స్మృతి లయలు

స్మ్యతిలయలు-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇవాళ ఏధి రాయాలన్న అనుమానాలు - స్పీడు బ్రేకర్లు - భయం భీతి కాని నాడు పాలపళ్లు వూడుతున్నప్పుడు, ఆ బాలుడికి - గసడ దవలే కాని కచటతపలు ఉంటాయని తెలియదు- అలాంటి బాల మనసుల కోసమే కాబోలు ‘బాల’ పత్రిక తెలుగు నేల బాలలకు రారండోయ్ రారండోయ్ అంటూ - అవతరించింది. మా ఇంట్లో వున్న పెద్ద బాలశిక్షకి తోడూ కాశీమజిలీ కథల వంటి పొత్తాల సరసన ఈ బాలన్నయ్య (న్యాపతి రాఘవరావు దంపతులు) బాలక్కయ్య కామేశ్వరరావు గారు దొరికారు నాకు. పాపాయి అనే పత్రిక కొత్తగా వచ్చింది కానీ దాని మీద లోపల బయటా టాన్సిల్స్ ప్రకటనలే ఎక్కువ. అయినా ఆ పాపాయి (మాసపత్రిక) నాకు రాజపోషకురాలు. బాలమిత్ర ఆ తరువాత వచ్చింది. నా వ్రాత పత్రిక పేరు కూడా బాలమిత్ర - ముందు మేమే ఈ పేరు పెట్టుకున్నాం గనుక మార్చుకో నీ పత్రిక పేరు అని ఉత్తరాల యుద్ధం చేసి పోయి మా రాత పత్రికని బాల ఎత్తేసి మిత్ర అన్నాము.
అది 1940-51 మధ్యకాలం. జన్మ నిచ్చింది విజయనగరం - అన్నప్రాశన చేసి ఆటపాటలు నేర్పి చిందులు త్రొక్కే ‘కలం’ చేత పెట్టింది బెజవాడ తల్లి. ఆధునిక కథ పుట్టిన విజయనగరం మా సొంత తాతగారి వూరు (పిళ్లా సుబ్బారాయుడుగారు) మా వూరు విజయవాడ - ఫిజిక్స్ పాఠాలు కూడా గుణపాఠాలు చెప్పి - తొలి నవలతోనే (తొలిమలుపు) టర్నింగ్ పాయింట్‌ని ప్రసాదించింది ఘనమైన ‘ఇసాపట్నం’ అనబడే విశాఖపట్టణమ్.. అది మా అమ్మ తాతగారి వూరు (రాంభట్ల వారు). మా అమ్మ నాన్నగారి గ్రామం వైజాగ్ జిల్లా ఎలమంచిలి (పూడిపెద్ది కృష్ణమూర్తిగారు) దిమిలి ద్రావిళ్లు అంటారు మమ్మల్ని. మేము చూసినది - నా మనసులో చెరగని విజ్ఞాన ముద్ర వేసుకున్నదీ మా నాయనమ్మ -(మామ్మ) - పిళ్లా సుబ్బమ్మగారు - కాశీ సోమయాజుల వారి అమ్మాయి (కాస్సాల వారు అంటారు.)
చైతన్య స్రవంతి అంటారే మనవాళ్లు అట్లాగా ఉయ్యాలా లాగా ఊగుతూ సాగుతుందేమో ఈ మనోగతా కథనం లేకపోతే మీకు కావలసిన టెంపో లభించదు. ఈ అక్షర యజ్ఞమ్ యొక్క లక్ష్యమ్ కూడా నెరవేరదు - ఆ’ కాలం.. ఈ’ కాలంల మధ్య నా ‘కాలమ్’ ఒక ‘మమతల వంతెన’ కావాలి అన్నది ఒక చిన్ని ఆశ.
నా బాల్యం అంటే రెండో ప్రపంచ యుద్ధం తరువాతి గడ్డు రోజుల్లోకి తొంగి చూడాలి. విశాఖపట్టణం మీద జపాను వాడు బాంబులు వేయకపోతే - నేను విజయనగరం గంటస్తంభం విశాఖపట్టణం బొమ్మలకొళాయిల మధ్యనే ఇరుక్కొని పోయి వుండేవాడినేమో. అప్పుడు జపాను వాడు ఆరు బాంబులు వేస్తే - అందులో ఒకటి ప్రేలలేదుట - అదే ప్రేలితే - వైజాగ్ మహానగరం మనకి దక్కేది కాదుట.
ఈ స్మృతి గుచ్ఛము అనేది లయబద్ధంగా ఉంటుందా? కొండొకచో లయ‘బద్ధకం’గా ఉంటుందా? అంటే - శ్రుతి లయలు అమరినట్లే కలం నడిపిస్తూ కథనం లాగిస్తానన్న నమ్మకం పెట్టుకున్నాను నేను.. లెట్ మీ ట్రై!
బ్రతకలేక బడిపంతులు అన్న సామెత - వెనుకటి కాలం జర్నలిస్టులకి కొంత వరకు వర్తిస్తుంది. ఇవాళ సుశిక్షితులు అయినవారే ఎక్కువ మంది జర్నలిస్టులు. నాడు ‘బోర్న్’ జర్నలిస్టులు ఎక్కువ - గడచిన అరవై ఏండ్ల కాలంలో లోకంలో మన సమాజంలో ఉక్కిరిబిక్కిరి చేసే మార్పులు ఇబ్బడిముబ్బడిగా సంభవించాయి - ఇంటర్నెట్ యుగానికి మొబైల్ అవతరణకి ముందు కాలం ఒక చెంప - ఆనక ‘అంతర్జాల శకం’ ‘యుట్యూబ్ ఆవిష్కరణ రెండో చెంప అని మాట వరసకి మనం అనుకుంటే - కొంత వెసులుబాటు తప్పక వుంటుంది. వామ్మో! దృశ్య శ్రవణ మ్యాజిక్ బాక్స్ పుట్టేక మీడియా ఒక మ్యానియా.. అయిపోయింది అంటారు: అది అట్లుండ నిండు...
ఎందుకంటే అడుగడుగునా, ఈ కాలంలో వున్నవి అప్పుడు లేనివి - అంటూ నేపథ్య సంగీతంలాగ - పోనీ జోరీగ లాగ అనుకోండి - ఆ కాలంలో - ప్రతిగా ఈ కాలంలో అంటూ వాగుట తగదు గదా/ విసిగిస్తూ ఉండకుండా - నెట్ వెనుక అని నెట్ శకంలో - అని వాడుతూ వుంటాను. నె.వే. అనీ నె.శ. అని అనుకుందాము. బై ది బై ఇవాళ రేపు క్రీ.శ. అని అనటం లేదుటగా? ‘కామన్ ఎరా’ అంటున్నారుటగా - క్రీస్తు పుట్టుక ఎప్పుడన్నది నిర్ధారణ కాలేదుట! ఔరా!

