భక్తి కథలు

శ్రీ సాయ లీలామృతం-38

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సపత్నేకర్ విచారంలోంచి బయటకు వచ్చాడు.
‘అయ్యా! బహుశా నా స్నేహితుడు ఈ బాబా గురించి చెప్తే నేను అంతగా నమ్మలేదు. కాని మా భార్యకు నిన్నటిరాత్రి ఒక కల వచ్చింది. ఆ కలలో ఓ ఫకీరు కనిపించాడు. నా భార్య మంచినీటికి కడవను పట్టుకుని వెళ్తుంటే ‘అమ్మా నీకెందుకా శ్రమ నేను తెచ్చిపెడతాను’ అని ఆమె చేతిలోని కుండను తీసుకొని వెళ్లి నీళ్లు తెచ్చి ఇచ్చాడట.
మేము మా కొడుకును పోగొట్టుకున్నాము. వానికి వచ్చిన జబ్బు నయం కాలేదు. దాంతో వాడు కన్నుమూశాడు. ఆ బాధనుంచి ఉపశమనం కలగడానికి మేము తీర్థయాత్రలు చేస్తూ వస్తున్నాము. దారిలో మాకు ఈ శిరీడీ వెళ్లమని యాత్రికులెవరో చెప్పారు. దానితో మేము ఇక్కడకు వచ్చాము’ అని సపత్నేకర్ చెప్పాడు.
‘అంతేకాదు మేము వచ్చే దారిలోనే మాకు ఈ బాబా కనిపించారు. ఇతడిని చూడగానే మా భార్య ‘ఇతడే నా కలలో కనిపించింది. ఇతడే నాకు నీరు తెచ్చి ఇచ్చింది అని చెప్పింది. దాంతో అపుడు ఆమె సాయికి నమస్కరించింది. అపుడూ ఆశీర్వదించాడు. నన్ను మాత్రం చూడనట్టు వెళ్లిపోయాడు. ఇపుడు కూడా నన్ను కోపంగా చూస్తున్నాడు ఎందుకో’ అని చెబుతుండగానే బాబా లోపలికి వచ్చాడు. వస్తూనే-
‘మరి నీకు నమ్మకమే లేదు కదా. పరీక్ష పాసు కావాలి అంటే భగవంతుని దయ అక్కర్లేదు. కేవలం చదివితే చాలు అని చెబుతావు కదా’ అన్నాడు బాబా.
సపత్నేకర్ బాబా కాళ్లమీద పడి ‘బాబా మీరు సర్వాంతర్యామి. నేను ఎక్కడో అన్న మాటలు మీకు ఎలా తెలిశాయి. నేను చదవాలన్న ధ్యాసతో చెప్పాను కాని భగవంతుని దయలేకపోతే ఎలా గట్టెక్కగలం. బాబా నన్ను క్షమించండి’ అని పదే పదే వేడుకున్నాడు.
బాబా చిరునవ్వుతో మరి ఇప్పుడన్నా నా మీద నమ్మకం వచ్చిందా అంటూ తలపై చిన్నగా దెబ్బవేసి వెళ్లారు.
అప్పట్నుంచి సపత్నేకర్ అతని భార్య ఇద్దరూ బాబా దర్శనం కోసం వచ్చేవారు. తరువాత కాలంలో వారికి బాబా దయవలన ఇద్దరు కొడుకులు పుట్టారు.
****
కొన్నాళ్ల తరువాత మరొక సంఘటన శిరిడీలో జరిగింది.
బాలక్‌రామ్ మాన్కర్ అనునతను తన భార్య చనిపోయిందని ఇక తనకు సంసార లంపటం వదిలిపోయిందని కేవలం శివనామస్మరణతో జీవిస్తాను అని చెప్పి శిరిడీ వచ్చాడు. ఇక్కడే ఖండోబా ఆలయాన్ని మసీదులోని బాబాను చూస్తూ నిరంతరం భజన చేస్తూ ఉండేవాడు.
ఒక రోజు బాబా అతడిని దగ్గరకు పిలిచి ‘నేను నీకు 12 రూపాయలు ఇస్తాను. నీవు మచ్ఛేంద్రగడ్‌కు వెళ్లు. అక్కడే కొన్ని రోజులు ఉండు. తరువాత నేను చెప్తాను. అప్పుడు నీవు ఇక్కడకు వద్దువుగాని’’ అని అన్నారు.
బాలక్‌రామ్ దిగాలుగా బాబా వైపు చూశాడు. ఏం కాదు, నీవు మళ్లీ ఈ శిరిడీ వస్తావు. ముందు నేను చెప్పినట్టు చేయి అని అన్నారు.
అంతలో అక్కడే వున్న హేమాదిపంత్ వారు వీరు అందరూ కలిసి బాలక్‌రామ్‌ను బాబా చెప్పినట్టు చేయి నీకు మంచి జరుగుతుంది అని ప్రోత్సహించారు. కాని అతడి మనసులో మళ్లీ అక్కడికివచ్చి నాకు ఎవరు చెప్తారు శిరిడీ రమ్మని అని సందేహించాడు. ఆ సందేహంతోనే బాలక్‌రామ్ మచ్చేంద్రగడ్‌కు వెళ్లాడు. అతడు అక్కడ మచ్చేంద్రుని పూజించసాగాడు. కొన్నాళ్లు గడిచాయి. బాలక్‌రామ్ మనసులో అనుమానం పోలేదు.
ఒక రోజు బాలక్‌రామ్ గుడికి వెళ్తుంటే.. బాబా కనిపించారు. బాలక్‌రామ్ ఆశ్చర్యంగా చూస్తూ ‘బాబా ఇక్కడికి మీరే వచ్చారా!’ అని అన్నాడు.
‘‘పిచ్చివాడా! నేను ఇక్కడికి రావాలంటే బస్సులు, రైళ్లు, టాంగాలు కావాలా ఏమన్నా? లేక భౌతికంగానే రావాలా లేను’’ అన్నాడు.

-ఇంకా ఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743