భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-34

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దత్తాత్రేయులు తప్ప మరెవరూ గురువు కారని ఇతడి గట్టి నమ్మకం. కావాలంటే నన్ను కూడా దత్తాత్రేయునివా కాదా అని అడుగుతుంటాడు’ అన్నాడు బాబా.
ఇదేంటి ఇతనిని ఎప్పుడూ శిరిడీలో చూడలేదే.. బాబా ఇలా చెప్తున్నాడేమిటి అని మహిలాపతి ఆశ్చర్యంగా అతడివేపు చూశాడు.
మాధవ్ భట్ ఆశ్చర్యంగా చూస్తూ ‘ఈ బాబా చెప్పేది నిజమే. నా గురువుగారు దత్తాత్రేయులు. నేను ప్రధాన్ అనే వారింట రోజు పూజ చేస్తుంటాను. వారి అబ్బాయికి ఈ మధ్య బాగా జ్వరం వచ్చింది. వారు ఈ బాబా ఫొటోను తెచ్చి నాకిచ్చి వారి పూజ గదిలో పెట్టమన్నారు. నేను ఇతడు చూడడానికి ముస్లింలాగా ఉన్నాడు కదా. ఇతడిని పూజగదిలో ఎందుకు అని అన్నాను. ఆ తరువాత ఆ పిల్లవాడికి జ్వరం వచ్చింది. దానితో నేను ఈ ముస్లింను పెట్టుకున్నారు కనుకనే ఈ పిల్లవాడు అనారోగ్యం పాలయ్యాడు అని చెప్పాను. దాంతో మరింత జ్వరం వానికి ఎక్కువైంది.
కాని నాలో నేను తప్పుచేశానేమో అన్న శంక బయలుదేరింది. రాత్రి నేను ఈ బాబా ఫొటో దగ్గర నిల్చుని నీవు దత్తాత్రేయునివైతే వెంటనే ఈ బాబు జ్వరం తగ్గిపోవాలి అన్నాను. కొద్దిసేపటికే పిల్లవానికి జ్వరం తీసింది. ఆ తరువాత మళ్లీ జ్వరం రాలేదు. అపుడు ఆ ఇంటివాళ్ళు బాబావల్లనే జ్వరం తగ్గిందని అన్నారు. నేను దత్తాత్రేయులయితే జ్వరం తగ్గాలి అన్నాను కదా. మరి ఇతను దత్తాత్రేయుడా, ముస్లింనా అనే మీమాంస నాలో ఏర్పడ్డది. అందుకే ఇక్కడకు వచ్చాను’ అన్నాడు మాధవ్‌భట్.
‘అదే నీలో నాకు నచ్చింది. నిజమేదో మనసులో ఏం ఉందో అదే నీవు చెప్పేశావు. శంక తీరిందా, నేను ముస్లిమును కాదు, హిందువును కాదు. అసలు నాకు మతమేదీ లేదు. ఎవరు ఏది కోరుకుంటే వారికలా కనిపిస్తాను. నాకు రూపమే లేదు’ అన్నాడు బాబా.
వెంటనే మాధవ్ భట్ బాబాకు నమస్కరించాడు. తన తప్పును క్షమించమని అడిగాడు.
‘సరే! బానే వుంది కాని రోజూ నీవు భగవద్గీత చదువుకుంటావు కదా. మరి దాని గురించి వీరికి కాస్త చెప్పి వెళ్లు’ అన్నారు.
‘స్వామి గీత నాకేమి వచ్చు’ అన్నాడు.
‘ఏది వస్తే దానే్న చెప్పు’ అన్నాడు బాబా.
మాధవ్‌భట్ ఇలా చెప్పసాగాడు.
కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మఫల హేతుర్భూర్మాతే సంజ్గోస్త్వ కర్మణి..
భగవద్గీతలో రెండవ అధ్యాయంలో అర్జునునిడితో కర్మ చేయడానికే నీకు అధికారం ఉంది. ఫలం ఆశించడానికి కాదు. ఫలాన్ని ఆశించకుండా అశ్రద్ధ లేకుండా కర్మ చేయి అని అన్నాడు..
చేసేవాడు చేయించేవాడు కూడా భగవంతుడే. ఫలాన్ని అనుభవించేవాడు, ఫలాన్ని అందించేవాడు కూడా భగవంతుడుతే కనుక ఫలాపేక్ష లేకుండా పని చేయమని కృష్ణుడు అర్జునునితో చెప్పాడు. నిష్కామంతో ఏ కోరికలు లేకుండా ఈ పనిని ఈశ్వరుడు నా చేత చేయిస్తున్నాడు. దీనికి ఫలాన్ని ఏది ఇవ్వాలని ఈశ్వరుడు సంకల్పిస్తాడో దానినే ఇస్తాడు అని స్థిరమైన బుద్ధితో నమ్మి పనిని చేయాలని దీని అర్థం అని మాధవ్ భట్ అక్కడివారితో చెప్పాడు.
బాబా ‘నీవు చేయాల్సిన పనిని చేయి. అది చాలు నేను చేయవలసింది నేను చేస్తాను. దీని గురించి మీకు ఆందోళన వద్దు’ అర్థం అయిది కదా అన్నాడు.
అందరూ తలలు ఊపారు. నమస్కరించారు.
ఇక ఈ రోజుకి చాలు మాధవా. నీవు వెళ్లి అనుమానం లేకుండా నీ పనిని నీవు చేయి. అన్నింటిలోనూ నన్ను చూడగలిగే నేర్పును సాధించు. అందరూ ఒక్కడే ఉన్నదే ఒకటి. నీలో రెండు ఎందుకు వస్తాయి. నీవు నేను కూడా ఒకటే అన్నాడు బాబా.
మాధవ్ భట్ ఆనందబాష్పాలు రాలుస్తూ బాబాకు నమస్కరించి ‘బాబా శరణం శరణం’ అని అన్నాడు.

-ఇంకా ఉంది

జంగం శ్రీనివాసులు 837 489 4743