భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-41

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను నిరుత్తుణ్ణై ‘స్వామి మీరే నాకు నమ్మకం కలిగేలా చేయాలి. నా భారం అంతా నీపై మోపుతున్నాను’ అని అన్నాను.
వెంటనే బాబాను నేను చూసేసరికి నాకు నేను ఎల్లప్పుడు కోరుకునే నా గురువు మర్థ రామాసు దర్శనం ఇచ్చారు. నేను ఎంతో సంతోషంతో మా గురువుగరికి పాద నమస్కారం చేసి లేచి చూసేసిరికి మళ్లీ నాకు బాబా కనిపించారు. నాకు చాలా ఆశ్చర్యానందాలు కలిగాయి. నేను అన్నాను ‘బాబా మీ వయస్సెంత ఉంటుంది. మీరు వృద్ధులు కదా’ అన్నాను.
బాబా వెంటనే ‘ఏమిటీ నేను వృద్ధుణ్ణా! ఏదీ నాతో సమాన వేగంతో పరుగెత్తు చూస్తాను’ అని పరుగెత్తారు. నేను ఎంత పరిగెత్తినా అడుగు దూరంలో బాబా ఉన్నారు’ అప్పుడు నాకు బుద్ధి వచ్చింది. నేను, నన్ను క్షమించమని అడిగాను.
బాబా చిరునవ్వు దేనినైనా విశ్వాసం, నమ్మకంతో పనిచేయి అని ఆశీర్వదించారు. నాటినుంచి నేను నా గురువును ఈ బాబాలోనే చూసుకుంటూ కాలం గడుపుతున్నాను. నేను ఏ పని చేయాలన్నా మొదట ఈ బాబాకే నమస్కరిస్తాను అని చెప్పాడు.
వారంతా బాబాతో ఆయనకున్న అనుభవానికి అచ్చెరువు వొందినట్లు ఎంతో సంతోషంగా ఆ విషయానే్న వింటూ మళ్లా మళ్లా మననం చేసుకొంటూ ఉన్నారు.
***
దాసుగణు బాబాను చూడడానికివచ్చాడు. బాబాను చూచి నమస్కారం చేసి దూరంగా కూర్చున్నాడు. యధావిధిగా హేమాదిపంతు, మాధవ్‌రావు సింధియా, కాకా, తాత్యా లక్ష్మీబాయి ఇలా అందరూ బాబాను సేవించడానికి వచ్చారు. అందరూ నమస్కారం చేసి కూర్చున్నారు.
ఆ రోజు ఎందుకో బాబా చాలా ప్రశాతంగా ఉన్నట్టు కనిపించారు. కాని చాలా వౌనంగా కూర్చుని ఉన్నారు. అందరూ బాబానే చూస్తూ కూర్చున్నారు.
దాసుగణును ఏదైనా మంచి మాటలు చెప్పమని అందరూ అడిగారు. బాబా కూడా ‘దాసుగణు ఏదనా మంచి విషయాలు నలుగురికీ చెప్పు’ అన్నరు.
బాబా మాటే ఆజ్ఞగా భావించి దాసగణు ఇలా చెప్పడం ఆరంభించాడు.
అమృతము, విషము రెండూ కూడా సముద్రం నుంచి పుట్టాయి.
అమృతాన్ని అందరూ కలిసి పంచుకుని సేవించారు. విషాన్ని మాత్రం శివుడు కంఠాన నిలుపుకుని గరళకంఠుడుగా ప్రసిద్ధికెక్కాడు. అట్లాగే దుర్జన స్నేహమనేది కాల ప్రభావంవల్ల మన దరి చేరినా వారి మాటలను నేను కేవలం చెవి వరకు వచ్చినా కూడా దానిని మనసులోకి తీసుకోకూడదు అని ఈ సంగతి మనకు అంతర్లీనంగా చెప్తోంది. ఎంతోమంది ఎన్నో విషయాలు చెప్తుంటారు. అవి అన్నీ వినఅ దులో మంచివి మాత్రమే గ్రహించాలి వాటినే ఆచరించాలి. హంస నీళ్లను వేరు చేసి కేవలం పాలను మాత్రమే గ్రహించినట్లు మంచివారు చుట్టూ చెడు ఎంతున్నా అది వారిమీద పని చేయనివ్వకుండా చేస్తారు.
సజ్జనులు, దుర్జనులు చూడడానికి ఒకే విధంగా కనిపిస్తారు. కాని వారు చేసే చేష్టలవల్ల వారిని సులభంగా గుర్తించవచ్చు. సజ్జనులు ఎప్పుడూ నలుగురిలో ఒకరిగా కలిసిపోయి అందరి మంచి కోసం పనిచేస్తుంటారు. దుర్జనులు తమ ప్రాభవాన్ని గుర్తించాలని ఎంతమందిలో ఉన్నా వేరేగానే కనిపిస్తుంటారు అని అనగా మాధవరావు సింధియా ‘‘నిజమే కాని మంచివారిని గుర్తించడమెలానో తెలియదు. వారు మనతో బాగున్నట్టుగానే ఉంటుంటారు. చివరకు ఎప్పుడో వారి దుష్టస్వభావం కనపడుతుంది. అంతలో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఏ విధంగా వారిని కనుక్కోవాలో తెలియడం కష్టం’’ అని అన్నాడు.
‘‘సద్గురువును ఆశ్రయించి ఉంటే చాలు మనపై దుర్జన ప్రభావం ఏ విధంగా పడదు. నీళ్లు బురదతో కలిసి ప్రవహించినా కాసేపు కదలకుండా ఉంటే ఏ విధంగా బురద అడుగుకు చేరి నీరు తేటగా కనిపిస్తాయో అదేవిధంగా దుర్జనులు మనతో కలిసి ఉన్నా సరే మనం సద్గురువు స్మరణ చేస్తుంటాము కనుక వారికి వారే వేరయిపోతుంటారు’’ అన్నాడు హేమాదిపంతు. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743