భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-44

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారు కూడా బాబాతో చిరపరిచితుల్లాగా మాట్లాడుతున్నారు. అని వారిలో వారు అనుకుంటున్నారు.
‘‘అయ్యా! మీరందరూ వింతగా అనుకోకండి. మేము బాబా భక్తులమే. మేము బొంబాయి దగ్గర ఉన్న ఊర్లో ఉంటాము. మా ఇంటికి ఒక రోజు ఓ సాధువు భిక్షకు వచ్చారు. ఆయన మాకు సాయిబాబా ఫొటో ఇచ్చారు. ఆయన్ను పూజించమని మాకు చెప్పారు. నేను ఆ రోజుటినుంచి బాబాను పూజిస్తుంటాను. నాకు ఏమి కావాలన్నా బాబా ఫొటో ముందు నిల్చుని బాబాకు చెప్తాను. నాకు కావాల్సినవన్నీ నాకు అందుతాయి.
కొన్నాళ్లక్రితం నేను నాకు నీ దర్శనం కావాలి అని అడిగాను.
నాలుగు రోజుల క్రితం మావారు వచ్చి మనం అయోధ్య వెళ్దాం అన్నారు. మావారు ఏది చెపితే అదే చేస్తుంటారు. ఆయన మాటకు ఎదురు చెప్పే సాహసం ఎవరికీ ఉండదు. అందుకే నేను బాబా గురించి ఏమీ అడగలేదు. బాబానే నాకు దర్శనం కలిగిస్తారులే అన్న నమ్మకంతో ఉండిపోయాను.
రెండు రోజుల క్రితం మావారు మళ్లీ మనం శిరిడీ వెళ్దాం. అక్కడ ఓ సాధువు ఉన్నారట. ఆయనకు సర్వం తెలుసు అంటున్నారు. నాకు ఈమధ్య వ్యాపారంలో చిక్కులు వస్తున్నాయి. ఒకటి దూరం చేస్తే మరొకటి వస్తోంది. దీన్ని పోగొట్టమని ఆ సాధువును అడిగితే చిక్కులు దూరమవుతాయని మా స్నేహితులు చెబుతున్నారు. ఓసారి అక్కడికి వెళ్దాం అన్నారు.
నా మనసులో నేను ఎంతో సంతోషించాను. ఇదిగో ఇలా బాబా దర్శనం కోసం వచ్చాము. కాని, మేము శిరిడీకి వచ్చేదారిలో కొంతమంది బాబా అంటే ముస్లిం అని చెప్పారు. దాంతో మావారు అప్పటినుంచి ఏదో ఆలోచిస్తున్నారు.
నేను అంతా బాబానే చూసుకుంటాను అన్న నమ్మకంతో ఇదిగో ఇలా వచ్చాను. కాని మావారు ఈ మసీదులోకి రాగానే.. అయినా మీరు చూస్తూనే ఉన్నారు కదా. అదండీ సంగతి. కనుక మాకు ఈ బాబాను ముందునుంచే తెలుసు అంది ఆమె.
అందరూ ఆశ్చర్యంగా ఆనందంగా బాబా వంక చూశారు.
అంతలో
నిజమే. అందరూ సాధువు అన్నారు. ముస్లిము అన్నారు. అవన్నీ విని నేను ఇక్కడకు రావడం మంచిది కదా అని ఆలోచిస్తూ వచ్చాను. కాని నేను ఈ మసీదులో లోలికి చూడగానే నాకు శ్రీరాముడు నవ్వుతూ కనిపించాడు. పైగా రెండు చేతులు చాపి రమ్మని పిలిచాడు. నాకు నోటినుంచి మాట కాని పాదాలు అడుగులు వేయడం కాని లేదు. నేను పరుగెత్తుకు వచ్చి శ్రీరాముడి పాదాలపై పడాలని అనుకుంటున్నాను. కాని నా కాళ్లు పనిచేయలేదు. శ్రీరామా! అని గట్టిగా అరుస్తున్నాను. కాని అది బయటకు వచ్చినట్టు లేదు అన్నాడు గంగారామ్.
బాగు బాగు. ఒక్కోసారి అంతే మనం ఎదురుచూడనిది చూస్తే అలాగే జరుగుతుంది. మరేం పర్లేదు. ఇంతకీ నీకు రాముడు కనిపించి సంతోషం ఇచ్చాడు కదా! అని మళ్లీ అడిగాడు బాబా.
‘‘బాబా! నన్ను క్షమించు. నాకు నీవే శ్రీరాముడివని తెలియక అలా అనుకున్నాను.
నాకు నీపై స్థిరమైన బుద్ధి కలిగేటట్లు చేయి’’ అన్నాడు గంగారామ్..
‘‘అంతా పైవాని దయ! అల్లా అచ్చాకరేగా’’ అన్నారు బాబా.
అందరూ నమసార్కం చేశారు.
బాబా మధ్యాహ్నం భిక్షకు బయలుదేరారు.
***
-ఇంకా ఉంది
*
రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

- జంగం శ్రీనివాసులు 837 489 4743