బిజినెస్

రహదార్లకు ఇక మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్రంలో రహదార్ల అభివృద్ధి.. విస్తరణ.. అనుసంధానానికి మార్గం సుగమమైంది. జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలు, మండల కేంద్రాల నుంచి సమీప మండలాలకు రెండువరుసల రహదార్లను ఏర్పాటు చేయటం ద్వారా కనెక్టివిటీని పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు జరుపుతోంది. ఏపీ మండల్ కనెక్టివిటీ అండ్ రూరల్ కనెక్టివిటీ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్ (ఏపీఎంసీఆర్‌సీఐపీ), ఏపీ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ రీ కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్ పేర్లతో రోడ్లు, భవనాలశాఖ రెండు రహదారి నిర్మాణ పథకాలను ప్రతిపాదించింది. వీటిలో ఒక్కో ప్రాజెక్ట్‌కు రూ. 3200 కోట్ల వంతున రూ. 6400 కోట్ల మంజూరుకు న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) ముందుకొచ్చింది. రాజధాని అమరావతిలో వౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. బాహ్య సహాయ ప్రాజెక్ట్‌ల కింద రాష్ట్రంలో రహదార్ల నిర్మాణానికి ముందుకొచ్చిన ఎన్డీబీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం తన నివాసంలో సమావేశం నిర్వహించారు. వౌలిక సదుపాయాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతోందని, రహదారుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదార్లను సీసీ రోడ్లుగా మార్చడంలో దేశంలోనే ముందు నిలిచామన్నారు. రాష్ట్ర రహదారుల అభివృద్ధిలో భాగంగా రోడ్లు భవనాలశాఖ ప్రతిపాదించిన రెండు ప్రాజెక్ట్‌లకు రూ. 6400 కోట్ల సహాయం అందించేందుకు ముందుకువచ్చిన న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్‌ను అభినందించారు. వ్యాపార అనుకూలత కలిగిన రాష్ట్రాల్లో ఏపీ నెంబర్ వన్‌గా నిలిచిందని, ఉపాధి కల్పనలోనూ అగ్రస్థానంలో ఉందని వివరించారు. ప్రజలు మెరుగైన ప్రమాణాలతో జీవించే రాష్ట్రాల్లో నెంబర్ వన్‌గా తీర్చిదిద్దాలనేది తన సంకల్పంగా చెప్పారు. అభివృద్ధిలో అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిపేందుకు సాంకేతికత, ఆవిష్కారాలకు ప్రధాన్యత ఇస్తామన్నారు.
పెట్టుబడిలేని ప్రకృతి సేద్యంలో తమ కృషిని ఐక్యరాజ్యసమితి ప్రశంసించిందని గుర్తుచేశారు. రాష్ట్భ్రావృద్ధికి జరుగుతున్న కృషి, ప్రణాళికాబద్ధమైన విధానం సంతృప్తికరంగా ఉందని నవ్యాంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు తాము ఆసక్తికరంగా ఉన్నామని ఎన్డీబీ ప్రతినిధులు స్పష్టం చేశారు. రాష్ట్ర రహదార్ల విస్తరణలో భాగంగా జిల్లా ముఖ్య కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు 792 కిలోమీటర్లు, మండల కేంద్రాల నుంచి సమీప మండలాలకు 2219 కిలోమీటర్ల మేర రెండు వరుసల రహదార్లుగా మార్పుచేసేందుకు ఏపీ రహదారులు, వారధుల పునర్నిర్మాణ సంస్థ (ఏపీఆర్‌బీఆర్‌పీ) ఈ రెండు ప్రాజెక్ట్‌లను ప్రతిపాదించింది. ఇందులో భాగంగా 132 కొత్త వారధులు నిర్మిస్తారు. బలహీనంగా, ఇరుకుగా ఉన్న మరో 300 వారధులను కూడా పునర్నిర్మిస్తారు. సమావేశంలో ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి అడుసుమల్లి వెంకట రాజవౌళి, ఎన్డీబీ ఉపాధ్యక్షుడు జియాన్‌ఝు, వైస్ ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ నింగియాన్ ఝాంగ్, ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఆఫీసర్లు జియాన్ షియావో, గర్విత్‌షా, నినాద్ రాజ్‌పుర్కార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

చిత్రం.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఏన్డీబీ అధికారుల భేటీ