స్మృతి లయలు

ఆ ధొరగారి పేరిటే.. ‘వించిపేట’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితం గుర్రబ్బండీని - గుర్రం లాగుతో ఉంటుంది కళ్లెం మన చేతిలో వుంది కనుక మనం తోలుతున్నాం అనుకుంటాం గాని ఈ బండి తోస్తుందో లేక ఆ కంచర గాడిద పరుగులు తీస్తుందో తెలియదు అదో మిస్టరీ - అది దాని మలుపులు తిప్పుకుంటూ - దారి తెలియని భవిష్యత్తులోకి పరుగులు తీస్తూ వుంటుంది - మనం తోలుతున్నాం అనుకోడంలో ఆశ వుంటుంది.. కాని బ్రతుకు బందీలం బండి ఎటుపోతే అటే.. మన గమ్య నిర్ధారణ జరిగిపోతుంది.
అక్కడ సూర్యోదయం బద్ధకంగా ఇష్టంలేని గలీజు రోడ్ల మీదకి కిరణ హస్తాలూ జాచ లేకుండా వున్నట్లుంటుంది. దూరం నుంచి గుడిగంటలు - బడిగంటలు విన రావు దూరంగా రైలు కూతలు వినబడుతాయి - మసీదు బురుజు మీద కెక్కి - సూర్యుడికి వ్యతిరేక ముఖంగా తిరిగీ - అల్లాహో.. అక్బరో అని తన చెవులు మూసుకుని - ఎలుగెత్తి అరిచే వౌలాల కి బాకా లౌడ్ స్పీకర్ల సహాయం లేదు కనుక నమాజ్‌కి అరుపులు మేలుకోలుపుల్లగా లేవు; పని పాటల కోసం బద్ధకంగా ఆకలి పొట్టలతో లేచే - సత్తార్లు, శిలార్లు, అహమ్మద్ మియాన్‌లు చోటీ మాలు బడి బూబమ్మలు, పోలయ్యలు, కోటమ్మలు, మరియమ్మలు..
-అదొక చిన్న ఇరుకు గల్లీ లోపలి చివర మలుపు - ఆ రోడ్డు పోయి గుట్ట మీదికి మలుపు తిరిగే దగ్గర ఒక మెట్లు లేని చోటాస - ఏక్ - ఘర్ అస్ మే హం. వెలుపల మురికి కాలువ నిండుగా - బురద గడ్డలుగా వున్నది పగులగా ఏర్పడ్డ నెరదలో నుంచి నల్ల ఐసు గడ్డలు పగిలినట్లు - నీరు సన్నగా ముందుకి - జారుతున్నది. చిన్న బాతు పిల్లలు గుణ గున ఈదులాడుతున్నాయి - అవే నాకు కథలలో మా నాయనమ్మ చెప్పిన హంస పిల్లలు ఈదులాడుతూ వుండగా అన్నట్లుంటాయి. - అది ఒక, నా బాల్యోదయం.
ఓ జటకా బండి ముందు చేతులు ఇలా రోడ్డు మీదికి పెట్టుకుని - బల్లమీది బొమ్మలో కుక్కలాగ ముందుకాళ్లు చాచి పడుక్కుంది.. మా గుమ్మంలో. దాని ప్రక్కనే - గుర్రం.. బక్క గుర్రం మధ్యమధ్య తుమ్ముతున్నది - అహామద్భాయ్ వచ్చి ఉలవల చిక్కం దానికి కట్టాలే, అది తోక నెమలి పింఛం విప్పినట్లు ఎగురవేయ్యాలె.. నేను తమ్ముడూ ప్రక్కన దూలానికి కట్టిన గుడ్డ వుయ్యాల్లో వున్న తమ్ముడూ-
మళ్లీ ఇంచిపేటకే వచ్చాం - ఆ గుర్రపు బండీ మాదే. మా అమ్మని ఆసుపత్రికి వెళ్తానంటే - అహమ్మద్ భాయి రెడీ చేస్తాడు. మా మామ్మ (బామ్మ) వూళ్లో వుంటే - మూల గదిలో - దేవతార్చన ధూపం దీపం సందడి - తను వైజాగ్ - మా బాబాయిలిద్దరూ అక్కడ వుండేవారు - వెళ్తే నో నైవేద్యం. చిన్నానలు అనేవాళ్లం బాబాయిల్ను. ఇస్కోలు లాంటి దానిలో వేశారు గాని - కాగులో వేన్నీళ్లు కాగేదాక - ఈ పెద్దాడు లేవడుగా.. పెద్దాడు అంటే నేనే - ‘ఇంటికి పెద్ద కొడుకుని.
