స్మృతి లయలు
భెజవాడలో పత్రికలు, ఎండలు ఎక్కువే
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘ఉదయమ్మాయేను.. స్వేచ్ఛా భారత ఉదయమ్మా యనహో.. తూరుపు కొండల వారల తపములు ధీరత.. గాంచెను జయహో.. అన్న టంగుటూరి సూర్యకుమారి పాటకు బంగాళాఖాతం సహా ఘార్ణిల్లి - కెరటాల హస్తాలతో హర్షధ్వానాలు చేస్తూ వుండగా - అర్ధరాత్రి ఆంధ్ర దేశం సహా - సూర్యోదయాన్ని ‘్ఫ’లైనప్పుడు - ఆ మువ్వనె్నల ‘ఎగురుడు’ తొలి పండుగని నేను ఎరుగను - చిన్నవాడ్ని. కాని విశాఖలో మేనమామల నెలవులో - పినతండ్రుల లోగిలిలో - 1949 ఆగస్టు 15 జేగీయ మానంగా సాగిన వేడుకలు గురుతున్నాయి. (లీలగా జ్ఞాపకం ఉన్నాయి) అటు తరువాత ఇక మా గాంధీజీ మునిసిపల్ బెజవాడ హైస్కూల్ - నేను నా వ్రాత పత్రిక ‘మిత్ర’ ప్రత్యేక సంచికయే తయారుచేసుకున్నాను - అది వేరే కథ. అదే అసలు ‘వేరు’
వైజాగ్లో మేనమామలు, బాబాయిలు మున్నగు ‘కిత్ అండ్ కిన్’ గలరు గదా? - మా నాన్నగారికి ఇద్దరు తమ్ముళ్లు వుండేవారు.. వెంకన్న, కన్నా అనే పిలిచేవాన్నిట నేను.. ఏటా ఓ చిన్న ‘మజిలీ’ తప్పేది కాదు సంద్ర తీరానికి.
కొన్ని విజిట్స్ పరిస్థితుల ప్రాబల్యం వల్ల, కొన్ని సందర్భానుసారంగా ఏర్పడ్డ ప్రయాణాలు.. ఒక్కొక్కటి ఒక్కో అనుభవం - ఎన్నో సంగతులు జ్ఞాపకాలు - మా పసి హృదయాలకి - అంటే నాకు మా పెద్ద తమ్ముడికి (ఇప్పుడు వాణ్ణి గీతా సుబ్బారావుగా మీరెరుగుదురు) వాడికి నాకు ఏణ్ణర్థం మాత్రమే తేడా అనేది మా అమ్మ. కాని నేను మాత్రం కేరాఫ్ నాయనమ్మే. ఈసారి చిన్న మామయ్య ఇంట్లో చిక్కుకున్నాము.
చెప్పానుగా- నాకు బెజవాడలో గాలివాన తరువాత టైఫాయిడ్ జ్వరం పట్టుకుందిట. అది రాగా అమ్మ మా సుందరం మామయ్యగారింటికి - విశాఖపట్నం శివారు దొండపర్తికి తీసుకొచ్చింది. ‘నువ్వు మాకు దక్కవు అనుకున్నాము - కాని (వాళ్ల) చిన్నన్నయ్య బ్రతికించాడు’ - అన్నది అమ్మ నమ్మకం. అది అత్యుక్తి కూడా కాదు.
‘కాన్పు, అబార్షనూ, మళ్లీ కానుపు అలా వుండేవిరా మా రోజుల్లో - ఇలాంటి ఈ రోజులలో లాంటి ఆలోచనలు ఆనాడు మీ నాన్నగార్కి ఉంటేనా?’ అని విచారించేది మా అమ్మ ఒక్కోసారి. మేము నల్గురం ప్లస్ ఇద్దరు చెల్లెళ్లు పుట్టి పెద్దయి పోయాకా సంగతి ఇది. సందర్భవశాత్తూ చెబుతున్నాను. ఈ సంభాషణ వేళకి - ‘అమ్మాయి’గారి కృష్ణుడు - వీరాజీ అయిపోయాడు. అదేట్లనినన్? తరువాత తరువాత మీరే చూస్తారు.
అప్పటికే నాకు మా నాయనమ్మ దూరమైంది. తన మొగుడు పోయిన పుట్టెడు దుఃఖంలో వుండి కూడా నన్ను భుజాన వేసుకున్న పిళ్లా సుబ్బమ్మగారు ఇహలోక ‘యాతన’కి స్వస్తి చెప్పింది. ఐ లవ్ యు మామ్మా...
