భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-45

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాధవరావు సింధియా ఇద్దరు రాముడు, భీముడు అనే ఇద్దరిని తీసుకుని వచ్చాడు.
బాబాను వారు చూడగానే నమస్కరించారు.
బాబా వెంటనే రాముణ్ణి నాకు పదిహేను రూపాయలు కావాలని అడిగాడు. అతడు ఇచ్చాడు. మళ్లీ నాకు ఇంకో రెండు రూపాయలు ఇవ్వాలి ఇవ్వు అన్నారు. అతడు మళ్లీ రెండు రూపాయలు జేబులోంచి తీసి ఇచ్చాడు.
అక్కడే ఉన్న భీముడు పది రూపాయలు నోటు తీసి బాబాకు ఇవ్వబోయాడు. కాని బాబా తీసుకోలేదు. పైగా నాకు నీ సొమ్ము ఎందుకు బాబు. నీవు ఇల్లు కట్టుకున్నావు. కాని నాకు డబ్బు ఇస్తానని చెప్పలేదు కదా. మరి ఇప్పుడు నేనెందుకు తీసుకుంటాను.
‘మరి ఇప్పుడు ఇతని దగ్గర తీసుకున్నారు కదా బాబా మీరు’ అన్నాడు భీముడు.
‘‘నీకు తెలియదు బాబు! కొంతమంది చిన్న ఉద్యోగం వస్తే 15 రూపాయలు ఇస్తామని చెప్పి మొక్కుకుంటారు. ఉద్యోగం రాగానే మరిచిపోతారు. మళ్లీ ఉద్యోగంలో ఏదైనా చిక్కులు వచ్చి ఉద్యోగం ఉంటుందా, ఉండదా అన్న పరిస్థితులు వస్తే ఇవి ఎందుకు వచ్చాయో తెలుసుకోలేక తిరిగి ఈ ఉద్యోగంలో ప్రమోషన్ వస్తే మొదటి జీతాన్ని నీకు ఇస్తాము అంటూ మళ్లీ మొక్కుకుంటారు. 15 నుంచి 50 రూపాయలు ఆ యాభై నుంచి కూడా ఏడు వందల యాభై రూపాయల జీతం అందుకుంటూ ఉన్నా సరే మొక్కు తీర్చాలన్న జ్ఞానం కొందరికి ఉండదు. అటువంటివారిని నేను ఊరుకోను. వారి దగ్గర ఎలాగైనా వసూలు చేస్తాను’’ అన్నాడు బాబా.
వారికేమీ అర్థంకాక వౌనంగా ఉండిపోయారు.
మాధవరావు సింధియా బాబా వీరిద్దరినీ మా ఇంట్లో భోజనం చేసి వెళ్లమని చెప్పాను. వీరిద్దరిని తీసుకుని ఇంటికి వెళ్లడానికి అనుమతినివ్వు అని అడిగారు.
అలానే వెళ్లు. కాని వారికి కాస్తంత విశ్రాంతిని కూడా కల్పించు, పాపం అలసిపోయి వచ్చారుకదా! అన్నారు. సరే అని చెప్పి వారు ముగ్గురు వెళ్లిపోయారు.
మాధవరావు ఇంట్లో రాముడు, భీముడు భోం చేశారు.
కూర్చుని ఉన్న రాముడు ‘‘బాబాయి! నాకు ఎందుకో విపరీతమైన నిద్ర వస్తోంది. నేను కాసేపు పడుకోవచ్చా?’’ అని అడిగాడు.
‘‘దానిదేముంది. ఇందాకే బాబా కూడా అదే చెప్పారు కదా. అలసిపోయి ఉన్నారు. కాసేపు వారికి విశ్రాంతి ఏర్పాటు చూడు. బహుశా ఇందుకే అయి ఉంటుంది. ఇదిగో ఈ గదిలో మీరిద్దరూ పడుకోండి. నేను అలా బజారుకు వెళ్లి వస్తాను. సాయంత్రం మీరు ఊరికిపోవచ్చు’’ అని వారికి పడుకోవడానికి ఏర్పాటుచేసి మాధవరావు బయటకు వెళ్లాడు.
మాధవరావు సాయంత్రం ఇంటికివచ్చి వాళ్ల అమ్మాయి ‘‘నాన్నా! మనింటికి వచ్చినవాళ్లు ఎంతో హడావుడిగా బాబా దగ్గరకు వెళ్లారు. వెళ్తూ మీరు వస్తే మేము బాబా దగ్గరకు వెళ్లామని చెప్పమన్నారు’’ అని చెప్పింది.
పొద్దున చూసి వచ్చారు కదా, పైగా హడావుడిదేనికి అనుకుంటూనే ‘సరే అమ్మా! నేను అలా బాబా దగ్గరకు వెళ్లివస్తాను’ అని మాధవరావు మసీదుకు వెళ్లాడు.
‘‘బాబా నన్ను క్షమించు! నాకు అసలు గుర్తులేదు. నిజంగా ఆ రోజు కూడా నాకు కనిపించింది నీవే కదా!’’ అంటున్నాడు రాముడు.
దాదా మాధవా! నీ స్నేహితుడు మేల్కొన్నాడు అన్నాడు బాబా.
బాబా ఎవరితో ఏమీ మాట్లాడకుండా ఆయన పూల మొక్కలలోకి వెళ్లారు.
అపుడే వచ్చిన మాధవరావుతో రాముడు..
‘‘బాబాయి నేను మీ ఇంట్లో పడుకున్నానుకదా. అపుడు నాకు ఒక కల వచ్చింది. నేను చాలా కాలం క్రితం ఒక పల్లెటూరులో పనిచేసేవాడివి. అప్పుడు నేను భగవంతుడికి 15 రూపాయలు వేస్తానని మొక్కుకున్నాను. అసలు ఇందాక బాబా చెప్పిందంతా చేసింది నేను. ఇదంతా నేను మరిచిపోయాను. ఇప్పుడు కలలో నాకు కనిపించింది. ఆ ఊర్లో కూడా నాకు బాబానే దర్శనం ఇచ్చారు’’ అన్నాడు.-ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743