మా గాంధీజీ మున్సిపల్ హైస్కూలు భవనం
నేను చదువుకున్న బడి మాత్రమే కాదు - నన్ను రచయితగా ఆ మాటకొస్తే, ఎడిటర్ (నవ్వకండి మరి)గానూ తీర్చిదిద్దినది కూడా ఈ రాతికోట లాగ ధగధగలాడే స్కూలు భవనమే. దీన్ని 1934లో స్థాపించారుట. జర్నలిస్టు అన్న మాట నాకు తెలియదు - రైటరు ఎడిటర్ అన్న మాటలే మాకు తెలుసు. ఖాసా సుబ్బారావుగారి స్వతంత్రని నా లిఖిత పత్రికకి యధేచ్ఛగా - కాపీ కొట్టి సంపాదకీయం రాసేవాణ్ని - అయితే, ఈ పత్రికలూ వీటి ప్రపంచం పత్రికల విధాతలు గట్రా నాకు అబ్బటానికి కారణం మా నాన్నగారే - ఆంధ్ర సర్వస్వము అనే తెలుగు తొలి సర్వతోముఖమయిన గ్రంథం.. మాగంటి బాపినీడు గారు చేశారు - కందుకూరు వీరేశలింగం పంతులుగారిని, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారిని సంస్మరిస్తూ - ఆంధ్ర దేశమునకు అంకితం చేసిన అపురూప ఎన్సీక్లోపెడియా గ్రంథం అది - అదే నాకు ప్రేరణ - అదే నాకు గురువు ఫ్రెండు - పిళ్లా విశ్వనాథం పంతులుగారే దాన్ని నాకు (మా నాన్నగారన్నమాట) ప్రజెంట్‌గా 1948లో తెచ్చి ఇచ్చారు. ఇప్పటికీ అది నా కాణాచి. జాతి వైతాళికుల, సారస్వత హాలికులను దర్శింపజేసిన పవిత్ర పుస్తకాలయం అది.
(ఇంకా బోలెడుంది)

వీరాజీ.. veeraji.columnist@gmail.com