సుమధుర రామాయణం

సుమధుర రామాయణం -- యుద్ధకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

871. విన్నవే నేను మున్ను రుూ విషయములను
రావణుం జంపి రాక్షస రాజ్యమునకు
చక్రవర్తిగ నభిషిక్తుజేతు నిన్ను
నాదు తమ్ములు మువ్వుర మీద యాన

872. ధన్యతను బొందితి నని విభీషణుండు
లంక ముట్టడి యందు నాశక్తి కొలది
సర్వవిధముల సాయము జేయువాడ
రఘుపతీ! యని బల్కె వినమ్రుడౌచు

873. రామచంద్రుడు ‘‘లక్ష్మణా! సాగరజల
ముల తొలంకాధిపుగ విభీషణుని యిపుడె
జేయు మభిషిక్తు మూర్ధ్భాషిక్తుడైన
నీతనిం జాతు యసురనాధునిగ ననియె

874. అన్న యాదేశమున లక్ష్మణుండు బుద్ధి
శాలి విభీషణ నభిషిక్తుజేసె
నసుర రాజ్యాధినేతగ కీశపతులు
ముదము జెందుచు హర్షనాదములు జేయ

875. గూఢచారి శార్దూలుడు రావణునకు
శత్రువుల సమాచార మందించె నపుడు
శకుని బిల్చి రావణుడు సుగ్రీవు తోడ
జెప్పుమని బంపె తనదు సందేశమిట్లు

876. ఋక్షరజసుని సుతుడవు ఋక్షపతివి
నేను సీతను దెచ్చిన నీకు నేమి
కీడుగలదు నిశ్చింతగ కపుల తోడ
జేరు కొనుము కిష్కింధకు సాదరముగ

877. అన శకునితో సుగ్రీవుడు రావణునకు
జెప్పుమగ్ని సాక్షిగ నాకు మిత్రుడయ్యె
రామచంద్రుడాయన పత్ని నపహరించి
నాకునుం శత్రు వైతివి నిన్ను లంక
తోడ నాశన మొనరింతు తధ్యముగను

878. వానరులు శకుని వధింపబోవ నతడు
రామునకు మొరబెట్టుకొన్న రఘువరుడు
కపుల వారించి వాని బంధింప బనిచె
నమలు పరచిరి రాఘవు నాజ్ఞకపులు

879. అంతట సుగ్రీవుడు విభీషణాఖ్యు తోడ-
‘‘మిత్రమా! ఈ మహాసాగరమ్ము దాటు
నట్టి మార్గము సూచింపు మన విభీష
ణుండు రాము డిక్ష్వాకు వంశజుడుగాన

880. రామచంద్రుడు గోరగ సాగరుండు
రామకార్యమునకు సహాయమ్మొనర్చు
నను విభీషణు మాటలు విన్న రాఘ
వుండు సేతు నిర్మాణ సంకల్పుడౌచు

881. తూర్పు దిక్కున కభిముఖుడై దశరధ
నందనుండు లోక రక్షాప్రశస్త హస్త
మును దలక్రింద చేర్చుక యజ్ఞ వేది
వెల్గు హోమాగ్ని వలెను పరుండె దర్భ
శయ్యపై సాగరోపాసనకు గడంగి

882. మూడు రాత్రులు గడచె రాడయ్యె జలధి
యా సముద్రుని నిర్లక్ష్యమునకు రాఘ
వుండు కుపితుడై ‘‘లక్ష్మణా! విల్లు నిమ్ము
గుణరహితులు సామంబున జక్కబడరు

883. నాదు నోర్మిని యసమర్ధతగ దలంచె
నీతనికి శిక్ష దప్పదు బ్రహ్మదండ
సదృశబాణములతో జలరహితుజేసి
వైతునని సముద్రుని పైని విడిచె శరము

884. ఆ శరాగ్నికి సాగర జలములుడికె
నందు గల మహా మకర తిమింగిలములు
తునియులై నీటిపై తేలియాడె ప్రాణి
కోటి కంపించె సంద్రపు ఘోషకపుడు

885. అంత సౌమిత్రి ‘‘యగ్రజా! యింక మీరు
కోపముపసంహరింపుడు సాగరుండు
వచ్చ తమ దర్శనంబుకు సాధుజనుల
కాగ్రహము శోభనీ’’ దంచు బల్కనపుడు

886. ‘‘లక్ష్మణా! దానవ నిలయమైన రుూ స
ముద్రు పూర్తిగ శుష్కింపజేతు నపుడు
సుఖముగా దాటు మన సేన సాగరమ్ము
నాదు శక్తియు దెలియు సముద్రునకును’’

887. అనుచు భ్రుకుటిని ముడిచి విల్లంబు నంది
యల్లెత్రతాటి నాకర్ణాంతమునకు లాగి
విడిచె నా శింజినిధ్వని కిలయునభము
దద్దరిల్లెను కంపించె నద్రిచయము

888. నాకసమునుండి తీవ్ర గర్జనలతోడ
నుల్కలును పిడుగులు జారి నుర్వి బడియె
కలవరము జెందినవి నదులెల్ల ప్రాణి
కోటు లాక్రందనము జేసె భీతితోడ

--టంగుటూరి మహాలక్ష్మి