అన్నట్లు విశాఖపట్టణం సంగతి కదా? ఇప్పుడు చెప్పుకుంటున్నాము. అమ్మ బెజవాడ వెళ్లిపోయింది. మమ్మల్ని మేనమామ ఇంట దొండపర్తిలో వదిలి. ఎందుకంటే, మా పినతండ్రులకి కూడా ‘బాబు’ (మై ఫాదర్) సిమెంటు ఫ్యాక్టరీలో ఉద్యోగాలు సంపాదించి పెట్టారుట.. ఐతే, మేము మా వూరు వెళ్లినా వెళ్లకపోయినా మా స్కూలు - రైల్వేస్టేషన్ వగైరా ఇక్కడ లేవు అన్న లోటు నన్ను వెంటాడింది. మా వూరు బెజవాడలో పత్రికలూ, ఎండలు కూడా ఎక్కువే. మా ఇంటి తలుపులకి వట్టివేళ్ల తడకలు రంజుగా కట్టి వున్నాయని అనుకుంటున్నారేమో? ప్చ్! మా అమ్మ చీరలనే తడిపేసి మడతపెట్టి ఆరేసేవారు నాన్న పొద్దునే్న. ఎవరి అమ్మ ఐనా అరటి చెట్టు లాంటిది. తన చీరలే మాకు దుప్పట్లు కూడా ఒక్కోసారి. ఆ చీర కొంగే మాకు ‘టర్కిష్ నేప్కిన్ను’
రీడింగు రూము మా ఇంచ్పేటలో వుండేది. అన్ని పేపర్లు వచ్చేవి దానికి. సుంకర కనకారావు గారితో కూడా మాకు పరిచయమే - నిజాం గేటు ముందు వున్న రీడింగు రూము మునిసిపాలిటీదే గాని కనకారావుగారే దాన్ని ‘చూసేవాడు’ ఇక, కిళ్లీ బడ్డీకొట్ల దగ్గరా వేలాడే రకరకాల పత్రికల్ని చూస్తేనే కడుపు నిండిపోయేది. చందమామ వచ్చిన రోజు ఆకలికి శలవు. వైజాగ్ వెళ్లే మేం మిస్ అయ్యేవాళ్లం ఇదంతా. వాల్తేరుకి మెయిలు మధ్యాహ్నం దాక చేరేది గాదు - అంచేత డైలీ పత్రికలూ ప్రొద్దునే్న దర్శనమిచ్చేవి కావు-
బెజవాడలో మా యింట్లో ఓ పెద్ద (మా అమ్మ చెప్పినట్లు ‘అసిరమ్మంత’) రేడియో వుండేది. అదేమిటో? ఓ అరగంట ముందు మేలుకొలపాలి దాన్ని. ముందే దాన్ని ఆన్ చేసేసి పెట్టేవారు మా డాడ్.. లేదా వార్తలు అయిపోయాక - వార్తలు ముగించే ముందు మాటలు తగిలేవి - ఇంతటితో వార్తలు సమాప్తం మాత్రం చెప్పేది.. పన్యాల రంగనాథరావు, కొంగర జగ్గయ్య గొంతు యాదస్తు వుంది. సరే - ఆ రోజుల్లో టైఫాయిడ్కి మందులు లేవుట - టెర్రా మైసిన్ - అనే యాంటీ బయాటిక్ ఇంజెక్షన్ కొత్తగా బ్లాకులో వచ్చిందట. రైల్వే డాక్టరు ముఖర్జీయో. బెనర్జీయో మొత్తానికి బెంగాలీ వాడు - మామయ్య పలుకుబడికి లొంగాడు ‘రిస్కు’ మీది.. దక్కితే ‘లక్’ అన్నాడుట. అలా ఇచ్చాడు మొట్టమొదటి ‘టెర్రా’ ఇంజెక్షన్ నీకే ‘నువ్వు అల్లగా పులినోట గడ్డ కొట్టావు’ అన్నాడు సుందరం మామయ్య.
వీడిని బెజవాడ తీసుకుపోతే మళ్లీ జ్వరం వస్తుందేమో? - అని భయపడ్డ అమ్మ నాతోపాటు తమ్ముణ్నీ వదిలేసి వెళ్లింది. కానీ, సుందరం మామయ్య గారిల్లు ఓ దివాణం - ఆయనవి మిలటరీ సప్లై కాంట్రాక్టులు. సుమతీ శతకం ‘పజ్జం’ నాకు వచ్చు. ఎప్పుడు చెరువు నిండిన అప్పుడు కుప్పలుగా కప్పల్ వచ్చున్’ అన్నట్లు తోచింది. వ్రేలు విడిచిన బాపతు చుట్టాలు, వరస మేనమామలు, పొలిటికల్ ఫ్రెండ్స్ - ఇలా బోలెడు మంది ఆ ఇంట తిని పోతూ వుండేవారు. ఓ పెద్దపులి అంత వున్న కుక్క - టైగర్ - దాని పేరు కూడా వుంది. కుంటి తైమూరు - ఝామ్మని త్రోలే జట్కా - బట్టతల రెడ్డి నడిపే ఓల్డ్ మోడల్ ఫోర్డు కారు వున్నాయి. నాకు మళ్లీ జట్కా పిచ్చి మొదలు.. అది సరే - నా ఫుడ్ మళ్లీ పాలు నాన్రొట్టె - మా అమ్మకి మా బుచ్చి మేనత్త - సత్యం - బాగా ‘క్లోజు’ పైగా సత్యం అత్తకి నేను కూడా ఫ్రెండు.. ఇద్దరికీ ఆమె చెప్పిన మాటలను బట్టి పదమూడేళ్ల తేడా అట అయినా నన్ను ఎత్తుకుని ఆడించడం కోసం - ఉయ్యాలలో వేసి లాలిపాటలు జోల పాటలు పడుకోబెట్టి చేసిన వాత్సల్యమూర్తి పూడిపెద్ది వారి కోడలయిన పిళ్లా సత్యవతి.. మా బూసిమామయ్య పొట్టి పహిల్వాన్ లాగా వుండేవాడు. అంత పెద్దవాడా? మొగుడంటే..? అని విస్తుబోయేవాన్ని. మా జోలికి వచ్చేవాడు కాదు అయితే.. పాత వైజాగ్ వూళ్లో వుంటారు వాళ్లు.. అమ్మ అత్తకి చెప్పింది ‘ప్రొద్దునే్న వీళ్లు వస్తారు- చెరో చటాకు పాలు - పొంగించి పొయ్యి’ అంటూ వాడుక పెట్టమని డబ్బులు ఇచ్చింది. కాకపోతే - అత్తయ్య దగ్గర ప్రైవేటుకి వెళ్తున్నాము మేము అని సుం.మా. గారింట చెప్పాలి. కాని, ఎవరూ ఆరా తీసేటంత తీరికగా వుండేవారు కాదు.
(ఇంకా బోలెడుంది)