భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-46

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీముడు నేను కూడా ఇల్లు కట్టుకున్నాను. అప్పుడు నాతో అందరూ ఏ దేవునికైనా కాస్త డబ్బులు వేసి దణ్ణం పెట్టుకో అని సలహా ఇచ్చారు. నేను వారితో ఇల్లు నేను కష్టపడి కట్టుకుంటున్నాను, పైగా అప్పు తీసుకుని. ఆ అప్పు తీర్చాలి. ఒకవేళ అప్పు తీరిస్తే అప్పుడు దేవుని డబ్బు గురించి ఆలోచిస్తాను. ఇపుడు నేను ఇవ్వను. కావాలంటే గుడికి వెళ్లి వస్తాను అని వారితో చెప్పాను.
ఈ విషయం కూడా బాబా ఇందాక చెప్పాడుకదా! అపుడు నాకు ఏమీ అనిపించలేదు కాని మీ ఇంట్లో పడుకున్నపుడు గుర్తుకు వచ్చింది. నేను బాబా సర్వాంతర్యామి. ఆయనకు ఎక్కడ ఎవరేమి చేసినా తెలుస్తుంది అని అనుకున్నాను. ఇపుడు ఈ రాముడు చెప్పేది నిజమే అనిపిస్తుంది. మేమిద్దరం ఒకే చోట పనిచేస్తుంటాము. రాముడు బాబా దగ్గరకు వెళ్తా అని నాతో చెప్పాడు. నేను గుడికి వెళ్లాలని అనుకున్నాను కదా. గుడి అయితే ఏముంది. శిరిడీ అయితే ఏముంది. ఎక్కడైనా దేవుని దర్శనమే కదా అనుకుని నేను వస్తానని ఇక్కడకు వచ్చాను అని భీముడు చెప్పాడు.
అంతలో బాబా వచ్చాడు. సరి సరి మీకంతా మంచి అనుభవాలు కలిగాయని ఒక్కటే ముచ్చట్లాడుతారా, దీపాలకు వేళ అయింది కదా ఏమన్నా దీపాలు పెట్టే ఉద్దేశం ఉందా? అని అడిగారు.
వెంటనే అందరూ బాబా చెప్పినట్లు ప్రమిదల్లో వత్తులు వేస్తారు. నూనె పోశారు. బాబా ఒక్కో దీపం వెలిగిస్తూ ఉంటే అందరూ వెళ్లి వాటిని మసీదు బయట లోపల అలంకరించారు.
‘చూశారా! ఎంత బాగుందో! దీపావళి పండుగలాగ ఉంది కదా! దీపమే మనకు జ్ఞానాన్ని ఇస్తుంది. పొద్దున సాయంత్రం ఇండ్లలో దీపాలు పెట్టండి. తులసి కోట దగ్గర, బిల్వవృక్షం దగ్గర దీపం పెట్టండి అని చెప్పాడు బాబా. అందరూ తలలూ ఊపి సాయంత్రం హారతికి ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
****
క్రమం తప్పకుండా నిమోన్కర్ ఎప్పుడు సాయి సేవ చేస్తుండేవాడు. ఒక రోజు ఆయనకు పొరుగూరికి వెళ్లవలసి వచ్చింది. ఏమి చేయాలా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు నిమోన్కర్?
ఆలోచిస్తూ కూర్చున్న నిమోన్కర్ దగ్గరకు సీతామాయి వచ్చింది.
తన భర్త ఆలోచించడం చూసింది. భర్తను ఏ విషయం ఆలోచిస్తున్నారని అడిగింది. ఆయన నేను పొరుగూరికి ఆఫీసు పనిమీద వెళ్లాలి. కాని నేను రోజు పొద్దునే్న బాబా పూల మొక్కలకు నీళ్లుపోయడానికి నీళ్లు నేను తెచ్చి ఇస్తుంటాను. ఇపుడు నేను వెళ్తే ఎవరు నీళ్లు తెచ్చి ఇస్తారా అని ఆలోచిస్తున్నాను అని అన్నాడు.
అందులో ఎందుకంత ఆలోచించడం- మన సోమనాథుడు ఉన్నాడు కదా, వాడిని ఇవ్వమంటే సరిపోతుంది కదా అంది ఆమె.
తమ కొడుకు సోమనాథుడిని పిలిచి నిమోన్కర్ విషయం చెప్పాడు.
ఆ నేను మారుతి భక్తుడిని. నేను బాబాకు నీళ్లు తెచ్చిస్తే ఎలా నేను మారుతి ఆలయానికి వెళ్లాలి అన్నాడు సోమనాథుడు.
మారుతి ఆలయం నుంచి వచ్చాక నీళ్లుతెచ్చి బాబాకు ఇస్తావా అని తల్లిదండ్రులు అడిగితే సోమనాథుడు చేస్తానని అన్నాడు.
ఈ విషయం చెప్దామని సోమనాథుడిని తీసుకుని నిమోన్కర్ మసీదుకు వెళ్లాడు. లోపల బాబా కూర్చుని ఉన్నాడు.
సోమనాథుడు లోపలకు వస్తూనే మారుతీ స్వామి నిజంగా నాకు కనిపిస్తున్నావా. నాతో మాట్లాడుతావా ఆంజనేయా, ప్రసన్నాంజనేయా భగవన్ మారుతీ! అని అరుస్తూ లోపలికి వచ్చి అమాంతంగా బాబా కాళ్లపై పడి నమస్కరిస్తున్నాడు.
నిమోన్కర్‌కు ఏమీ అర్థం కాలేదు.
బాబా చిరునవ్వుతో చూసి సోమనాథా! రేపట్నుంచి నీవు నాతో పూల మొక్కలకు నీళ్లు పోయడానికి వస్తావా? అన్నారు.
స్వామి ఆంజనేయా తప్పకుండా వస్తాను అని చేతులు జోడించారు. వెంటనే ‘‘బాబా! నీవు.. నీవు మా..’’ ఏదో చెప్పబోయాడు సోమనాథుడు.
‘‘సరే! నీకు నేను మారుతిగా కనిపించాను అంతేకదా! నీ మారుతినే నేను నీ కిష్టమైన పేర్లతో పిలువు పలుకుతాను’’.
-ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743