భక్తి కథలు

కాశీ ఖండం.. 91

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఓ పద్మభవా! పరతత్త్వము ఏదో తెలిసికొనలేక వూరక ఈ మహర్షులతో నేనే పరమాత్మని అంటూ అమరులందరూ పరిహాసం చేసేటట్లు దురహంకారంతో పలకడం నీకు తగివుందా? విను, నేను సాక్షాత్తు నారాయణుడిని, యజ్ఞపురుషుడిని. జగదేక ప్రభువిని. అవ్యయుణ్ణి. ‘అవ్యయతత్తం’ అనే శబ్దం (శాశ్వతతత్త్వం) నాయందే సుప్రతిష్ఠితం. నువ్వు ఈ విషయంలో ఎందుకూ కొరగాని, పెద్దరికాన్ని మీద వేసుకొని అహంకరించకు.
ఈ చందంగా ఇరువురు అన్యోన్య జయార్థులు అవుతూ వాదించి వాదించుకొని తను ఎక్కువ తక్కువ తనాలను (తారమ్యాలను) గురించి వేదాలను అడిగారు. అప్పుడు ఋగ్వేదం ఈ భంగి పలికింది.
‘అనఘాత్ములారా! ఏ దేవుడు తన జఠర గోళంలో సమస్త చరాచర భూతాల్ని స్వరూపం కోల్పోకుండా వుంటాడో, ఏ దేవుడు తన మాయాశక్తిచేత సమస్త విశ్వాన్ని నిరంతరం వ్యాపింపజేస్తాడో, ఏ మహాత్ముడు ఉపనిషదర్థాలు అనే సౌధాగ్ర కుట్టిమాల్లో విహరిస్తూ వుంటాడో, ఏ మహితుడు నిత్యము, మంగళకరమయము, సమున్నతమూ అయిన ప్రణవఘోషతో ఒక్కడు సంచరిస్తాడో, అనామయుడు, అచింత్యుడు, ఆద్యుడు, నిరాకారుడు అయిన రుద్రుడు వుండగా ఇతరుడికి ఎవ్వడికైనా అవ్యయతత్త్వాన్ని నేనే అని పలకడం శక్యమా? అని పలుగా యజుర్వేదం ఈ రీతి పలికింది.
‘‘‘సకల యజ్ఞ క్రియాకలాపం చేత ఎవడు పూజనీయుడవుతూ అలరారుతూ వుంటాడో- అధ్యాత్మ విద్యారహస్య మార్గాన కాని ఎవడు చూడతరం కాని వాడో, వేదాలయందు ప్రామాణ్య విశేషాలవను ఎల్లప్పుడు తొలగకుండా చేస్తాడో, సుప్రసిద్ధమైన కూటస్థ స్వభావాన్ని సమీక్షిస్తాడో, అటువంటి శివుడు ఒక్కడే తప్ప ఇతరుడు ఎంతటివాడైనా అవ్యయతత్త్వం అనే నామం తాల్పడానికి అర్హుడు అవుతాడా? ధర్మాత్ములారా! మనస్సులో ఈ విషయాన్ని సందేహించవద్దు.
పిమ్మట సామవేదం ఈ విధంగా చెప్పింది.
‘‘ఏ ఘనుడి క్రియాశక్తివల్ల సమస్త సృష్టి తీగ సాగినట్లు పెంపొందుతున్నదో, జ్ఞాన ప్రకాశమే స్వరూపంగా వున్న ఎవడిని తత్పరభావం ఒప్పగా పరమార్థవిదులు ధ్యానిస్తారో, ఎవడి శుభప్రదం అయిన తేజం సూర్యుడు, చంద్రుడు, అగ్ని, గ్రహాలు మొదలైన వాటికి వెలుగు ఒసగుతుందో, అన్యులు తాల్పశక్యంకాని ఈశ్వరశబ్దం అలఘు రీతి ఎవడిని ప్రేమించి విడువక వుంటుందో, జనన మరణాది వ్యవహారాలకెవ్వడు అందడో, అభవుడు, ఫాలనేత్రుడు, చంద్రకళావతంసుడు, తత్పదవాచ్యుడు అవ్యయతత్త్వం అవుతాడు కాని అల్లులైన ఇతరులకి అట్టి మహత్త్వం కలుగుతుందా?’’
తర్వాత అధర్వవేదం ఈ కరణి పలికింది:
‘‘ఎవడు పూసలలోని బొందులాగు సమజీవుల్లోను ప్రవర్తిస్తాడో, ఏ దేవుణ్ణి భక్త్యనుగ్రహంచేత ధన్యులైన జనులు మనఃపద్మాల్లో పొడగాంచుతారో, ఎవడు ఈ సమస్తమూ తానే అయి వుండిన్నీ, ఏమీ తాను కాక ఏకహేళితో వున్నాడో, ఎవడి సత్తుని ఇదం ఇత్థం అని శాస్తవ్రాక్యాలు నేడున్నూ నిర్ణయించి చెప్పలేవో, నిరుపమానమైన కైవల్య పదానికి నిలయము అభవుడు, అప్రతర్క్యుడు (ఊహకందనివాడు), శంకరుడు, అప్రమేయుడు, అయిన అతడే అవ్యయతత్త్వం అని పిలువబడతాడు. మహితాత్ములారా! ఇతరమైన ఆలోచనల్ని మరచిపోవలసింది.

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి