భక్తి కథలు

కాశీ ఖండం.. 78

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సవతి కొడుకు చేసిన నేరాన్ని కాచినంత మాత్రాన ఏమవుతుంది? చిన్న తప్పుకి తగని పెద్ద శిక్ష విధించడం తగవా? యముడు తనపైకి పాదం చాచగా కనికరం ఇసుమంతయినా లేక కంటికొసలు కెంపు కదురుగా క్రోధంతో చూసి ఆ బాలుడైన యముడి పాదం తెగిపడాలని శపించింది.
యముణ్ణి ఛాయ శపించిన విషయం తెలిసి, భాస్కరుడు ఛాయాదేవిని కని ‘‘ఎంతటి అపరాధం ఒనరించినా క్రూరబుద్ధితో తల్లి కొడుకుని ఈ విధంగా శపించదు. అతివా! నువ్వు ఎవతెవి? నిజం చెప్పు’’ అని అడిగాడు. అంత ఛాయాదేవి శాపభీతితో తన వృత్తాంతం చెప్పివేసింది.
దినకరుడు ఆమెయందు అపరాధాన్ని పొడగానక యముణ్ణి కాంచి ‘‘తల్లి శపిస్తే ఆ శాపాన్ని మరలించడం ఎవరి శక్యమూ కాదు. నీ పాద మందలి మాంసమును క్రిమికీటకాలు తొలుచుకొని భక్షింపగా అవనిపై పడుతుంది’’ అని చెప్పి కుమారుణ్ణి ఓదార్చాడు. పిమ్మట త్వ్రష్ట ప్రజాపతి భవనానికి అరిగి, ఆ త్వష్టవల్ల తన భార్య సంజ్ఞాదేవి తపము చేయపోవడం, ఆమె అప్పుడున్న జాడయు ఎరిగి చని తన ముందట-
కఠినాలైన గిట్టల ఘట్టనల చేత ధరణి పటహవాద్య ధ్వని ప్రస్తరింపగా, ధవళములైన చిగురుల మాదిరి మెత్తని తోక గుచ్చు కదలికలు వనె్నల కాంతుల్ని గండూషించి వుమియగా, తెల్ల తామరలను పోలిన వెడద కన్నులలో తారకలు (కంటిపాపలు) తేంట్ల పోలికని వహింపగా, భరణి వంటి ముట్టె తెరచినప్పుడు మొగ్గలవంటి దంతాల కాంతి తళుక్కు తళుక్కుమని మెరవగా, కొదమ ప్రాయం కల ఆడు గుర్రమయి కురుక్షేత్రంలోని అరణ్య వీధుల్లో ఏకాంతంగా సంచరిస్తున్న పరమ పతివ్రత అయిన సంజ్ఞాదేవిని సూర్యుడు దవ్వుల నుంచి వీక్షించాడు.
ఆడు గుర్రము రూపుదాల్చి తన ప్రియ పత్ని అడవుల సంచరించడం కాంచి తానునున్న సూర్యుడు మగ గుర్రం ఆకారం ధరించి క్రొవ్వి మదం కలిసి చెంతకు వచ్చి నిర్వ్యాజమైన ప్రేమ విలాసంతో చీటికిమాటికి దిక్కులు చిల్లులు పడ హేషలు చేసింది. అశ్వరూపధరుడైన భానుడు ఆడు గుర్రం అయిన సంజ్ఞాదేవిని అల్లన చేరి కావడంతో మన్మథ వికారం కల్గగా మోర మోరపై మోపి మూర్కొన్నాడు.
ఈ విధంగా తనకు సాక్షాత్కరించిన తపోలక్ష్మిని పోలిన ఎర్రని కాంతి పుంజాల చేత పది దిక్కుల్ని వెలిగిస్తున్న ఆ ఆడు గుర్రాన్ని సంగమింపదలచి భాస్కరుడు ఘోటక రూపంలో వున్న మన్మథ ప్రేరితుడై లేత గరికపోచలు నమలడంవల్ల ఆకుపచ్చ రంగు నురుగు తిట్టల జిడ్డు తేరుతూ వేడి నిట్టూర్పులు విడుస్తూ ముక్కు చెరమలాడిస్తూన్న ఆ ఆడు గుర్రం ముఖాన్ని ముద్దుపెట్టుకొంది. అంత ఘోటికి రూపంలో వున్న సంజ్ఞాదేవి తన అంతఃకరణ ప్రవృత్తియే ప్రమాణంగా ఆ ఘోటకాన్ని సూర్యుడే అని గ్రహించి ఇష్టంతో కోర్కి జనింపగా నిలిచి వుంది. ఋతుమతి అయిన ఆడు గుర్రం అరవిరిసిన తామర మొగ్గను పోలిన తన యోనిని తెరుస్తూ ముడుస్తూ కదలక మెదలక నిలిచి వుండగా మోరమోరకు సోకించి, చెక్కిలి కరచిన్నీ ఆ ఆడు గుర్రాన్ని డగ్గరి నిలబడింది. అంత ఆ మగ గుర్రం యొక్క ముక్కుపుటాలు నిండి కడిమి పువ్వుల వాసనతో శుక్లం స్రవించింది. ఆ శుక్లం లేక వీర్యంవల్ల ఆ సంజ్ఞాదేవికిద్దరు కవల పిల్లలు ‘నాసత్యులు’ అను నామంతో జన్మించారు. ఆ పిల్లల కవ దేవతల వైద్యుల జంట అయింది. అంత సూర్యుడు తన నిజ రూపాన్ని ధరించాడు. సంజ్ఞాదేవి కూడా సంతసంతో తన నిజరూపాన్ని తాల్చింది. పిమ్మట ఆనందంతో దంపతులు నిజ నివాసానికి అరిగారు.

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి