బిజినెస్

అమరావతిలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 30: అమరావతి రాజధాని నగర పరిధిలో పెట్టుబడులకు అపూర్వ అవకాశాలున్నాయని ఏపిసిఆర్‌డిఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీ్ధర్ తెలిపారు. ఫ్రెంచ్ డెలిగేషన్ బృందంతో విజయవాడలో బుధవారం జరిగిన సదస్సులో కమిషనర్ ప్రాజెక్ట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఏపిసిఆర్‌డిఏ చైర్మన్, రాష్ట్ర ముఖ్యమంత్రి అయన చంద్రబాబు నాయుడు విజన్‌తో అమరావతి అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకుంటోందన్నారు. ప్రపంచంలోనే అత్యంత సౌకర్యవంతమైన, ఆహ్లాదకరమైన నగరంగా విలసిల్లేందుకు ప్రణాళికాబద్దంగా కృషి జరుగుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి విజన్, ప్రోత్సాహం, నాయకత్వంలో ప్రజల భాగస్వామ్యంతో కొత్త నగరం అభివృద్ధికి కృషి జరుగుతుందన్నారు. ప్రణాళికా దశలోనే అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని హాపీనెస్ సిటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఏపిసిఆర్‌డిఏ ఏర్పాటుతో అమరావతి నగరానికి ప్రణాళికాబద్ధమైన శ్రీకారం జరిగిందని, ఏపి సిఆర్‌డిఏ చైర్మన్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు అందరికీ అందుబాటులో ఉండే విధంగా అనువైన సెంట్రల్ లోకేషన్‌లను రాజధాని ప్రదేశంగా నిర్ణయించడం జరిగిందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలకు సెంట్రల్ లొకేషన్ అయిన అమరావతి ప్రజా రాజధాని నగరానికి మంచి రోడ్డు, రైల్ నెట్‌వర్క్‌తోపాటు ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ ఉందని, 60 కిలోమీటర్ల దూరంలోనే చారిత్రాత్మకమైన మచిలీపట్నం పోర్టు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీ్ధర్ తెలిపారు. సమగ్ర మాస్టర్ ప్లాన్ సింగపూర్‌కు చెందిన సుర్భానా పూర్తి చేసిందని, ఎకనామిక్ వాల్యూతోపా టు ప్రతి పౌరుడి సంతోషానికి ధ్యేయంగా అర్బన్ ప్లానింగ్‌లో కొత్త విధానం అవలంభిస్తున్నామని ఆయన తెలిపారు. మూడేళ్లలో 32 వేల కోట్ల రూపాయల వ్యయ ప్రణాళిక ఉందని, 2017లో 8,500 కోట్ల రూపాయలు, 2018లో 17 వేల కోట్ల రూపాయలు, 2019లో 6,900 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు నిర్ణయించడం జరిగిందని వివరించారు. ఇది 50 శాతం వ్యయమని, నగరంలో వౌలిక వసతులు, రోడ్లు, ఎలక్ట్రికల్, సీవరేజ్ వర్క్స్ 2018 నాటికి పూర్తవుతాయని తెలిపారు. కాగా, ఈ సందర్భంగా ఫ్రెంచ్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.
ఫ్రెంచ్ ప్రతినిధుల కాన్ఫరెన్స్‌లో ఈ-సైకిల్ హల్‌చల్
ఫ్రెంచ్ ప్రతినిధుల సదస్సులో ఈ-సైకిల్ చూసిన సిఎం చంద్రబాబు నాయుడు చిరునవ్వులు చిందించారు. సైకిల్ తనకు అధికారం అందించిన చిహ్నమని వ్యాఖ్యానించడంతో సదస్సులో నవ్వులు విరిశాయి. అమరావతి రాజధాని సైకిల్ ట్రాక్ ప్లాన్ వెనుక ఎంతో ఆరోగ్యకరమైన భావన ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన ఫ్రెంచి ప్రతినిధి