భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-43

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ అమ్మాయి చేతిలోంచి శ్రీకృష్ణుడు మణిని తీసుకుందామని వెళితే కొత్తగా కనిపించే శ్రీకృష్ణుని చూసి ఆ అమ్మాయి పెద్దగా కేకలు వేస్తుంది. ఆ అరుపులు విని లోపలినుంచి తన కూతురికి ఆపద కలిగిందేమోననుకొంటూ జాంబవంతుడు పరుగెత్తుకు వస్తాడు. అక్కడ శ్రీకృష్ణుడిని చూసి ఆయనపైకి ముష్టియుద్ధానికి జాంబవంతుడు వస్తాడు.
అలా వారిద్దరి మధ్య చాలా రోజులు ద్వంద్వయుద్ధం జరుగుతుంది. చివరికి జాంబవంతునికి ఒళ్లంతా హూనమవుతుంది. నీరసించిపోతాడు. అప్పుడు నన్ను కొట్టే వీరుడు ఎవరా అని శ్రీకృష్ణుని తేరిపార చూస్తాడు. అప్పుడు జాంబవంతునికి శ్రీరాముడు కనిపిస్తాడు.
జాంబవంతుడు కన్నీళ్లు కారుస్తూ శ్రీరామా! నీవు నాకోసం వచ్చావా? నేను అజ్ఞానంతో నీతో ద్వంద్వ యుద్ధం చేయాలని ఉంది అంటే నీ కోరిక కృష్ణుడినై తీరుస్తాను అని వరం ఇచ్చిన నీవే నిజంగా నాకోసం వచ్చావా? వచ్చిన నీవెవరో నేను తెలుసుకోకుండా చేసి నాతో ద్వంద్వ యుద్ధం చేస్తావా? ఇప్పుడు నేను బాగా డస్సిపోయాక నీవెవరినో నాకు తెలియజేస్తావా? రామా! శ్రీరామా! అంటూ జాంబవంతుడు శ్రీకృష్ణుడిని పట్టుకుంటుంటే శ్రీకృష్ణుడు కూడా జాంబవంతుని శరీరాన్ని అంతా తడుముతూ- ‘‘జాంబవంతా! నీ కోరిక తీర్చడం నా పని కదా! అందుకే వచ్చాను. ఇప్పుడు నీకు సంతోషమే కదా’’ అన్నాడు.
‘‘స్వామి నీ రాకతో నీ దర్శనంతో నీ స్పర్శతో నా శరీరం కూడా చైతన్యవంతం అయ్యాయి. నీ స్పర్శవల్ల నీ ముష్టిఘాతాలకు హూనమయిన నా శరీరం స్వస్థత చెందింది. నా మనస్సు సంతోషంతో ఉరకలు వేస్తోంది’ అన్నాడు.
‘‘సరే కానీ నాకు ఆ మణినివ్వు. నాపై నిందారోపణలు చేసిన వారికి నేను ఇది చూపించాలి’’ అని శ్రీకృష్ణుడు జాంబవంతుణ్ణి అడిగాడు.
‘‘శ్రీరామా! నీవు నాకొకసారి రామునిగాను, మరొకసారి ఈ గోపాలునిగాని కనిపిస్తున్నావు’’ జాంబవంతుడు అన్నాడు- అని శ్యామా చెబుతూనే ఉన్నాడు.
అంతలో-
‘‘చూసావా! అంతా చూపులోనే ఉంది. ఈ గంగారామ్ కూడా! అయోధ్యకు వెళ్లి రాముడిని చూడాలనుకున్నాడు. ఆ రాముడినే ఇక్కడ మ్రాన్పడి చూస్తున్నాడు. అయ్యా! గంగారామ్‌జీ తమరు స్వస్థులయ్యినట్టేనా’’ అని చిరునవ్వుతో అన్నాడు బాబా.
‘‘బాబా నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను. నీవే నాకు శ్రీరామునివి. నేను ఈ మసీదులోకి అడుగుపెట్టంగానే నా రాముడే నాకు కనిపించాడు. రాముడే నన్ను రమ్మని పిలిచాడు. అలా సశరీరంతో శ్రీరాముడు కనిపించగానే నేను మాట రాని వాడినయ్యాను’’ అన్నాడు గంగారామ్.
‘‘పోనీలే. ఇన్నాళ్లకు నీ కోరిక తీరింది’’ అన్నాడు బాబా.
వారిద్దరి మాటలు వినడంతో అక్కడున్న అందరికీ విస్మయం కలిగింది. ఈ గంగారామ్‌ను మనమెప్పుడూ చూడలేదు. కాని ఈ బాబా అంతా తెలిసినట్టు వారితో మాట్లాడుతున్నాడు.-ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743