గుంటూరు

హాస్టల్‌ను తనిఖీచేసిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాజకుమారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేపల్లె, మార్చి 29: గత రెండు మార్లుగా ఐఆర్‌ఇఎఫ్ హాస్టల్‌లో విద్యార్థినులు ఆకశ్మికంగా మృతి చెందటంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందని దీనిపై మహిళా కమిషన్ నివేదికను కోరటంతో హాస్టల్లో తనిఖీలు నిర్వహించినట్లు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. మంగళవారం స్థానిక ఐఆర్‌ఇఎఫ్ హాస్టల్‌లో విద్యార్థినులు, స్థితిగతులపై విచారించారు. ఫిబ్రవరి 14న హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థిని తనూజ, మార్చి 28న మాధురి మృతి చెందారని ఈసంఘటనలపై మిగిలిన విద్యార్థులను విచారించారు. హాస్టల్‌వసతి, విద్య, భోజనం, మరుగుదొడ్లు సౌకర్యాలను పరిశీలించారు. ఈసందర్భంగా యాజమాన్యం భోజన వసతులను ఉచితంగా కల్పించిందని, విద్య, వసతి ఉచితమని, ఈహాస్టల్‌లో అనేక మంది కులస్థులు విద్యను అభ్యశిస్తున్నారని విద్యార్థినులు రాజకుమారికి తెలిపారు. దీంతో గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా యాజమాన్యం శ్రద్ధ తీసుకోవాలని, డాక్టర్‌ను ఏర్పాటు చేసుకోవాలని హాస్టల్ నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుండి అనుమతులు పొందాలనే సలహాలు యాజమాన్యానికి రాజకుమారి ఇచ్చారు. స్పందించిన యాజమాన్యం వెంటనే అనుమతులు తీసుకుంటామని, డిడితో మాట్లాడతామని విన్నవించుకున్నారు. ఈకార్యక్రమంలో డిఎస్పీ మహేష్, తహశీల్దార్ ఎం నాగిరెడ్డి,ఆర్‌ఐ యేసుదాసు, సిఐ మల్లికార్జునరావు, మహిళా కమిషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పరిశ్రమలకు అనువైన ప్రాంతం మాచర్ల: కలెక్టర్
మాచర్ల, మార్చి 29: నవ్యాంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు మాచర్ల అనువైన ప్రాంతంగా ఉందని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అన్నారు. మంగళవారం స్థానిక కెసీపీ అథిది గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాచర్ల, గురజాల, సత్తెనపల్లి నియోజక వర్గాలో నీటి ఎద్దడి అధికంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. నీటి ఎద్దడి నివారణకు రూ.10కోట్లు విడుదలైందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణంపైనే దృష్టి సారించిందన్నారు. రైతుల శ్రేయస్సు దృష్ట్యా రాతి పొరలను తొలగించి పంట భూములుగా సాగు చేసుకునేందుకు ఉపాధి హామీ పధకం ద్వారా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక అనుమతి ద్వారా రాతి పొరలను బ్లాస్టింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించటం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ శ్రీనివాసులు, గురజాల ఆర్డీవో ఈక మురళిలు పాల్గొన్నారు. పట్టణంలోని చంద్రవంక నది ఒడ్డున ఉన్న వడ్డెరల శ్మశానవాటికలు ఆక్రమణకు గురవుతున్నాయని శ్రీనివాసరావు, ఎస్‌కెబీఆర్ కళాశాలలో ప్రాంతంలో తమ పూర్వీకులకు చెందిన ఆస్తిని వారసులమైన తమకు ఇప్పించాలని మాచర్ల సుందరరావు కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదులు అందజేశారు.

కనులపండువగా వెంకన్న కల్యాణ మహోత్సవం
సత్తెనపల్లి, మార్చి 29: మండల పరిధిలోని నందిగామలో శ్రీ వెంకటేశ్వరస్వామివారి 22వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం కనుల పండువగా నిర్వహించారు.
వంశ పారంపర్య కల్యాణ భక్తులు మక్కెన శ్రీనివసరావు, గాయత్రిలు స్వామివారికి దగ్గరుండి కల్యాణం జరిపించారు. అనంతరం పుష్పరధారుడైన వెంకటేశ్వర స్వామివారిని పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో నిర్వహణ కార్యదర్శి కలవకోలను సీతారామాంజనేయశాస్ర్తీ, పురుషోత్తమశర్మ, శ్రీనివాస సేవాసంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.