భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-39

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలక్‌రామ్‌కు ఏమీ అర్థం కాలేదు. కాని సంతోషంతో ‘బాబా నా బసకు వెళ్దాం రండి’ అని పిలిచాడు.
‘ఆ ఏమీ వద్దులే.. నీవు ఇక శిరిడీ వచ్చేయి, నేను వెళ్తాను’ అని వెనుతిరిగారు. బాలక్‌రామ్ ఆనందంతో కళ్లు మూసుకొని నమస్కారం చేశాడు. తిరిగి కళ్లు తెరిచేసరికి బాబా కనిపించలేదు. పక్కనున్నవారిని బాబా గురించి అడిగాడు. కాని వారెవరూ మేము అటువంటి మనిషిని చూడలేదని చెప్పారు. చిత్రంగా వుందే ఇది అనుకొంటూ బసకు వెళ్తున్నాడు. అంతలో బాబా తిరిగి కనిపించి ‘ఓయ్ బాలక్ నీవు ఏమన్నా వెర్రివాడివా, ఈ మాత్రం అర్థం చేసుకోలేవా? భక్తిపూర్వకంగా నమస్కారం చేస్తే చాలు కదా. నేను ఎక్కడైనా ఉంటాను కదా. నేను నీతో మాట్లాడాలంటే ఇక్కడకు రావాలా ఏమిటి? నేను ఎక్కడ లేను. ఇక బయల్దేరు. సందేహాలు వీడి భక్తిని పెంచుకో’ అని అన్నారు. మళ్లీ బాలక్‌రామ్ తిరిగి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు.
అంతా నా భ్రమ అనుకొంటూ బాలక్‌రామ్ శిరిడీ ప్రయాణం అయ్యాడు. శిరిడీ చేరగానే ముందు మహిల్సాపతిని కలుసుకొన్నాడు. బాబా మచ్చేంద్రగడ్‌కు వచ్చాడు కదా అని మహిల్సాపతి బాబా ఎక్కడికీ వెళ్లలేదు ఇక్కడే ఉన్నాడని అన్నాడు. ఈ విషయానే్న ఇద్దర్నిముగ్గురిని అడిగి తెలుసుకున్నాడు. వారు కూడా అదే చెప్పారు.
చివరకు మసీదు చేరుకున్నాడు.
మసీదులోకి రాగానే బాబా ‘ఏమయ్యా! నీ అనే్వషణ ఫలించిందా? నీవు అడిగినవారందరూ నా గురించి చెప్పేశారా!’ అన్నాడు.
బాబా అన్నాడు బాలక్‌రామ్
‘బాలక్‌రామ్ నేను ఈ ఒక్క దేహమే అనుకొంటే ఎలా, నేను ఈ దేహాన్ని కాదు కదా’ అన్నారు.
అంతే బాలక్‌రామ్‌లో విచక్షం బయలుదేరింది. అతడు బాబాబా కాళ్లమీద పడి ‘బాబా నేను అజ్ఞానంతో ప్రవర్తించాను. నన్ను క్షమించండి. మీరే నా భగవంతుడు’ అని అన్నాడు.
‘ఇక నేను ఎక్కడికీ వెళ్లను. నా దేహం చాలించేవరకు ఇక్కడే మీతోనే ఉంటాను. దానికి అనుమతి ఇవ్వండి’ అని అన్నాడు.
‘చాల్లే! ఇక ఆపు. చెప్పేది నీకు అర్థం అయితే గదా. నీవు ఎక్కడ ఉన్నా నీ మనసు నాపై ఉంటే నేను నీ దగ్గరే ఉన్నట్టే కదా’ అన్నారు.
***
మరోసారి
లక్ష్మీచంద్ అనునతడు శిరిడీకి వచ్చి బాబాను దర్శనం చేసుకొన్నాడు. అతడిని చూడగానే బాబా ఈ లక్ష్మీచంద్‌ను ఇంటికి తీసుకెళ్లి బాగా భోజనం అదీ పెట్టండి. చాలా ఆకలికొని ఉన్నాడు అని హేమాది పంత్‌కు చెప్పాడు. హేమాదిపంత్ బాబా చెప్పినట్లే చేశాడు. ఆ తరువాత మళ్లీ సాయంత్రం పూట బాబా దర్శనానికి హేమాదిపంత్‌తో కూడా లక్ష్మీచంద్ వచ్చాడు.
అతడు రాగానే బాబా దగ్గరికి పిలిచాడు.
‘ఇదిగో ఈ పది రూపాయలు తీసుకో!’ అన్నారు.
అతడు ఎంతో ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
‘ఎపుడూ కూడా తీర్థయాత్రలు, తీర్థక్షేత్రాలు చూడాలని అప్పులు చేసి రాకూడదు. డబ్బులు వుంటే ఎక్కడికైనా వెళ్లవచ్చు’ అని చెప్పారు.
అప్పుడు లక్ష్మీచంద్ ‘బాబా! నా తప్పు తెలిసింది. నేను ఇక ఎప్పుడూ అప్పులు చేయను’ అని చెప్పాడు.
అదేంటి మీరు ఎవరో ఎక్కడ్నుంచి వచ్చారో కూడా బాబాకు తెలియదు కదా. అక్కడ కూర్చున్నవారు మీరిద్దరి సంభాషణ మాకు అర్థం కావడంలేదు అన్నారు.
అతడు చిరునవ్వుతో ఇలా చెప్పాడు.
నేను నా మిత్రుడు ఈ శిరిడీ గురించి బాబా గురించి చెప్పాడు. అతడిని నాకు ఓ 10 రూపాయలు అప్పు ఇవ్వమని అడిగి తీసుకొని నేను ఈ బాబాను చూడడానికి వచ్చాను. అందుకే బాబా నన్ను అలా చేయవద్దని చెప్పారు. నాకు పది రూపాయలు ఇచ్చేసారు అని చెప్పాడు.
-ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743