సుమధుర రామాయణం

సుమధుర రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

469. వెండి బంగారములతోడ చేయబడిన
సుందరములగు వాకిళ్లు చూడ ముచ్చ
టైన మృగపక్షి శిల్ప సుశోభతోడ
మేరుగిరి యెత్తులో సౌధ మెప్పుచుండ

470. శయన పర్యంకములను సింహాసనములు
మధువు గ్రోలెడి పాత్రలు భిత్తికలను
వివిధ మణిరత్న ఖచితములౌచు పట్ట
పగటి భాస్కర ప్రభలతో వెల్గు నింపె

471. వాస్తు శాస్త్ర మర్యాద వదలక గట్టి
నట్టి మంగళప్రదమైన మందిరములు
హేమమణిరత్న మయములై యొప్పచుండె
అన్నిటిని శోధనను జేసి హనుమ జనియె

472. వసుధ మీదికి జారిన స్వర్గలోక
మేమొ యనిపించు పుష్పకంబను విమాన
మాంజనేయునకుం గానుపించె దాని
నద్భుతమ్ముగా నిర్మించె నమర శిల్పి

473. తీవ్ర తపముచే దాని సాధించె ధనదు
డతని నోడించి గొనివచ్చెద దశముఖుండు
సర్వసంపదలకు మిన్నయై దనర్చు
నవ్విమానము త్రిభువన నవ్యకరము

474. ఆ విమానపు గోడలయందు శిల్పి
పర్వతంబుల చిత్రించి పర్వతముల
పై మహావృక్షముల వాని నల్లుకొన్న
కుసుమలతలను రమణీయముగ రచించె

475. రత్న వజ్ర వైడూర్య మరకతమణుల
నతి మనోజ్ఞముగా చెక్కబడిన యట్టి
చిత్రకళను జూచుచు హనుమంతుడు డచల
చిత్తమున జానకినె్వదకుచునె యుండె

476. అవ్విమానపు మధ్యభాగమ్మునందు
ఇంద్రనీల మణిఖచిత స్వర్ణమయము
చందాగు కర్పూర గంధయుతము
బాలభాస్కరతేజ విభాసితమ్ము

477. అద్భుతమ్మగు యసురశేఖరుని శయన
మందిరమ్మది నత్యగీతాది గోష్ఠు
లర్థ రాత్రంబు దనుక సాగించి యలసి
సొలసి నిద్రించు నంగనాసంయుతమ్ము

478. రావణాసుర శౌర్య పరాక్రమముల
కధిక సౌందర్య సంపదలకును మెచ్చి
దేవకాంతల మించు సౌందర్యవతులు
ప్రీతితో గొల్తురతని వరించి పతిగ

479. ఉత్తమ కుల సంజాతలౌ కన్యకలను
మూడు లోకముల వెదకి యపహరించి
దెచ్చి పరిణయమాడె రాక్షస విభుండు
దేవ గంధర్వ పన్నగ వంశజలను

480.వారిలో వివాహితలైన వారుగాని
అన్యపురుషు వరించిన వారుగాని
ఒక్కరును లేరు ధర్మ విగ్రహుడు రామ
చంద్రుసతి పతివ్రత భూమి పుత్రి దప్ప

481. క్షీణపుణ్యలై పుడమికి దిగిన తార
లేమొ యన నొప్పు సుందరులిందరున్న
రావణుడు జానకి నపహరించె నన్న
దివ్యవౌ నామె సౌందర్య మెంతటిదియొ

482 .తన్నుగోరుకొనెడు నుత్తమాంగనలతో
నమరసుఖము పొందు రావణుండు
సీత నామె భర్త చెందతనె యుంచిన
వీని జన్మ ధన్యవౌను గాదె

483. అట్లు దలచుచు కేసరి పుత్రుడపుడు
ముందుకు న్జని నవరత్న ఖచితమైన
పసిడి పర్యంకము పవ్వళించియున్న
మందరాచల సదృశు రావణుని గనియె

484. రత్న కుండల కాంతులు నాల్గు దెసల
వెల్గు నింపగ పుష్పమాలలు ధరించి
దివ్యచందన మలదిన మేనితోడ
పవ్వళించిన రావణ ప్రభుని జూడ

485. ఉన్నతమ్మగు స్తంభము నెక్కె హనుమ
అమర గజ దంత ఘాత చిహ్నములతోడ
నిద్రగూర్కెడు లంకాధినాడు జూచి
చకితుడయ్యె నా రాక్షసు తేజమునకు

టంగుటూరి మహాలక్ష్మి