భక్తి కథలు

కాశీ ఖండం.. 171

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ కాశీ నగరంలో ప్రతి యింట ఊరక- ఏ కారణం లేకుండా భిక్ష వెయ్యక ఏ విధంగా పంపింది? ఈ విషయం మహాద్భుతమయినది కాదా?
గృహ ప్రాంగణంలో ఆవు పేడతో నీళ్లు చల్లి అలికి, నాల్గువంకలా మ్రుగ్గు కర్రలు లాగి, ఏతెంచిన అతిథిని అక్కడ నిలుచుండబెట్టి, అర్ఘ్యపాద్యాలు ఒసగి, పుష్పగంధాలతో పూజలిచ్చి చక్కగా తోమి కడిగిన బంగరు గరిటెతో అన్నంపైన నెయ్యి అభిఘారం చేసి, ఫలాలు, పాయసం, అప్పం మొదలైన బహు పదార్థాలతో భక్త్భివంతో, విశ్వాస భావంతో, అందమైన కరములందు కంకణాలతో గాజులు ఒరసికోగా కాశీపురంలో భదానీ దేవి కూర్మి చెలిమికత్తెలు అయి బ్రాహ్మణ పతివ్రతలు భిక్షకులకి మాధుకర భిక్ష పెడతారు.
కటకటా! కాశీనగరంలో అటువంటి పరమ పతివ్రతల్లో ఏ పుణ్య పురంధ్రీ కూడా భిక్ష పెట్టలేదు. నేను ఈ రోజు ఉదయానే్న లేచి ఏ పాపాత్ముడి ముఖం చూసి వున్నానో కదా!
శిష్యులారా! ముఖ పద్మాలు వడలివాడిపోయి వున్నాయి. మీ భోజన పాత్రలు శూన్యంగా వున్నాయి. మీకు కూడా భిక్షాన్నాలు లభించలేదని నాకు తెలిసింది. చేలలోని జొన్నకొయ్యలు ఆ చేల పంటలు ఎంత అధికంగా పండాయో తెలుపుతాయి కదా!
ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థాలకూ ఆటపట్టు అయిన ఈ కాశీ నగరంలో నేడు మనకి భిక్షాన్నం పుట్టకుండడానికి కారణం ఏదియో మీరే పరామర్శించి లేక పరిశోధించి రావలసింది’’ అని పలుకగా, వ్యాస శిష్యులు ‘సరే’ అని గురువుగారి ఆజ్ఞ చేత అన్ని వంకలకు చని ఏ అవకరం లేక ఏ అశుభం పొడగానక మరలి వచ్చి శిష్యులందరూ వేదవ్యాస మహర్షితో ఈ క్రియ వచించారు.
‘‘నారాయణావాతారుడవైన వేదవ్యాస మహామునీ! కాశీలో ఏ అపశకునం లేదు. ఏ అశుభం జరగలేదు.
మిమువంటి అధిక పుణ్యాత్ములు నివసిస్తూ వుండగా ఈ పట్టణానికి ఏ కీడు సంభవిస్తుంది?
ఏ కాశీ పవిత్ర నగరంలో కైలాస శిఖరాన్ని విడిచి విశే్వశ్వరుడు విజయం చేసి వున్నాడో ఏ పట్టణానికి సమీపంలో హారం రీతిని భాగీరథీ గంగ ప్రవహిస్తూ వుంటుందో, ఏ పురంలో ఆకొన్నవారికి అమృత భిక్షాన్నాన్ని శైలతనయ అనుగ్రహిస్తుందో, తన నుదుటిపైన యువరాజ పట్టాన్ని మన్నించి డుంఢి విఘ్నేశ్వరుడు వుంటాడో, ఏ కాశీపురిలో తమ అంతటివారు పరమ పావనులు మునీశ్వరులు ఎల్లకాలమూ విడువకుండా వుంటారో ఆ కాశీలో భిక్షాన్నం పట్టెడైనా అబ్బదు అనడం వినడానికి పొసగుతుందా? దీనికి హేతువుని అరసి చూడాలి!
సన్నని సంజవనె్న చీనా పట్టుపుట్టం కట్టుకొని, వాలుకొప్పు నిండా పువ్వులు తురుముకొని, కస్తూరి మేదించిన గంధసారం అలదుకొని, చెవి తమ్మెలకి ముత్యాల కమ్మ పంజులు పెట్టుకొని, సీమంత రేఖలో చేర్చుక్క అనే నగని సవరించుకొని, అలకలమీద ‘చిన్న పూవు’ నగని అలంకరించుకొని, శ్రీకి నిలయాలైన చరణాలయందు బంగరు అందెలు తాల్చి, కటి ప్రదేశాన వజ్రాలు పొదిగిన మొలనూలు నెలకొల్పుకొని- అన్నపూర్ణ, విశాలాక్షి అనే పేరులతో కాశికానగర చతుష్పథంలో విశే్వశ్వరుడి సతి మధ్యాహ్న వేళ అమృత పాయస దివ్యాన్నాన్ని ప్రతిదినం పెట్టుతుంది.
మనం అందరం కూడా మన మన పూర్వజన్మల్లో అతిథులకి మధ్యాహ్న కాల భిక్ష పెట్టకపొమ్మని కసరుకొని వుంటాము. బ్రహ్మదేవుడంతటివాడికి కూడా ప్రారబ్ద కర్మఫలం అనుభవించకుండా వుండటం అలవి అవుతుందా?
ఆనందకాననంలో స్థిరంగా నివసించే జనులు అందరూ సర్పాభరణులే! అందరూ నీలకంఠులే! అందరూ గిరిశులే! అందరూ శిశు శశికళాధరులే!

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి