సుమధుర రామాయణం

సుమధుర రామాయణం -- యుద్ధకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1026. వానరుల సింహదానముల్ విన్నరావ
ణుండు విషయమేమొ యరసి రండటంచు
యనుచరుల బంపె వారలు మరలి వచ్చి
ప్రభున కెరగించిరి సమాచారమంత

1027. ఇంద్రజిత్తు ప్రయోగించిన యిషుచయము
వాసుకినిబోలు విష సర్పబంధనములు
నిష్పలములయ్యెనని విచారించి రావ
ణుండు కనులెరుపెక్క రోషంబుతోడ

1028. యుద్ధముల నారితేరిన యోధుడపజ
యమ్మెరుంగని వీరు ధూమ్రాక్షు బిల్చి
వానరులతోడ రామలక్ష్మణుల జంపి
రమ్మనుచు జెప్పలంకేశ్వరునకు మ్రొక్కి

1029. వేల సేనతో ధూమ్రాక్షుడేగె ననికి
శూల ఖడ్గముద్గరపట్టసాయుధముల
వానరులదాకి రసురులు వృక్షగిరుల
వాడి గోళ్ళతో నెదిరించ్రి వారికపులు

1030. పవన సూనుడు ధూమ్రాక్షుపైకి నగము
విసర పిండియై యసువులు బాసెవాడు
అట్టహాసముతో నకంపనుడు తనకు
యెదురువచ్చిన తరువుతో మోదిజంపె

1031. అపుడు జరిగిన సంకుల సమరమందు
అంగదుండొక యచలశృంగమ్ము విసరి
వజ్రదంష్ట్రుని ప్రాణముల్వసుధరాల్చె
నీలుడు ప్రహస్తుని కంఠముత్తరించె

1032. జయ జయ ధ్వానములు జేసి రచల చరులు
ఆర్తనాదములతో యాతుధానులరిగి
రావణునకు దెల్పిరి మహావీరులైన
సేన నాయకులెల్లరు మడిసిరధిప

1033. రాక్షసుల యార్తనాదముల్ కపుల హర్ష
నాదముల విన్న లంకేశుడతి విషణ్ణ
హృదయుడై దేవతలను జెండాడినట్టి
యోధులను జంపెనివ్వైరి యతుల బలుడు

1034. అనుచు చింతించి నేనే స్వయమ్ముగ రణ
రంగమునకేగి కీశసేనాటవిని మ
దీయ శరవహ్ని దగ్ధమొనర్చి రామ
లక్ష్మణుల జేర్చి వత్తు యమాలయమ్ము

1035. అనుచు నిశ్చయించగ మహావీరులంత
రావణ ప్రభుతోడ సంసిద్ధులైరి
కవచధారులు నాయుధ పాణులౌచు
మ్రోగె రణభేరులత్యంత భీషణముగ

1036. రావణుని నందనులు కంపన యతికాయు
లింద్రజిత్తు పిశాచ మహోదరులును
కుంభుడు త్రిశిరనికుంభులాది యోధు
లవని యదరగ గదలిరి బవరమునకు

037. అగ్నికాంతులు జిమ్ము రధమ్మునెక్కి
వింధ్య పర్వత సమకాయుడీతడెవరు
కుండల కిరీట సంశోభితుండు దుర్ని
రక్ష్యుయుండెనని రఘవరుడు జూచి

1038. స్వచ్ఛవౌ శే్వతఛత్రము వెల్గుచుండ
భూతగణపరివృతుడైన రుద్రునివలె
వచ్చు నా మహావీరుడెవ్వరని రామ
చంద్రుడడిగె విభీషణు నచ్చెరువుగ

1039. ‘‘రాఘవా! సర్వదేవతాగణము యొక్క
గర్వమడచిన మాయన్న రావణుండు
నినె్నదుర్కొన స్వయముగ ననికివచ్చె
యసురవీరులు పుత్రులతోడ నిపుడు’’

1040. రఘువరుండు రావణుజూచి కొంత తడవు
ఈతడెంతటి వాడైనా సీతనపహ
రించి తీరని పాపము జేసినాడు
నాలొ రగెలెడు క్రోధాగ్ని నిపుడుజూచు

1041. నిలచియుండె ధనుర్ధారియ రఘుపతి
రావణుండంత నగర రక్షణకు ఇంద్ర
జిత్తును యసుర యోధుల కొందర వెను
కకు మరల్చి ముందుకు జనె కదనమునకు

1042. రావణుంజూచె వానరేశ్వరుడు పుష్ప
శోభను విరాజితమగు వృక్షపూర్ణశైల
మొకటి బెకలించి లంకేశుపైకి విసరె
రావణుడు నడుమనె పిండొనర్చె దాని

1043. తక్షణము రావణుండు సుగ్రీవు నిశిత
బాణమున గొట్టమూర్ఛిల్లె ప్లవగ రేడు
గజగవయగవాక్ష సుషేణులంత జూచి
గిరుల వర్షము గురియించి రొక్కమారు

1044. రావణాసుర శరములు దారిలోనె
వాటినన్నిటి చూర్ణముజేసివైచె
రాక్షసేశ్వరు వీరవిహారమునకు
కీశసేనలు రాముని శరణమనిరి

1045. వారి భయపడకుడని ధైర్యమ్ము జెప్పి
యుద్ధసన్నద్ధుడౌ నగ్రజునకు రామ!
కుటిల రావణు గూల్చనా కనుమతిండు
అనుచు వినయమునను బల్కె లక్ష్మణుండు

-- టంగుటూరి మహాలక్ష్మి