో, ఎలిజబెత్ టేలర్ విచిత్ర కథలు - సోఫియా విచిత్రగాథ - రీటా హేవర్త్ వంటి వారి జీవిత కథలు జాగ్రత్తగా అనువాదం చేసి వేశాము. ‘టెంపిల్‌మాన్’గారి దేశ దేశాల వింతలు అంటూ వారానికో దేశం చిత్రాలు, వివిధ ప్రపంచ నాయకుల సంక్షిప్త కథలు వుండేవి. ‘వెరైటీ’ అన్నది జీవితాన్ని శోభింపచేస్తుంది. అన్నట్లుగా ఇంగ్లీషు భారీ చిత్రాలు స్క్రిప్టులు ‘టెన్‌కమాండ్‌మెంట్స్’ ‘బెన్‌హర్’ చిత్రాల కథలని వాటి బొమ్మలతో పంపిణీదారుల నుంచి - హక్కులు తెచ్చి మరీ అందించాము. ‘క్రిస్టిక్‌కీలర్’ కథని హక్కులు కొని వేశాము. ఇదంతా మేమే అనువాదం చేసుకునేవాళ్లం. మాకు రాధాకృష్ణగారు కూడా ‘్ఫల్‌టైమ్ స్ట్ఫార్’లాగే అనువాదాల విషయంలో తోడ్పడేవారు.
నాటి వారపత్రికలు ఏ విధంగానూ ‘ప్రిమిటివ్’ కాదు. రైలుబండ్లలలో పతివ్రతల కథలు, భక్త విజయాలు, మదనకామరాజు కథలతోపాటు అలాగే రైలు బండి ప్లాట్‌ఫామ్ మీద ఆగంగానే వారపత్రికల్ని కూడా పట్టుకుని వెండర్లు బోగీలోకి ప్రవేశించేవారు. నాకు, ఉమ్వెలా మార్ఫిన్ అనే ఐర్లాండ్ అమ్మాయి కథ అలా జ్ఞాపకం ఉండిపోయింది రాస్తూన్నంతసేపు, నిజమా? కల్పనా? అనిపించింది.
సైకిల్ మీద ఐర్లాండ్‌లోని తన గ్రామం నుంచి బయలుదేరింది. ఒంటరిగా 1963లో మన సంక్రాంతినాడు మొదలుపెట్టిన ఆమె రెండు చక్రాల సాహసయాత్ర చేసింది. భారతదేశం మీద ఆమెకి గల ‘మక్కువ’ మోజు అంతా ఇంతా కాదు. పధ్నాలుగు మాసాల పాటు కేవలం నూరు నాలుగు బ్రిటీష్ పౌండ్ల ఖర్చుతో ఆ యువతి సాహసంగా ప్రయాణించింది. ఫ్రాన్స్, ఇటలీ, యుగోస్లావియా, బల్గేరియా, ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్‌ల మీదుగా ‘హిందుస్థాన్’ చేరిన ఆ అమ్మాయి లగేజ్ ఎంతో తెలుసా? వాళ్ల నాన్నగారి వాచీ, ఒక దిక్సూచి (కాంపాస్), ఒక స్పేర్ సైకిల్ టైరు, ఒక సైకిల్ చైన్ ముక్కలు, పంచర్ సరంజామా, పెన్ను, కాగితాలు వగైరా, నెహ్రూగారి డిస్కవరీ ఆఫ్ ఇండియా బుక్, ఐర్లాండ్ కవి బ్లేక్‌గారు రాసిన పొయిట్రీ బుక్.
ఇలాంటి సాహస గాథలు- సెక్సు కథలలాగే పాఠకులు చదువుతారు. ఎలిజబెత్ టేలర్‌లాగే ‘ర్లీలూ’ హేవర్త్ కూడా ఐదుసార్లు పెళ్లి చేసుకుంది.
టర్కీలో నైట్ క్లబ్బులలో (కాబ్రే) డాన్సులు రాత్రి నగ్న ప్రదర్శనల మీద బొమ్మలతో వ్యాసం వేస్తే పాఠకులు ‘కర్రుచ్చుకున్నారు’. ఉత్తరాల ‘దాడి’ చేశారు. ఇన్ని ఉన్నా ఈ ‘ఎరువు’ రొమాన్స్ కథలకన్నా, మన వాళ్ల సాహస కృత్యాలు కూడా అందించాలనే ‘తపన’ వదలలేదు. సినిమా నటులు విదేశీ పర్యటన చేసొస్తే, ఆ పర్యటన కథలు వేసేవాళ్లం. చాలా తరచుగా కథల పోటీలు, సీరియల్ పోటీలు పెట్టి నవలలు ఎంపిక చేసుకోవడం అసలు మానలేదు. ఎందుకంటే విస్తట్లో వరి బియ్యం అన్నం, పప్పు వడ్డిస్తేనేగా మృష్టాన్న భోజనం కాదు. పైగా తెలుగువాడు పచ్చళ్ల దాసు. నంజుళ్లు ముఖ్యం. అవి చాలా కావాలి.
