ఆటాపోటీ

వరుస విజయాల కోల్‌కతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఐపిఎల్‌లో ఓటమి లేకుండా ఎక్కువ వరుస విజయాలను సాధించిన జట్టుం కోల్‌కతా నైట్ రైడర్స్. గత ఏడాది వరుసగా 11 మ్యాచ్‌లను కోల్‌కతా గెల్చుకుంది. 2013 సీజన్ చివరిలో, తిరిగి 2014 సీజన్ ఆరంభంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఎనిమిది, 2011లో తిరిగి 2013లో చెన్నై సూపర్ కింగ్స్‌తోపాటు రాజయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా ఏడేసి పర్యాయాలు వరస విజయాలు అందుకున్నాయ. రాజస్థాన్ రాయల్స్ (2008), ముంబయి ఇండియన్స్ (2008), కోల్‌కతా నైట్ రైడర్స్ (2013), చెన్నై సూపర్ కింగ్స్ (2014) ఆరేసి మ్యాచ్‌లను గెలిచింది.
పరాజయాల పుణే
వరుస విజయాల చిట్టాలో కోల్‌కతా నైట్ రైడర్స్ మొదటి స్థానంలో ఉంటే, వరుస పరాజయాల జాబితాలో పుణే వారియర్స్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. 2012, 2013 సీజన్లలో ఈ జట్టు 11 వరుస పరాజయలను ఎదుర్కొంది. 2013లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో కలిసి తొమ్మిది మ్యాచ్‌లు ఓడింది. 2009లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఎనిమిది సార్లు వరుస పరాజయాలను చవిచూసింది. దక్కన్ చార్జర్స్, పుణె వారియర్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తలా ఏడు పర్యాయాలు వరుస పరాజయాలను నమోదు చేశాయ.

ఉదారుడు ఇశాంత్
* ప్రత్యర్థికి భారీగా పరుగులిచ్చే ఉదారత్వం ఉన్న బౌలర్లలో ఇశాంత్ శర్మ అగ్రగణ్యుడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున 2013లో చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ ఆడుతూ అతను ఏకంగా 66 పరుగులు సమర్పించుకున్నాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ బౌలర్ ఉమేష్ యాదవ్ 2013లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 65, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ బౌలర్ సందీప్ శర్మ 2014లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై 65, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు చెందిన వరుణ్ ఆరోన్ 2012లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఆడుతూ 63, పుణె వారియర్స్ బౌలర్ అశోక్ దిండా 2013లో ముంబయి ఇండియన్స్‌పై 63 చొప్పున పరుగులు దారాదత్తం చేశారు.

పరుగుల వరద
* ఐపిఎల్‌లో పరుగుల వరద పారించిన జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. 2013లో పుణే వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు ఐదు వికెట్లకు 263 పరుగులు సాధించి, టాప్ స్కోర్ జట్ల జాబితాలో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. 2010లో రాజస్థాన్ రాయల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్లకు 246, అంతకు ముందు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై 5 వికెట్లకు 240 చొప్పున పరుగులు చేయగా, 2015లో ముంబయపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఒక వికెట్ నష్టపోయ 235 పరుగులు చేసింది. 2011లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 2 వికెట్లకు 232, అదే ఏడాది కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై ఢిల్లీ డేర్ డెవిల్స్ 4 వికెట్లకు 231, 2014లో చెన్నై సూపర్ కింగ్స్‌పై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 4 వికెట్లకు 231 చొప్పున పరుగులు సాధించాయ.
రాజస్థాన్ అత్యల్ప స్కోరు
రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపిఎల్‌లో అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. 2009లో ఈ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై కేవలం 58 పరుగులకే ఆలౌటైంది. 2008లో ముంబయిపై కోల్‌కతా నైట్ రైడర్స్ 67 పరుగులకు కుప్పకూలి రెండో స్థానంలో ఉంది. 2014లో రాజస్థాన్ రాయల్స్‌పై రాయల్ చాలెంజర్స్ 70, 2011లో దక్కన్ చార్జర్స్‌పై కొచ్చి టస్కర్స్ 74, ముంబయి ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 79 చొప్పున పరుగులు చేసి, అత్యల్ప స్కోర్ల జాబితాలో స్థానం సంపాదించాయి.

- శ్రీహరి