సుమధుర రామాయణం

సుమధుర రామాయణం.. (కిష్కింధకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

324. రామచంద్రుడు సజ్జిత చాపుడౌచు
జూచుచుండె నెవ్వరు వాలి సూర్యజుండు
ఎవ్వరనుచు నేర్పరుపంగరామి కొదల
డయ్యె బాణము కార్యము చెడునటంచు

325. వాలి బొడిచిన పిడికిటి పోట్ల కోడి
ప్రాణ భయమున బరచె సుగ్రీవుడంత
రామ లక్ష్మణులును హనుమంతు తోడ
దీనుడై యున్న సూర్యజు దరికిజేరి
326. రాఘవుడు ‘‘మిత్రమా! రవిజా! క్షమింపు
మీరలిర్వురు నొక్కరూ పగుట జేసి
విడువ శరమును ఈ గజపుష్పమాల
కంఠ సీమను ధరియించి కదలు మనికి

327. వాలి చేగల్లు నీ భయమెల్ల నొక్క
బాణమున భ్రాతృకంటకు గూల్చినాడు
ప్రతిన నెరవేర్తునని రాముడనగ సింహ
నాదమును జేసె దినకరనందనుండు

328.మిత్ర సుతుడును పావక మిత్రసుతుడు
లక్ష్మణుండును నల నీలులాది సకల
కపికులేశుల తోడ కిష్కింధ కేగె
శత్రుహరణానురక్తి శ్రీరామమూర్తి

329.మరల విపించు తమ్ముని గర్జనములు
వీనులం బడ పటపట పండ్లు గీటి
పాదతాడనమున భూమి పగుల తార
ఇప్పుడరుగకు డనవిన కింద్రసుతుడు

330.కదన రంగమ్మునకువచ్చి కపికులేశు
డు పిడికిలి జూపి రుూ ముష్టిఘాత మడచు
నీ శిరంబన్న నదరక ఇనజు డపుడు
మద్ధి వృక్షంబు గిరగిరన్ ద్రిప్పి విసరె

331.కడలి మధ్యమం దలల తాకిడికి నూగు
నౌకవలె వాలి నూగిస లాడి రవిజు
శిరము ముష్టిఘాతము జే రక్త్ధార
లు స్రవింపగ సూర్య పుత్రుండు నిలచి

332.్భమబలమున వాలిని బిల్చె మల్ల
యుద్ధమున కిరువురి మధ్య యుద్ధమపుడు
ఇంద్ర వృత్తుల పోరును దలపజసె
రాఘవుడు క్షీణబలుడైన రవిజుజూచి

333.ఉగ్ర తేజోమయుడు రమణీయ మూర్తి
దాశరధి యరిసూదన దక్షుడపుడు
వాలి వధకుందగు నిశిత శరము వింట
గూర్చి విడిచిన నది వాలి గుండె జీల్చె

334.్ధృతి చెడి పెనుగాలిందూలు ద్రుమము రీతి
క్షీణ పుణ్యుడై క్షతిపడు నయ్య యాతి
రీతి కల్పాంత వేళ భూపతితుడైన
ఖరకరుండన ధరగూలె కపివరుండు

335.కొంత తడవుకువాలి కన్నులను విప్పి
మాధగా నాల్గు దిక్కులను బరికించి
బాణహాతి తన్ను జంపగ బూనినట్టి
వారెవరని దలచి చెట్టు మరుగునుండి

336.దాపునకు వచ్చు రఘుకుల తిలకుగాంచి
‘నీవెనా రాముడవు నిన్ను నిగమ వేత్త
వంచు జనులు కీర్తింపగ వింటి నిరప
రాధిని మరుగు నుండేల జంపినావు’.

337.‘కపుల రాజును రాజ్యకాంక్షయును లేదు
నన్ను మించిన బలశాలి లేడటంచు
ఖ్యాతిగాంచితి యెదురుగ నిల్చి పోర
యమున కతిధిగ నినుబంపి యుండువాడ’’

338.‘వానరుల చర్మ మాంసము లెవ్వి మీకు
పనికిరానివి నీ కొనర్ప నపకార
మేమియు దశరధుని వంటి ధర్మపరున
కెట్లు జన్మించితివి? వంచకుండ నీవు

339.తార వినినది నిన్ను గురించి, నాతొ
యుద్ధమున కిపుడేగకు యడుగు మన్న
ధర్మమును విచారించి నిర్ణయము జేయు
వాడవని జెప్పి దారకు వచ్చినాడ

టంగుటూరి మహాలక్ష్మి