భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-50

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారంతా కలిసి గోధుమలు విసిరి బాబాకు ఇచ్చేవారు. ఒక్కోసారి బాబా వారిని వంట చేయమని చెప్పేవారు. వారంతా కలిసి అన్నం కూరలు చేసేవారు. శిరిడీకి వచ్చిన భక్త జనం అందరూ వారు వండిన దాన్ని బాబాకు నివేదన చేసి వారంతా ప్రసాదంగా భుజించేవారు.
అట్లా ఒకసారి గోధుమలు విసురుకుంటున్న ఆడవాళ్లు మాట్లాడుకుంటూ బాబా తమకు చేసిన మేలును గూర్చి మాట్లాడుకుంటున్నారు. అందులో పార్వతీబాబాయి అనే ఒకామె చంద్రాబాయితో మాట్లాడుతూ-
‘‘అక్కా! నీవెప్పుడూ ఈ బాబా దగ్గరకు వస్తుంటావు కదా. నీకు ఇంత నమ్మకం ఏర్పడటానికి కారణమేమిటి, అది మాకు చెప్పవా’’ అని అడిగింది.
అపుడు చంద్రాబాయి ఇలా చెప్పింది.
నా ఇల్లు నిలిపినవాడు ఈ బాబానే. మా వారు నన్ను వదిలేసి ఎటో వెళ్లిపోయేవాడు. కాని బాబా ఆపి నన్ను మావారిని ఒకటి చేసేవారు. దానివల్లనే నాకు సంసారం, పిల్లలు కలిగారు. అందుకే నేను ఎప్పుడూ బాబాను స్మరిస్తూ ఉంటాను. అపుడప్పుడు బాబా దర్శనానికి వస్తుంటాను అని చెప్పింది.
అదెలా జరిగిందో తమకు చెప్పమని అందరూ చంద్రాబాయిని అడిగారు.
చెపుతాను వినండి.
పూర్వం ఒకసారి నేను మా వారు శిరిడీ వచ్చాము. మావారు నాకు చెప్పకుండా శిరిడీ నుంచి వెళ్లిపోయారు. నేను ఇక్కడ నాలుగు రోజులు ఉందామని వచ్చాము కదా. ఎటైనా వెళ్లారేమోలే సాయంత్రానికి వస్తారు అని నేను బాబా దగ్గరే కూర్చుని భజన చేస్తున్నాను.
బాబా నా దగ్గరకు వచ్చి ‘అమ్మా ఇక నువ్వు బయలుదేరు. పండరి వెళ్లు’ అన్నారు.
‘దేనికి బాబా నా దగ్గర అసలు డబ్బులు లేవు. అన్నీ మావారే చూసుకుంటారు కదా’ అన్నాను నేను.
‘డబ్బులు అక్కర్లేదు. నీకు నాకు రైలు అక్కర్లేదు. నీవు బయల్దేరు’ అనేసి బాబా వెళ్లిపోయారు.
నేను పండరీ వెళ్లడమెలా, మా వారు ఎక్కడికి వెళ్లారో బాబా ఇలా చెబుతున్నారే అని ఆలోచిస్తూ ఉండిపోయాను.
అంతలో ఒకతను వచ్చి పండరికి టిక్కెట్లు ఇవ్వమన్నారు అని నా చేతిలో రెండు టిక్కెట్లు పెట్టారు.
ఓహో మా వారు పంపించారు అనుకున్నాను. అంతలో మా ఆడమడుచు వచ్చి ‘పద పండరి వెళ్దాం. మా అన్న నిన్ను వదిలేసి ఎక్కడికో వెళ్తాను అని వెళ్తున్నాడట. పద పద వెళ్దాం నీ దగ్గర టిక్కెట్లు ఉన్నాయి కదా’ అంది.
నాకు అంతా వింతగా అనిపించింది. టికెట్లు ఉన్నాయని చెబుతూ మేమిద్దరం రైలు ఎక్కాము. రైలు కొంతదూరం వెళ్లింది. అక్కడ రైలు ఆగిపోయింది. ఇక ఇప్పుడిప్పుడే రైలు వెళ్లదని ఆ రైలు ఏదో చెడిపోయిందని చెప్పారు. అది కురుద్వాడీ అనే ఊరు.
నేను అక్కడినుంచి ఎటు వెళ్లాలో దిక్కుతోచక కూర్చున్నాను. నా ప్రక్కనే మా ఆడబడుచు కూడా కూర్చుంది- ఇపుడు మనం ఏమి చేద్దాం అంటూ- అంతలో అక్కడికి ఒక ఫకీరు వచ్చాడు. ఆయన మా దగ్గరికే వచ్చి ‘అమ్మా ఇదిగో ఈ రైలు ఎక్కండి. ఇవిగో టిక్కెట్లు.. మీ వారు ధోండ్ స్టేషన్‌లో ఉన్నారు’ అని చెప్పాడు.
మేము మారు మాట లేకుండా రైలు ఎక్కాము.
మేము రైలు దిగేసరికి మావారు మాకోసం ఎదురుచూస్తున్నారు. నేను కన్నీరు కారుస్తూ దగ్గరకు పోగానే.
ఎందుకు చంద్రా భయం. నేను వెనక్కి వచ్చేసాను. మొదట నేను వెళ్దామనుకున్నాను కాని బాబా వచ్చి నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టి వెళ్లకు ఇది నా ఆజ్ఞ అన్నారు. ఇపుడు నువ్వు వస్తున్నావని కూడా బాబానే చెప్పారు. మీరిద్దరినీ తీసుకుని శిరిడీ రమ్మని పిలిచారు అని మావారు నాతో చెప్పారు.
నాకు ఆశ్చర్యమూ, ఆనందమూ కలిగింది. నేను వెంటనే బాబాకు నమస్కరించాను. అందరం కలిసి శిరిడీ వచ్చాము. అలా నా కాపురం నిలబెట్టింది బాబానే అని చెప్పింది. అది విని అందరి కళ్లలో ఆనంద బాష్పాలు రాలాయి.
అలా అందరూ ఎవరికి కలిగిన ఆనందాన్ని వారు చెప్పుకుంటూ పనులు చేస్తున్నారు.
నిర్మలాబాయి అనునామె ఆమె అనుభవాన్ని ఇలా చెప్పింది.
నాకు వివాహం అయి చాలాకాలం అయింది. అందరూ ఇక నాకు పిల్లలు పుట్టరని చెప్పారు. మా పెద్దలంతా మావారికి రెండో పెళ్లి చేయాలని కూడా అనుకున్నారు. అపుడు నాకు బాబా గురించి నా స్నేహితురాలు చెప్పింది. నేను బాబాను ఎంతో వేదనతో ప్రార్థించాను. ఎలాగైనా నాకు సంతానం కలిగించు బాబా, నా సంసారాన్ని నిలబెట్టు అని వేడుకున్నాను.

-ఇంకా ఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743