బిజినెస్

కార్మిక సంఘంతో త్రైపాక్షిక ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగరేణి డైరక్టర్ పవిత్రన్ వెల్లడి
హైదరాబాద్, మార్చి 17: సింగరేణి కాలరీస్ గుర్తింపు కార్మిక సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంతో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ కె.వి.రవీంధ్రనాథ్ సమక్షంలో 9 అంశాలపై త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. గురువారం హైదరాబాద్‌లోని ఆర్‌ఎల్‌సి కార్యాలయంలో ఈ త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. చాలా కాలం పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న స్టెనోగ్రాఫర్లు, పారా మెడికల్ స్ట్ఫా, డైటీషియన్, కెమిస్ట్, మైనింగ్ సర్దార్లకు పదోన్నతులు ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. బద్లీస్‌ని క్రమబద్దీకరించాలని మరో ఒప్పందం జరిగింది. దీని వల్ల దాదాపు 750 మంది బద్లీలకు మేలు కలగనుంది. కార్మికులకు లాకర్ సౌకర్యం ఉన్న పెట్టెలను ఇవ్వాలని నిర్ణయించారు. మరికొన్ని అంశాలపై స్నేహపూర్వక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందానికి కొన్ని రోజుల ముందు సింగరేణి చైర్మన్ స్ధాయిలోనూ, ఆ తర్వాత డైరక్టర్ (ప) స్థాయిలోనూ జరిగిన చర్చలు సఫలం కావడంతో ఇప్పుడు డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగిందని సింగరేణి అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందం సందర్భంగా డైరక్టర్ పవిత్రన్ మాట్లాడుతూ కంపెనీలో మంచి పారిశ్రామిక సంబంధాలు నెలకొల్పేందుకు, సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.