సుమధుర రామాయణం

సుమధుర రామాయణం.. (యుద్ధకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

817. ఎంత బలవంతుడైన నజేయుడైన
బుద్ధికుశలత లోపించి నట్టి ప్రభుని
శత్రువులు తేలికగ జయించెదరు తరుణ
మెరిగిజేయు పనులు సత్పలమ్ములిచ్చు

818. దండ కాటవిలో రామలక్ష్మణుల వ
ధించి తెచ్చిన సీత యింతకును మునె్న
నిన్ను భర్గ నంగీకరించి యుండు
తమ పరాక్రమ సామర్త్యాములను దెలిసి

819. అగ్రజా! నీ వనాలోచెనముగ దోష
యుక్త కార్యము జేసినందులకు నిన్ను
జంపి యుండెడు వాడు రాఘవుడు అతని
కంటబడవైతివి యదృష్ట వశతనధిప

820. ఇక గతించిన కార్యమున్ దలప నెందు
కనుజుడను గాన నీయండ నుండి రిపుల
నంతమొందింతు వాసవునండ గొనుచు
వచ్చినననుగాని వైరుల గూల్చివైతు

821. ఇంద్ర సూర్యులు నగ్ని వాయువులు యక్ష
పతి కుభేరుడు యిందరు పూని నరుల
కండయై వచ్చినను పరిఘాయుధమున
యమపురి కతిధులుగ నంపి వత్తు నధిప!

822. కపులనందర మ్రింగెద కదన మందు
చింత వదలుము నీ వింక సీత నీ య
ధీనమున నుండు చాల దినమ్ము లంచు
బల్కె కుంభకర్ణుడు దశకంఠు తోడ

823. మంత్రులలో మహాపార్శ్వుడు ముఖ్యుడసుర
నాధ! ముల్లోకముల కధిపతివి నీవు
సీతపై భోగవాంఛను దీర్చుకొనుము
అవల జూతముగాక వానరుల, నరుల

824. మెచ్చుకొని మహాపార్శ్వుని యసుర విభుడు
మంత్రి నాకొక పూర్వపు గాధ గలదు
అప్సరోమణి పుంజికస్థల కమలజు
సభకుజన జూచి యామె సౌందర్యమునకు

825. మనసు వశము దప్ప బలవంతముగా నామె
ననుభవించితిని విస్త్ర జేసి
యట్లె యామె యేడ్చుచు బ్రహ్మ కడకేగి
మొరను బెట్ట ధాత యాగ్రహించి

826. రావణుండిది మొదలు యే వనితనైన
ఇష్టపడకున్న బలిమిని ననుభవించ
వాని తల నూరుఖండము లౌనటంచు
శాపమిచ్చెను నట్లు జేయగనుజనదు

827. రాము డెరుగడు నా శక్తి శౌర్యములను
నాతో యుద్ధమునకు వచ్చుచున్నవాడు
కొండ గుహలోన పొంచియున్నట్టి సింహ
రూప మృత్యువు నెదిరింప సాహసమున

828. రెండు నాల్కల కోడె నాగులను బోలు
భీతి గొల్పెడు వేగవంతమ్ములైన
విషపు నారాచముల నిమిషమ్ములోన
జేసి వైచెద నిర్వీర్యు దాశరధిని

829. అంతట విభీషణుండన్న మేలుగోరి
‘‘అగ్రజా! సీతయను మహా కాలనాగు
కంఠమున జుట్టుకొనియున్న కారణమున
ముందు వెనుకల జూడలేకుంటి వధిప!

830. పర్వతాకారులౌ కపి వీరులొచ్చి
లంకలో ప్రవేశింపక మునే్న రాఘ
వుండు కోదండమును ధరించుటకు మునె్న
సీత నాయన దరిజేర్ప శుభము గల్గు

831. అంతట ప్రహస్తుం దట్టహాసముగను
దేవ గంధర్వ పన్నగ గణములను ప
రాజితుల జేసిన మనకు నరుల వాన
రముల కిట్ల ధైర్యపడుట తగని గనియె

832. ఎరుగ నీవు ప్రహస్త రాఘవుని బాణ
ధాటికెదురు నిల్చెడు వారు ధరనులేరు
కుంభకర్ణులు కుంభ నికుంభలాది
నసుర యోధులు కడకింద్రజిత్తు గూడ

833. ఇపుడు లంకేశు గళమును జుట్టుకొనియె
వేయి పడగల కాల నాగాభయకర
విషపుసర్ప విషముచే రక్షింపవలయు
ధర్మవర్తనమను ఔషధమున మీరు

834. వజ్రతుల్యములౌ రామ బాణములకు
కడకు మన చక్రవర్తియు కదన భూమి
యెదురు నిల్వగ జాలడు పిడుగులవలె
దూసుకొని వచ్చు శరముల దప్పుకొనగ

టంగుటూరి మహాలక్ష్మి