సుమధుర రామాయణం

సుమధుర రామాయణం.. (యుద్ధకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

835. మేఘనాథుడు లేచి మనకులమందు
ఇంత శక్తి హీనుడుభీరువెట్లు బుట్టె
నాకు పినతండ్రి టనాహించ నెపుడు
ఇంద్రు గెల్చిన నాకు లెక్కేమీ నరులు

836.వినుకుమార! నీ విట్లు మాటాడ తగదు
తండ్రి మంచిని యోచించు శక్తి లేదు
బుద్ధి పరిణితి జెందని పిన్నవాని
సభకనుమతించు వాడు వధార్హుడౌను

837. సాహసివి తీవ్ర స్వభావుడవును మూఢ
మతివి జ్ఞాన హీనుడవణకువయు లేదు
చంచలుండ నల్పబుద్ధివి పుత్ర రూపి
వైన వైరివి తండ్రికి వంశమునకు

838. అన్నరావణుతోడ విభీషణుండు
రాక్షసేశ్వర బ్రహ్మ దండములు బోలు
రామబాణములకు రణరంగమందు
తట్టుకొని నిల్వగలుగువాడెవడు గలడు

839.రత్నభూషణములు పట్టు వస్తమ్రులను
కాన్కగా నిచ్చి సీతను రాఘవునకు
సాదరంబుగా నర్పిపు సుఖము తోడ
నిర్భయంబుగ జీవింతమసురనాధ!

840. అనగ రావణుడు ‘‘విభీషణ! యిక చాలు
కుపిత సర్పముగల యింట నుండవచ్చు
మిత్ర రూపముతో నున్న వైరితోడ
గలసి మనుట దుర్భరవౌను దుష్టబుద్ధి

841. విప్రునకు తపస్సును చంచల స్వభావ
మాడువారికి జ్ఞాతికి మచ్చరంబు
సహజ లక్షణములు నీవుగాక మరొక
డిట్లు బల్కినదీయింతు నతని తలను’’

842.అన్నకోపము జూచి విభీషణుండు
‘‘అగ్రజుండవు తండ్రిసమానుడవని
ఇంత జెప్పితి కాలము చేరువైన
నీకు నాహితమహితమై గానవచ్చె

843. రామ బాంము దగిలి బాధించు వేళ
నాదు మాటల కర్థము దెలియు నీకు
బంధు మిత్రుల ప్రజల గాపాడుకొనుము
సెలవు బోయెద మీకు మేలౌనుగాక!’’

844.అని విభీషణు డాకసంబునకు నెగసె
మంత్రివర్యులు నల్వురు ననుసరించ
వజ్ర సదృశ గదాపాణియై జలధి ద
రించి శరణు వేడగ రామచంద్రు కడకు

845.అట సుగ్రీవుడు గగనము వంక జూచి
మేరుగిరి శిఖరము బోలు రాక్షసుండు
నల్వురనుచరులతో వచ్చుచున్నవాడు
జంపుటకు నేమొ మనలను జూడుడనగ

846.వానరులు మహాయోధులు సాలవృక్ష
ములను బెకలించి మీరనుమతి నొసంగ
నేల గూల్తుము వారల ననుచు నుండ
నచ్చటకు జేరుకున్న విభీషణుండు

847. గగన వీధిని నిల్చి ‘కపీశులార!
రావణుండను రాక్షసరాజు కొన్ని
నెలల క్రితము రాముని పత్నినపహరించి
దెచ్చె లంకకు ధర్మము దప్పి యతడు

848. అతని తమ్ముడ పేరు విభీషణుండు
జానకిని భర్త కర్పింపు మనుచు హితవు
జెప్పితిని వినక నను దుర్భాషలాడి
బాధబెట్ట వచ్చితి రామునాశ్రయింప

849. దెల్పుడీ మీరు నా రాక దాశరధికి’’
నన సుగ్రీవు డయోధ్యాధి నాధుజేరి
‘‘రావణానుజుడట రాఘవా! తమ శర
ణమ్ము వేడవచ్చె నితని నమ్మరాదు

850. రాక్షసులు కామరూపులు వారి విశ్వ
సింపగారాదు యితడును రాక్షసుండు
రావణుని దూతయై యుండవచ్చు వీని
బంధితుంజేసి శిక్షింపవలయు’’ ననియె

851.రామచంద్రుడు జాంబవంత హనుమంత
అంగదాదుల జూచి మీమీ యభిమత
ములను దెల్పుడన ‘‘త్రిలోకజ్ఞ! తమకు
జెప్పగల వారమా రామచంఅద! మేము

852.మిత్రుల కధీనుడవుగాన మాయాభిమతము
లడిగినావంతె యనుచు తమ యభిప్రాయ
ములను దెల్పిరి శత్రు పక్షమ్ము నుండి
వచ్చెనీతడు శత్రువే నదియుగాక

టంగుటూరి మహాలక్ష్మి