బిజినెస్

350 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువపై టాటా గ్రూప్ కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2025 నాటికి చేరుకోవాలన్నదే లక్ష్యం

న్యూఢిల్లీ/ముంబయి, డిసెంబర్ 6: ఉప్పు నుంచి ఉక్కు వరకు తయారు చేస్తున్న టాటా గ్రూప్.. 2025 నాటికి తమ మార్కెట్ విలువను 350 బిలియన్ డాలర్లకు పెంచుకోవడంపై దృష్టి సారించింది. గడచిన 15 ఏళ్లలో సాధించిన ప్రగతితో ప్రస్తుతం 100 బిలియన్ డాలర్లకుపైగా మార్కెట్ విలువను సొంతం చేసుకున్న టాటా గ్రూప్‌లో 100కుపైగా సంస్థలున్నది తెలిసిందే. ఇందులో 29 సంస్థలు స్టాక్ మార్కెట్లలో లిస్టవగా, వీటి విలువే 100 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే పదేళ్లలో మరో 250 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది టాటా గ్రూప్.
ఖాన్ అకాడమీతో టై-అప్
అమెరికాకు చెందిన ఖాన్ అకాడమీతో టాటా ట్రస్ట్స్ టై-అప్ అయ్యింది. భారతీయులకు ఈ అతిపెద్ద నాన్-ఫ్రాఫిట్ ఓపెన్-యాక్సెస్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఉచిత ఆన్‌లైన్ విద్యను అందించడానికే ఖాన్ అకాడమీతో టాటా ట్రస్ట్స్ చేతులు కలిపింది. ఈ మేరకు ఆదివారం ముంబయిలో టాటా ట్రస్ట్స్ చైర్మన్ రతన్ టాటా, ఖాన్ అకాడమీ వ్యవస్థాపక, సిఇఒ సల్మాన్ ఖాన్ విలేఖరులకు తెలిపారు. మరోవైపు రతన్ టాటా మాట్లాడుతూ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్‌ఆర్)గా కొన్ని నిధులను తప్పక సంస్థలు ఖర్చుచేయాలని, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రతన్ టాటా పలు సామాజిక సేవలు ఇప్పటికే విస్తృతంగా చేస్తున్నది తెలిసిందే.