భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-42

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజమే సద్గురువు మనలను నీడగా వెన్నంటి ఉంటారు. సద్గురువు దర్శనం సకల దేవతా దర్శనాన్ని కలుగజేస్తుంది అన్నాడు దాసుగణు.
***
పొద్దునే్న బాబా పూల మొక్కలకు నీళ్లు పోసి లోపలికి వచ్చారు. అపుడే హేమాదిపంతు పూజ పూర్తిచేసుకొని బాబా దగ్గరకు వచ్చారు.
‘‘హేమా నీవీరోజు ఏ పుస్తకాన్నైనా పఠించి వచ్చావా?’’ అని బాబా అన్నారు.
‘‘అవును బాబా! నేనిప్పుడే భాగవతంలో శ్రీకృష్ణుని లీలలను చదివి వస్తున్నాను’’.
‘‘ఓహో ఇప్పుడు ఇక నీవు శ్రీకృష్ణలీలలను చూపిస్తావా?’’ అన్నారు బాబా.
అంతలో మసీదులోకి ఓ భార్యాభర్తలు వచ్చారు.
ఆమె వస్తూనే బాబా ‘‘ఎన్నో ఏళ్లనుంచి నిన్ను చూద్దామని అనుకుంటూ కాలం గడుపుతున్నాను. కాని ఈ రోజుటికి నాపై దయ కలిగిందా బాబా’’ అంటూ పాద నమస్కారం చేసింది.
ఆయన అలానే నిలబడి కన్నీళ్లు కారుస్తూ చూస్తున్నాడు. మాటా పలుకు లేదు. అందరూ అతడిని చూస్తూనే ఉన్నారు.
‘‘ఏ గంగరామ్! ఎంతసేపు అలా చూస్తావు. నీవు చూస్తున్నది నిజమే. చూడు నీవు ఎప్పుడు ఎక్కడ తలచుకుంటే అక్కడికి రాముడు రాడా?’’ అన్నారు.
హేమాదిపంతుతోపాటు కూర్చుని ఉన్న అందరూ బాబా వంక, కన్నీరు కారుస్తూ నిల్చున్న ఆయన వంకా చూస్తున్నారు. వారికేమీ అర్థం కావడంలేదు.
‘‘అమ్మా! మీవారిని కూర్చోమని చెప్పు. సర్దుకుంటాడు’’
‘‘హేమా నీవు కేవలం శ్రీకృష్ణలీలలను చదివితే సరిపోతుందా! కాస్త వాటి గురించి మాకు చెప్పవచ్చు కదా!’’ అన్నారు.
హేమాదిపంతు బాబా వంక చూసాడు.
‘‘నినే్న హేమా! నీవు శ్రీకృష్ణుడు జాంబవంతుని దగ్గరకు వెళ్లడం. జాంబవంతునితో పోరు చేయడం చదివి వచ్చావు కదా! దానే్న కాస్త నాకు వివరంగా చెప్పు’’ అన్నారు.
‘‘బాబా నేను చెప్పనా’’ అప్పుడే అక్కడికి వచ్చిన శ్యామా!
‘‘పోనీ ఆ పని చేయి’’ అన్నాడు బాబా.
మనకు వినాయకచవితి కథలో కూడా చెప్తారు కదా ఇది. ప్రసేనుని తమ్ముడు వేటకు వెళ్లి ఇంటికి తిరిగి రాకపోతే శ్రీకృష్ణుడే ఆయన దగ్గర ఉన్న శమంతకమణి కోసం చంపేసి ఉంటాడని ప్రసేనుడు అనుకున్నాడు.
ఆయన నమ్మడం కాక అందరికీ అదే నిజమని చెప్పేవాడు.
ఈ సంగతి శ్రీకృష్ణుడు తెలుసుకున్నాడు. వెంటనే తన పరివారంతో ప్రసేనుని తమ్ముని వెదకడానికి వెళ్లాడు. అప్పుడు వారికి సింహం అడుగుల జాడలు, ఎలుగుబంటి జాడలు కనిపించాయి. వాటిని చూస్తూ ముందుకు వెళ్తుంటే అక్కడ ఒక గుహ కనిపిస్తుంది.
ఆ గుహలోకి శ్రీకృష్ణుడు వెళ్తాడు. అక్కడ ఓ అమ్మాయి శమంతకమణిని పట్టుకుని బంతిలాగా ఆడుకుంటూ ఉంటుంది.
-ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743