సుమధుర రామాయణం

కిష్కింధకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

308. తిరిగి వచ్చి మంత్రులకు విషయములన్ని
జెప్పి అన్న కుదకతర్పణములు
విడిచి నంత నన్ను మంత్రులు యోచించి
రాజు జేసి కపిరాజ్యమునకు

309. న్యాయ మార్గము దప్పక నేను రాజ్య
పాలనము జేయు చుండగ నొక దినమ్ము
రక్కసుల జంపి బిలమున కడ్డమున్న
బండ పడద్రోసి బలశాలి వాలివచ్చి

310. మండు నగ్ని హోత్రునివలె నన్ను జూచి
‘‘యేర! దుర్మతి గుహ మూసి వెలికి నన్ను
నట్లు రాకుండ జేసి భోగముల దేలు
చుంటి వీపు సోదరుడవుగా‘‘వటంచు

311. నిజము నేనెంత వివరింప వినక నన్ను
పురము వెడలగ దరిమి నా భార్య రుమను
జెట్టబట్టి నాడది మొదలిట్లు నేను
జుట్టి వచ్చితి భూమిని జానకీశ!

312. నన్ను జంపగ వాలి యత్నించుచుండ
నూతగా గొంటి నీ ఋష్యమూక నగము
ఋషి మతంగుని శాపము చేత వాలి
ఈ నగంబును దరి జేరడంచు దెలిసి

313 ఇందు నా తప్పు యెంత గల దొరఘవర!
నీవెదెల్పు’ మటన్న సుగ్రీవు తోడ
‘‘మిత్రమా! చింత వదలు మధర్మపరుడు
శిక్ష పొందును వాలి శిక్షార్హుడనియె

314. రఘుకులాంబుధి సోముడు రామచంద్రు
డనయ వర్తనుడవ్వాలి నాదుకనుల
బడని యందాక నూపిరితోడ నుండు
కోడలితో సమానను రుమ నపహరించి

315. నిశిత శరమున వాలిని నిహతుజేసి
మోద మొనరింతు మిత్రమ! నమ్ము’’ మన్న
హర్ష చిత్తముతో వాన రేంద్రుడపుడు
‘‘రాఘవా! నీకు దెల్పెద వాలి బలము
316. దుందుభి యను రక్కసుడు దర్పించి వాలి
ననికి బిల్వగ రోషించి వాని బట్టి
ముష్టిఘాతములను మోది మృతునొనర్చి
వాని పర్వత దేహము విసిరి వేయ

317. రెండు యోజనముల దూరమందు బడియె
ఆ కళేబరమున నుండి జారిపడిన
రక్త బిందువులా మతంగ ముని యాశ్ర
మంబు దాపున బడ జూచి వౌని వరుడు

318. ‘‘ఆశ్రమంబు నిట్లు హేయ మొనర్చిన
యా దురాత్ముడతని యాశ్రీతులును
ఈ నగంబునందు నడుగిడ నసువులు
బాయుడు’’రని శాపమిచ్చె వౌని

319. అదియె దుందుభి యస్తిపంజరము రామ!
వాలి బలమును దెలిసిన వాడగాన
దిగులు జెందెద నీ శౌర్య మెరుగ నేను
అిన రాముడు మందహాసమ్మొనర్చి

320. కాలి బొటనవేలున నా కళేబరమును
దాక దశయోజనముల దూరమున బడియె
నొక్క శరమున సప్త తాళముల గూల్చి
నట్టి యా శౌర్యదను నినపట్టి జూచి

321. పాదముల బడి సూర్యజుండతుల పూర్వ
పురుషులందున శ్రేష్ఠుడ వనుచు దెలిసె
నమరులుం గూడ నీ శరమునకు నెదురు
నిల్వలేరన్న వాలియు గీలి యెంత

322. అను సుగ్రీవు నాదర మొప్ప ననునయించి
శీఘ్రముగ నీవు కిష్కింధ కేగి వాలి
నాహవమునకు బిల్వుమటన్న నతడు
రామ వాక్యంబు ననుధృతి రాజిలంగ

323. గర్జనంముల కిష్కింధ కేగి యుద్ధ
మునకు వాలిని బిల్చిన నాహరీశు
డనలుడన రేగి మండుచు ననికి వచ్చె
ఘోర యుద్ధము జరుగ సోదరుల మధ్య
*

టంగుటూరి మహాలక్ష్మి