భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-40

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కడున్నవారంతా మరొక్కసారి బాబా సర్వ వ్యాపకత్వాన్ని గురించి మాట్లాడుకోసాగారు.
వారికి తెలిసిన ఒక సంగతి ఇలా చెప్పుకుంటున్నారు.
ఒకసారి ఇలానే ఓ భజన బృందం ఇక్కడికివచ్చింది.
బృందంలో వారంతా నమస్కారాలు చేశారు. వారికందరికీ బాబా కానుకలు ఇచ్చారు. వారు మరలా మరలా నమస్కారాలు చేసి వెళ్లిపోయారు. కాని అందులో లక్ష్మీబాయి అన్న ఆమెకు మాత్రం బాబా ఏ కానుక ఇవ్వలేదు. కాని ఆమె ఎందుకో చాలా సంతోషంగా రోజులు వుండిపోయారు. మరుసటి రోజుగోవిందస్వామి వచ్చి పదే పదే సాయికి నమస్కారం చేస్తుంటే మేమంతా ఇలా ఎందుకు చేస్తున్నావని అడిగాము.
అప్పుడు అతడు మీకో విషయం చెప్తాను అని ఇలా చెప్పాడు.
నేను మామూలుగా బాబాకు నమస్కరించి కానుక తీసుకొని మా బసకు వెళ్లాను. రాత్రి మేమిద్దరం ఇక్కడే నిద్రపోయాము.
నిద్రలో నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో బాబా కనిపించారు. నేను సంకెళ్లతో ఉన్నాను. నా ఎదురుగుండా పోలీసులు వున్నారు. నేను భయంతో బాబా నన్ను రక్షించక చూస్తూ కూర్చున్నావేమి అని అడిగాను.
బాబా ‘నీకు నేను కానుక ఇచ్చేసాను కదా. ఇపుడు నేనే ఏమి చేయను. నీలో భక్తి లేదు. కానుక కోసం వచ్చావు. ఎవరు ఏది అడిగితే దాన్ని నేను ఇస్తాను’ అన్నారు.
నేను మరింతగా భయపడిపోయాను. అంతలో పోలీసులు నన్ను లాక్కెళ్ళేందుకు ముందుకు వస్తున్నారు.
నేను ‘బాబా! నన్ను నీవే రక్షించు నాకు నీవు తప్ప ఎవరూ లేరు’ అని అరిచాను. వెంటనే బాబా నన్ను సంకెళ్లనుంచి తప్పించారు. ఇక పోలీసులు ఎవరూ కనిపించలేదు. నేను ఏడుస్తూ బాబా పాదాలపై పడి నమస్కారం చేశాను.
ఆ తరువాత మెలుకువ వచ్చేసరికి తెల్లారిపోయింది. అందుకే కాలకృత్యాలు తీర్చుకుని ఇక్కడికి వచ్చాను. కాలజ్ఞానం ఉంది కదా. అందుకే నేను బాబాకు నమస్కారం చేస్తున్నాను.
అలా నమస్కారం చేస్తున్న గోవింద స్వామిని బాబా ‘ఏమీ గోవిందు! భయం పోయిందా! నమ్మకం కలిగిందా!’ అని అడిగారు.
అప్పుడు విషయం తెలియక మేమంతా ఏమి జరిగిందో అనుకొన్నాము.
అపుడు ఆ గోవిందుస్వామి ఇదంతా చెప్పారు అని వారిలో వారు బాబా సంగతులు చెప్పుకుంటున్నారు.
అంతలో అక్కడ కూర్చున్నవారిలో ఒకరు ఇలా చెప్పసాగారు.
నేను హిందువునే. కాని నేను ఎవరికీ తెలియకుండా ముస్లిం దేవుళ్లను కూడా పూజిస్తుండేవాడిని. నా గురువు సమర్థ రామదాసు. నేను ఎప్పుడూ ఆ సమర్థ రామదాసును దర్శనం చేసుకోవాలని అనుకొంటూ వుండేవాడిని. ఇంతకుముందు ఒకసారి నేను ఈ శిరిడీకి వచ్చాను.
అపుడు బాబాను దర్శనం చసుకొన్నాను. నాతో బాబా ముభావంగా ఉన్నారు.
ఆ రోజు అందరితో మాట్లాడే బాబా నాతో ఎందుకు మాట్లాడడంలేదు అని అనుకొంటూ శిరిడీలోనే రెండు రోజులు ఉన్నాను. రెండో రోజు మరలా బాబా దర్శనానికి వచ్చాను.
అపుడు బాబా ‘కాశీ! నీవు ఎవరికీ తెలియకుండా పంజా, తబూత్ ప్రతీకలను పూజిస్తావు కదా’ అని అడిగారు. నేను ఆశ్చర్యంతో అవును అన్నాను.
‘కాశీ! నీవు సమర్థ రామదాసును గురువుగా భావిస్తున్నావు. ఒకరిపై పూర్తి నమ్మకం ఉంచు. ఏ దేవుడైనా ఒక్కటే. భగవంతునికి కుల మతాలు లేవు. అందరినీ కాపాడేవాడు ఒక్కడే. ఈవిషయం నీవు ఎప్పుడు తెలుసుకొంటావు’ అని అడిగారు. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743