క్రీడాభూమి

సిడ్నీ, ఫిబ్రవరి 21: వనే్డ క్రికెట్ జట్టు నుంచి ఉద్వాసనకు గురైన మాజీ కెప్టెన్ రికీపాంటింగ్ తన టెస్టు కెరీర్ కోసం పోరాడాల్సిందేనని ఆసీస్ మాజీ క్రికెటర్ మార్క్‌వా అభిప్రాయపడ్డాడు. ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్న పాంటింగ్ స్వదేశంలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో కేవలం ఐదు మ్యాచ్‌లలో 18 పరుగులు మాత్రమే చేసి జట్టు నుంచి స్థానం కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వనే్డ కెరీర్ ముగిసిపోయినట్లేనని ప్రకటించిన పాంటింగ్ టెస్టుల్లో కొనసాగుతాననడంతో అదంత సులువైనదేమీ కాదనే రీతిలో మార్క్‌వా స్పందించాడు. టెస్టుల్లో పాంటింగ్‌కు చోటిచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని, ఫలితంగా అతను పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొనవచ్చన్నాడు. అయితే పాంటింగ్ గొప్ప వ్యక్తిత్వం కలవాడని, మైదానం వెలుపలా అతను పోటీతత్వంతో వ్యవహరిస్తుంటాడని అన్నాడు. ఇదిలావుంటే పాంటింగ్‌కు మరో మాజీ సహచర ఆటగాడైన బ్రెండన్ జులియన్ స్పందిస్తూ వనే్డ జట్టులో ఉద్వాసనకు గురవడం చెప్పుకోదగ్గదేమీ కాదన్నాడు. రానున్న నెలల్లో మరిన్ని ఆశ్చర్యకర పరిణామాలు చోటు చేసుకోవచ్చన్నాడు. వనే్డ క్రికెట్‌లో పాంటింగ్ ఇంకా కొనసాగాల్సిన అవసరం లేదని, అయితే టెస్టులపై దృష్టి సారించాలన్నాడు.
Add new comment