అరవై నాలుగు జూన్‌లో కాబోలు రాధాకృష్ణ గారితో మాట్లాడుతుండగా ‘నసుగు పుట్ట’ అన్న మాట వచ్చింది. భలేగా వుంది. ‘నసుగుడు’ అన్న శీర్షిక పెడదామా? అన్నాడాయన. హమేషా తమేషా ఎలాగూ వుంది - దాని వ్యంగ్యోక్తుల విమర్శనాస్త్రాలు సంధించే సరదా కాలమ్ వుండాలి అనుకున్నాం. ‘నక్షత్రకుని నసుగుడు’ అంటూ ఓ మంత్రిగారి పిల్లలు విదేశాలలో చదువుకోవడం మీద; ఇందిరాగాంధీ గారి పిల్లలలో ఒకరు లండన్ చదువులకి విదేశీ మారక ద్రవ్యం ఎక్కడిదీ? లాంటి అంశాల మీద రాశాం. అలా పుట్టింది ‘సామాన్యుని సణుగుడు’ ఐడియా నాకు. ఎప్పుడూ నాకు ‘కామన్ మేన్’ హీరో. దాంతో ‘నక్షత్రకుని’ ఎత్తేశాం.
ప్రవాసంలో వున్న తెలుగు వారి పెళ్లిళ్లు, సన్మానాలు వగైరా నేడు వేయనవసరం లేదు. కానీ నాడు మరో స్కోప్ లేదు. కనుక వేయాలి. ఉదాహరణకి 64, ఆగస్టులో కృష్ణకుమారి సోదరుడు రాఘవేంద్రరావు పెళ్లి, అల్లు రామలింగయ్య గుంటూరు సన్మానం అ.ఇ.అ.లో పడితే ఉత్తరాలు కుప్పలు కుప్పలుగా వచ్చాయి. మా రోజుల్లో ఫొటోలు వేయడం అంటే మహా కష్టం. అదంతా కాల హరణం ‘ప్రాసెస్’. ఇలా ‘నొక్కు’ అలా ‘తోసెయ్యి’ అనడానికి వీలు లేదు.
వర్ధమాన సినీ నటులు, సాంకేతిక నిపుణులు, ముఖ్యంగా రూపవాణి సంపాదకుడు మాగాపు రామన్, పేకేటి శివరాం లాంటి వారుగాక కాశీనాథ్ అనుకుంటాను, అతను వచ్చి నా టేబుల్ మీద, తన ‘క్లోజ్డ్ మ్యాజిక్’ చూపించేవాడు. నటుడు రామకృష్ణ వచ్చాడొకసారి. తను నటిస్తున్న స్టిల్ ఫొటో ఒకటి ఇచ్చి వీక్లీలో ఒక వారం పడేయండి అన్నాడు. బాగా పొడగరి. ఆనాటి వర్ధమాన హీరోలు ఇద్దరు, రామకృష్ణ, హరనాథ్‌లు హైట్ వున్నవాళ్లు.
తెలుగు వెండి తెర మహానటులలో కేరెక్టర్ నటులు ఎస్.వి.ఆర్. ముక్కామల, ఆర్.నాగేశ్వరరావు బాగా హైట్ వున్నవాళ్లు. సర్వసాధారణంగా మా బ్యాలెట్‌లో ఎంపికయ్యే సహాయ నటుడు చంద్రమోహన్. ఎప్పుడూ సహాయ నటుడేనా? అంటూ ఒకసారి ఫోన్ చేశాడు. అవును. మంచి నటుడు. హీరోయిన్లుగా వచ్చిన అందాల భామలు అతని సరసన వెండితెర అరంగేట్రం చేసి, ఆనక ‘స్టార్స్’ అయిన వాళ్లు వున్నారు. ఓ పిడికెడు పొడుగు ఉంటేనా? అనుకునే వాళ్లు. పేకేటి ‘వర్స్‌టైల్’ ఆర్టిస్టు. అతని పెద్ద కుమారుడు రామమూర్తి మా టైమ్ ఆఫీసులో టైమ్ కీపర్‌గా ఆనక చాలా చక్కగా పని చేశాడు.
ఆంధ్రపత్రికలో మొట్టమొదటి ‘బ్యాలట్’లో చిత్తూరు వి.నాగయ్యగారు ఉత్తమ నటుడిగా వచ్చాడు. తరువాత ఇద్దరే టాప్‌కి ‘రాసాగారు’. ఎ.ఎన్.ఆర్.గారు, ఎన్.టి.ఆర్. గారు. కొన్నాళ్ల తరువాత ‘నన్ను బ్యాలెట్ నుంచి మినహాయించండి. కొత్త నటులకి అవకాశం వస్తుంది’ అని ఉత్తరం రాశారు ఎన్‌టిఆర్ స్వయంగా.
నేను అనేవాణ్ని, ఈ బ్యాలెట్ పెడుతున్నాం సైంటిఫిక్‌గా లెక్కలు తీసి నటీనటులకు ఓట్ల శాతం కూడా చెపుతున్నాం. ఒక చిన్న ఫంక్షన్ పెట్టి, చిన్న మొమెంటో, ఆ నటీనటులకు ఇస్తే, ఉభయ తారకంగా ఉంటుంది అని. మద్రాస్‌లో అలాంటివి చాలా కష్టం. వద్దు సార్ అనేవాడు రాధాకృష్ణగారు. పోనీ బెజవాడలో పెడదాం. పైగా అమృతాంజన్ ప్రాంగణంలో పెడదాం. అంటే అది చాలా చాకిరీ. మనకు పబ్లిసిటీ ఎందుకు? అనేవాడు మా చీప్ - చీప్ మాట మాకు వేదవాక్కు కదా? మన చేతిలో జి.వి.జి, మనోహర్, ఇంకా ఎందరో సినీ జర్నలిస్టులు వున్నారు - అంటే ‘లెటజ్ ఛేంజ్ ది టాపిక్’ అనేవాడు. ఈ కొత్త ‘ట్రెండ్స్’కీ, ఆంధ్రపత్రిక పేరు పడితే బాగుండు ననిపించేది నాకు...
(ఇంకా బోలెడుంది)

-వీరాజీ veeraji.columnist@gmail.com 92900 99512