సుమధుర రామాయణం

సుమధుర రామాయణం.. (యుద్ధకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

801. వాలినింద్రుంచి నాడు సహస్ర బాహు
కార్తవీర్యుని గూల్చిన పరశురాము
గర్వమడచిన యాజగదేకవతరు
దాశరధితోడ వైరము తగని దధిప!’’

802. ఇవ్విధంబుగ బల్కు విభీషణునితో
‘‘విను విభీషణ! నీవు భావించుచున్న
కారణమ్మర్థ రహితము ఇంద్రు గూడి
వచ్చినను రాముడు నను జయించలేడు

803. నిష్ప్రయోజన కరములౌ మాటలేల
సీత నొదలుట కల్లనీ వేగుమింక’’
ననుచు తీవ్రంగా బల్కె రావణుండు
వౌనముగ జనె నిట్టూర్చి మరలి యతడు

804. హితమహిత వౌను కాలమాసన్నమైన
సీతపై మోహమున విభీషణుని హితవు
జ్ఞాతి లక్షణముగ దోచె రావణునకు
శత్రుపక్షమై ప్రేలెడు నితడటంచు

805. ప్రాజ్ఞులౌ మంత్రివర దండనాకులను
బంధుజనముల స్నేహవర్గముల తోడ
సంప్రదింపగ లంకేశు డరిగె సభకు
మణులు పొదిగిన పసిడి రథమ్ముపైన

806. రాజమార్గములో నేగురాక్షసేశ్వ
రునకు పౌరులు ఇరుగడలందు నిల్చి
జయజయ ధ్వానములతోడ జయము బల్కి
వందనమ్ములు జేసిరి వినతులౌచు

807. స్వర్ణ మయము సుందర కళాశోభితమ్ము
అమరశిల్పి నిర్మిత సభామందిరమది
మంగళకర గీతములు జెలంగు చుండ
అధివసించె సింహాసన మసురవిభుడు

808. ముఖ్యులౌ యాతుధానుల కందరకును
వార్త నంపె పౌరస్త్యుడు తక్షణంబు
నందరేతెంచ్రి కుంభకర్ణాది సోద
రులును సచివులు పుత్ర మిత్రాదులంత
809. వారలకు సాదరము స్వాగతం బల్కి
యోగ్యతకు తగు నాసనంబులను జూపె
రాక్షసేశ్వరున కభివాదములు జేసి
యధివసించిరి తమతమ యాసనముల

810. రావణుడు సభాసదులను జూచి బల్కె
‘‘్ధర్మకామ్యార్థముల కంతరాయమేర్ప
డిన యపుడు సుఖఃదుఃఖములందు మిమ్ము
సంప్రదింపక జేయనేపనిని నేను

811. ఇంత దనుక మీయండ నేకార్యమైన
సఫలతను పొందితిని జయప్రదముగాను
కొన్ని దినముల క్రితమే జానకిని నను
పంచవటి నుండి దెత్తిచి నపహరించి

812. ఆమె సౌందర్యమెంతో సమ్మోహనమ్ము
సమ్మతింప దింకను నన్ను జెట్టపట్ట
మొన్న నొక వానరమొచ్చి యక్షు గూల్చి
నగర మంతయు ధ్వంస మొనర్చి జనియ

813. సీత జాడ దెలిసి రామలక్ష్మణులు సు
గ్రీవు తోడ గలసి ఉదధికవలి
తీరమందు కీశ సేనతో విడిసిర
టంచు దెలియ వచ్చె వార్తలిపుడు

814. మూడు లోకములందు జానకిని బోలు
సుందరాంగన లేదు నిరంతరమ్ము
నామె హోమాగ్ని తేజము నన్ను మదన
తాప పీడితుజేసి బాధింప దొడగె

815. సీత నొదలుటగాక మీరంత లెస్స
యోచనను జేసి వారుపయోధి దాటి
వచ్చినట్లైన రిపుల జయించునట్టి
యోగ్యమార్గము యోచించి బల్కు’’ డనగ

816. వెంటనే కుంభకర్ణుడు లేచి ‘‘యన్న!
జానకిని లంకకు గొని వచ్చుటకు మునె్న
జెప్పవైతివి మాకురుూ విషయములను
రాజనీతిని దప్పి వర్తించినావు

టంగుటూరి మహాలక్ష్మి