సుమధుర రామాయణం

సుమధుర రామాయణం -- యుద్ధకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

946. గ్రీష్మతాపముతో సొమ్మసిల్లిన నెమలి
తొలకరింపగ హాయిని పొందునట్లు
సరమ బల్కిన యమృతవాక్యములు సీత
హృదయతాపము శమియించి సేదదీర్చె

947. లంకలో యుద్ధబేరులు మ్రోగదొడగె
నిలజ వినవమ్మ యుద్ధసన్నాహములను
మొదలుబెట్టిరి యసురులు మేఘగర్జ
నలవలె రణభేరులు వినవచ్చెనవిగొ

948. సీత సరమతో ప్రియ సఖీ! క్రూర రావ
ణు ప్రయత్నములు గ్రహియించివచ్చి
దెల్పుమన హుటాహుటినేగె రావణుగృహ
మునకు సరమ యదృశ్యరూపమ్ముతోడ

949. అచట విషయములన్నియు నరసివచ్చి
ధరణిజా! రావణుడు యుద్ధనిర్ణయమ్ము
జేయుచుండగ వృద్ధ మంత్రులను తల్లి
యెంతయో జెప్పినను చెవిబెట్టడయ్యె

950. మాల్యవంతుడు ముఖ్యుడు మంత్రులందు
అసురవల్లభు బంధువు సజ్జనుండు
రాజనీతి విశారదుం డసుర కులము
మేలుకాంక్షించి లంకేశు ముందుకేగి

951. ‘‘రావణా! జానకి మహాపతివ్రతయును
సచ్చరిత్ర మహా సాధ్విసుమ్ము ధర్మ
విగ్రహుడు రామునిల్లాలు వేగనామె
భర్తకర్పింపు మామెకై పోరుచేటు

952. యజ్ఞ విధ్వంసముంజేసి వేదవేత్త
లౌ మహర్షుల హింసింప జేసినావు
వారి యజ్ఞకుండము నుండి ధూమవహ్ని
బుట్టి జుట్టుకున్నది లంక పట్టణమును

953. రఘువరు బలము దెలిసియు నతనితోడ
వైరమును టూనుటది యవివేకవౌను
నీకు దేవదానవయక్ష రాక్షసులతో
మరణముండదు వీరు వానరులు నరులు

954. అదియునుంగాక యిపుడు లంకాపురమున
చాల నుత్పాతములు సంభవించుచుండె
రామునిం గూర్చి విన్నసంగతులుజూడ
యతడు శ్రీ మహావిష్ణువటంచు దోచు

955. ధాత్రిజను రామచంద్రుకర్పించి సంధి
జేసుకొనుటయె శ్రేయస్కర’’మని హితవు
జెప్పు మాల్యవంతుని బొమల్ముడిచి జూచి
కన్నులెరుపెక్క నావృద్ధ సచివుతోడ-
956. ‘‘మీరలందరు నాకు హితమ్ము బోధ
జేయునెపమున శత్రుసంకీర్తనమ్ము
జేయుచుంటిరి మీలోన శత్రుపక్ష
పాతముండియుండునను భావమ్ము గల్గె

957. వినుడు సీతను దండకావనమునుండి
దెచ్చుట తిరిగి యప్పగించుటకుగాదు
రామలక్ష్మణ రవిసుతుల్ రణములోన
చోద్యముగ గూలుదురు మీరు జూచుచుండ

958. అమర సుందరీమణుల కౌగిళుల కొరకు
తొందరపడు లంకేశు డమాత్యవర్యు
మాల్యవంతుని సద్వచనమ్ము లెవ్వి
చెవిని బెట్టడు కాలమ్ము చేరువౌట

959. ‘‘మాల్యవంత జనకుడు కానలకు దరుమ
వానరుల పంచ జేరిన మానవుండు
రాముడా మహాధీరుడు సురలగెల్చి
నట్టి నాముందు నిల్చునా నాలమందు’’

960. రావణుండట్లు కటువచనములు బల్క
నతనితో నింక మాటాడ తగదటంచు
సచివవర్యుడేలికకు జయమ్ము బల్కి
చింతతో నిజ భవనమ్ము జేరుకొనియె

961. సరమ సీతకు లంకేశు యత్నములను
జెప్పెనంత విభీషను సచివులు ఖగ
రూపములనేగి లంకలో జరుగు విషయ
ములు నరసివచ్చి దెల్పిరి రాముకిట్లు

962. ‘‘స్వామి! లంకానగర తూర్పు ద్వారమునకు
రక్షకుడుగ ప్రహస్తుడు నిల్చినాడు
దక్షిణ ద్వారమున మహోదరుడు నతని
చెంతనే మహాపార్శ్వుడు జతగనుండె

963. పశ్చిమద్వార రక్షణ పరత క్రింద
జిత్తు నిల్వగ నుత్తరద్వార రక్ష
రావణుడుతనె స్వయముగా స్వీకరించె
నగర గర్భరక్షకు విరూపాక్షునుంచె

964. వారి సేనల లెక్కింప నలవిగాదు
కోట్ల సంఖ్యకు మించు, నొక్కనికినైన
ప్రాణభీతియు లేదు వీరలను జూచి
పరుగులిడుదురు సురలును భయముతోడ

965. వారి నెదిరించుటకు మన వ్యూహబలము
నెంతయో పటిష్టముగ రూపొందవలయు’’
ననగ రామచంద్రుడు రణోత్సాహుడౌచు
నాల్గు భాగములుగ విభజించె సేన-

-- టంగుటూరి మహాలక్ష్మి