సుమధుర రామాయణం

సుమధుర రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

404. అనుచు హనుమంతు డనితరసాధ్యమైన
కార్యమును జేయు సంకల్పదీక్షితుడయి
దినకర మహేంద్ర పద్మాసనాది దేవ
తలకు శిరము వంచి నమస్కృతుల నొనర్చి

405. తనదు జన్మకు కారణభూతుడైన
ననిల దేవుని కభివందనము లొనర్చి
నేను లంఘించు వేళ రుూ నేల నిలువ
నేరదంచు నెక్కె మహేంద్ర పర్వతమును

406.తన్ననుసరించి వచ్చిన వానరులకు
నెలమి కార్యము సాధించి యేగు దెంతు’’
ననుచు శత్రు నాశన సమర్థుండు హనుమ
యెగసె కుప్పించి రాఘవు నెదను నిల్పి
సుందరకాండము
407. పర్వతంబునగల మహావృక్షచయము
హనుమతో సాగి దూర దేశమున కరుగు
వాని సాగనంపెడు బంధువులను బోలి
కొంత దవ్వరిగి సముద్రమందు బడియె

408. పవన పుత్రుని పాద పీడనకు పర్వ
తము సహింపక నూగగ నందు విహార
ణార్థ మరుదెంచి యున్నవి యచ్చరాళి
సంభ్ర మాశ్చర్యముల మింటికెగసిరపుడు

409. నింగి నంటెడు ఉదధితరంగములను
వక్షమున వెనుకకు ద్రోసి వాయువేగ
మున నరిగెడు కపివరేణ్యు వైనతేయు
డని బెదరె సాగరములోని సర్పచయము

410. రెక్కలున్న గిరీంధ్రుని రీతినేగు
రామదూతకు దేవతా ఋషి గణంబు
మంగళాశీస్సులతో పుష్పవృష్టి గురిసి
రంత సాగరుడు తనలో దాగియున్న

411. పర్వత వరేణ్యు మైనాకు బిలచి ‘నీవు
ఇంద్ర నాజ్ఞను లోకకళ్యాణమునకు
నుంటి వడ్డము పాతాళ వాసులైన
రాక్షసులు పైకి రాకుండ గిరివరేణ్య!

412. ఇప్పుడొక మహత్కార్యము జేయవలయు
రామకార్యార్థియై హనుమంతు డరుగు
చున్నవాడు లంకకు నాతనికి విశ్రాంతి
కొంత గల్పింపవలయు నీశిఖరమందు’’

413. అనిన మైనాకు డుదయించు సూర్యురీతి
జలధిలోనుండి తన శృంగములను నాక
సంబునకు పెంచె తన కడ్డు వచ్చినట్టి
యచలువక్షము తోడ తాటించె హనుమ

414. ఆంజనేయుని యా ఘాతమునకు వెరగు
పడుచు పర్వత శ్రేష్ఠుడు పవన సుతుని
యెదుట మానవ రూపము దాల్చి నిలచి
వానరోత్తమునకు జేసి వందనములు

415. కపివరేణ్య నే మైనాక పర్వతమును
సాగరుడు మీరలనితర సాధ్యమైన
కార్యమును నిర్వహించగ నరుగుచుంటి
రనుచు బంపెను కొంత విశ్రాంతి గూర్ప

416. పక్షములు గల్గి పూర్వము పర్వతములు
యెగురుచుండుట గని యవి యెచట బడునో
యంచు తపసులు తక్కిన ప్రాణికోటి
భీతి చిత్తులై ఇంద్రుని పాహి యనిరి

417. పర్వతముల పక్షములు వజ్రాయుధమున
నుత్తరించుచు నా పక్షములను నరుక
బూన మీ తండ్రి నన్ను గాపాడి సాగ
రంబు జేర్చగ సుఖముగ నింటి నిచట

418. కాన నీ తండ్రి పూజ్యుడు నాకు సాగ
రునకు పూజ్యులు సగర వంశజులు రామ
చంద్రు పూర్వులా వంశము వారు యాధ
రేశు దూతపు పూజ్యుడ వీవు మాకు

419. కపికులోత్తమ మా పూజలన్ గ్రహించి
జనుము మా కుభయులకు నీ దర్శనమున
సంతసముగల్గె నాపై విశ్రాంతి పొందు
మనిన గిరివర్యుతో పవమానసుతుడు
*

టంగుటూరి మహాలక్ష్మి