బిజినెస్

పెరిగిన టాటా మోటార్స్ విదేశీ అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 11: ప్రముఖ దేశీయ ఆటోరంగ సంస్థ టాటా మోటార్స్ విదేశీ అమ్మకాలు గత నెల ఫిబ్రవరిలో 17 శాతం పెరిగాయి. ఈ ఫిబ్రవరిలో 99,842 యూనిట్లను అమ్మిన టాటా మోటార్స్.. గత ఏడాది ఫిబ్రవరిలో 85,360 యూనిట్లను విక్రయించింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనలో టాటా మోటార్స్ తెలియజేసింది. ఈ ఫిబ్రవరిలో ప్యాసింజర్ వాహన అమ్మకాలు 63,672 యూనిట్లుగా ఉంటే, వాణిజ్య వాహన అమ్మకాలు 36,170 యూనిట్లుగా ఉన్నాయి. పోయినసారి ప్యాసింజర్ వాహన విక్రయాలు 53,878 యూనిట్లుగా, వాణిజ్య వాహన విక్రయాలు 31,482 యూనిట్లుగా ఉన్నాయి. ఇక టాటా మోటార్స్ లగ్జరీ బ్రాండ్లైన జాగ్వార్, లాండ్ రోవర్ అమ్మకాలు 31 శాతం వృద్ధి చెందుతూ ఈ ఫిబ్రవరిలో 52,313 యూనిట్లుగా, క్రిందటి ఫిబ్రవరిలో 39,942 యూనిట్లుగా ఉన్నాయి.