‘బాబు’ అంటే మా నాన్నగారికి వాళ్ల విజయనగరంలో పెట్టబడ్డ ముద్దు పేరు - ఆఫీసుకి పోయే - ఆదుర్దాలో - మరో అరకప్పు ఫిల్టర్ కాఫీ చప్పరించి ‘ఇక్కి షెడ్డు’ (అంటే ఇప్పుడు మోదిజీ దానికే ‘ఇజ్జతు ఘర్’ అని పేరు పెట్టాడు. ఆ మరుగుదొడ్డి అన్నమాట)కి వెళ్లేవారు.. మేము కంసాలిపేట.. ఆనక అదే రాజరాజేశ్వరి పేట అయ్యింది నుంచి ఇల్లు మార్చేశాం - కారణం బుడమేరు ఒకటి తమ్ముడు (నాగేశ్వరరావు) పుట్టాడు - మా మేనత్త నా ఈడు కూతుర్ని మా దగ్గరే (కమల) వదలి వెళ్లింది. అక్కడ ఆ అడవిలో - ఏమీ దొరకవు - మండ్రగబ్బలు తప్ప. అప్పటి వర్తమానం యిది (ఇప్పుడా పేటలో ఇల్లు అమ్మితే రిచ్ అయిపోతాము - కొనలేము ‘ఇంచి’ల్లెక్క వెల గడుతున్నారని వినికిడి) మళ్లీ ఇంచిపేట ‘సారీ! అది ఇంచిపేట కాదు సెంటిమీటరు నగరు కాదు..
‘వించిపేట’ నాకు నలుగురు తమ్ముళ్లకి ఇద్దరు చెల్లెమ్మలకి సొంత వూరు అమ్మ తరువాత అమ్మ. బెజవాడ వూళ్లోని మొట్టమొదటి వార్డు మాదే అవడం గొప్పే మరి... చిన్న పిసరు చరిత్ర ఆనక మళ్లీ భూగోళం. బెజవాడ మునిసిపాలిటి 1888 ఏప్రిల్ 3న పుట్టింది. దాని జనాభా 9,336 ట. అంతా కలిపి రెండువేల గడప దాని ఘనత. బెజవాడ అసిస్టెంట్ హెడ్డు కలెక్టర్ దొరగారు ఎల్ ఎం విన్చ్ - దొరగారే దాని తొలి మునిసిపల్ చైర్మన్ - కూడా అయ్యాడు. అతని పేర ఈ మొదటి వార్డు పెట్టారు - ఎనభై చదరపు గజాల పొలం వుంటే ఓ కానీ పన్ను - అదే ఇల్లయితే అణా కాసు చాలు. అస్మంటి నగరం మేము వచ్చేసరికి (437) ఎలక్ట్రిసిటీ, పరిశుభ్ర జలం, మురుగు కాలువలు లాంటి పట్టణ సదుపాయం అన్నీ ఉన్న నగరం అయింది. మా ఇంటికి - అలా అనకూడదుట మా అమ్మ ఉవాచ - పెద్ద వదిన వున్నది గనుక ఆ తండ్రి లేని బాబాయికి మా ఫాదర్ గార్డియన్.
అసలు ఇన్త్య మహానగరం టూ టవున్ కూడా వుండగా - మేము ఈడ కేల వచ్చి సెట్టిల్ కావలె - ఎందుకంటే - మా నాన్నగారిది ఆంధ్రా సిమ్మెంటు కంపెనీ ఉద్యోగం. ఈనాడే కాదు, నాడూ ఉద్యోగికి దూరభూమి ఉండేది కాదు- అలాగే దూర (డిస్టెన్స్) భూమి అని ఉద్యోగాన్ని వదలకూడదు. సదరు సిమెంట్ ఫ్యాక్టరీ ఈ పేటకి కూతవేటు దూరం. మాకు రైలు కూతలు ఫ్యాక్టరీ సైరన్ కూతలు, కాళేశ్వరరావు మార్కెట్ సైరన్ కూతలు - ఇవన్నీ కోయిల కూతలే.. ఇంకో పాయింటుంది - మా అమ్మ వాళ్ల పెద్దన్నయ్య - పూడిపెద్ది సూర్యనారాయణ అను సూరిబాబుకి మా నాన్న చలవన్ సిమెంటు ఫ్యాక్టరీ - లేబర్ సూపర్‌వైజర్ జాబు మాకు ముందే వచ్చేడు - ఇటు ఇల్లు అటు పాటలు దాటితే ఆఫీసు - అంచేత నారాయణరావు గారే మాకు సెక్యూరిటీ - అలా వచ్చాము- రైలు పట్టాలు వరసాగ్గా ఓ అరడజను జంటలయన్లను - సమాంతరంగా వున్న వాటిని దాటితే అవతల ఆఫీసు రేవుకి - కాకపోతే, అది గూడ్సు షంటింగు యార్డు - వాగన్లు ‘్ఫడ్‌బాల్స్ లాగా గూడ్సు పెట్టెలు అటూ ఇటూ కొట్టేసుకుంటూ వుంటాయి - క్రింద నుంచి రైలు ఇంజను ఆగినప్పుడు - పెట్టెల క్రింద నుంచో పక్కనుంచో దూరి అవతల గట్టుకి చేరాలి.
(ఇంకా బోలెడుంది)

వీరాజీ.. 92900 99512 veeraji.columnist@gmail.com