భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-52

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏమీ చేయలేక ఆత్మారాముడు కూడా తన పని తాను చూసుకుంటూ ఉండిపోయాడు.
ఒకసారి ఎప్పటిలాగే ఆత్మారాముడు బాబా దర్శనానికి వచ్చాడు. దర్శనం తరువాత ‘ఏమయ్యా ఆత్మారామా! నీవెందుకు అంత బాధపడుతుంటావు. ఎప్పుడు ఏది జరగాలో దానిని భగవంతుడు ముందే రాసి పెట్టి ఉంటాడు. అంతా మంచి జరుగుతుందిలే. నీవే ఏమీ దిగులు పెట్టుకోకు. నీ భార్యకు బుద్ధి వచ్చే రోజులు దగ్గరకు వచ్చాయిలే అన్నాడు. తాను ఏమీ చెప్పకుండా బాబా ఇలా మాట్లాడడం ఆత్మారామునికి ఆశ్చర్యం ఆనందం కలిగాయి. అతడు నమస్కారం చేసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. బాబా చిరునవ్వు నవ్వాడు. బాబా చేత్తో ఊది తీసుకున్నాడు. దాన్ని ఆత్మారాముడు పెట్టుకున్నాడు. మిగతావి కాగితంలో పొట్లం కట్టుకుని జేబులో పెట్టుకున్నాడు.
ఇంటికి వచ్చేసరికి వారి భార్య వైపు చుట్టాలు వచ్చారు. వారికి ఏదో పని ఉండి వచ్చామని, ఎలాగూ వచ్చాం కదా నిన్ను చూసిపోదామని వచ్చినట్లు చెప్పారు. వారితో కాసేపు మాట్లాడాడు వారు వెళ్లిపోయేటప్పుడు తన జేబులోని ఊది ప్రసాదం వారికి ఇచ్చి ఇది నా భార్యకు ఇవ్వండి అని ఆత్మారాముడు చెప్పాడు. వారు సరేనన్నారు.
అప్పటికి పది పదిహేను ఏళ్ళు దూరంగా వున్న ఆత్మారాముని భార్య ఆ ఊది పెట్టుకోగానే నేను నా భర్త దగ్గరకు వెళ్తాను అని ఆమె తల్లిదండ్రులతో చెప్పి తన ఇంటికి వచ్చేసింది. ఆమెను చూచి ఆత్మారాముడు బాబా మాటలను తలచుకుని మనసులో బాబాకు నమస్కరించాడు. ఆమె కూడా తాను ఇంతకాలం తెలివితక్కువగా ప్రవర్తించానని ఇపుడు తాను కలసిమెలసి ఉంటానని మాటల్లో తన భర్తతో చెప్పింది. అంతకంటే కావాల్సింది ఏముంది అని ఆత్మారాముడు కూడా అన్నాడు. అలా వారిద్దరూ కలిసి మెలిసి కాపురం చేసుకుంటూ బాబాను పూజించేవారు.
తన భక్తులు ఎక్కడ ఉన్నా వారి యోగక్షేమాలను బాబానే చూసుకునేవారు. తన దగ్గరకు రప్పించుకోవాలన్నా ఆయనే రప్పించుకుంటానని మహిల్సాపతి లాంటివారికి చెబుతూ ఉండేవాడు. ఒకసారి ఇలాంటి సంఘటనే జరిగింది.
శిరిడీ సమీపంలో కోర్హెలా అనే గ్రామం ఉంది. అక్కడ పిలాజీ అనే బాబా భక్తుడు ఉండేవాడు. చిన్నా చితకా పనులు చేసుకుంటూ జీవనాన్ని గడుపుతుండేవాడు. ఆయన భార్య కూడా భర్తకు తగిన ఇల్లాలే. ఇద్దరూ బాబా భక్తులు. ఒకరోజు రాత్రి పిలాజీ భార్య కలలో బాబా కనిపించి ఆమెకు తీపి మిఠాయి ఇచ్చారు. ఆమె కలలో బాబా నా కొడుకుకు ఏదైనా ఒక గుడ్డ ఇవ్వచ్చు కదా అని అడిగింది. సరేలే ఆ సంగతి చూస్తాను, ఇపుడు ఈ అర్థరూపాయి తీసుకో. దీనిని మీ గల్లాపెట్టెలో పెట్టుకోండి, మీకు కలిసి వస్తుంది అని చెప్పాడు. అలా బాబా చెప్పిన వెంటనే ఆమెకు మెలుకువ వచ్చి చూసుకుంది. చేతిలో నిజంగానే అర్థరూపాయి ఉంది. ఇది తన కలా నిజంగా బాబా వచ్చాడా అని అనుకుంటూ జరిగిన సంగతి తన భర్తకు చెప్పింది. ఆయన కూడా ఇప్పుడే నా కలలో కూడా బాబా కనిపించారు. నన్ను నీవు శిరిడీకి వచ్చి అక్కడ స్థిరపడు. నీ జీవితం హాయిగా సాగుతుంది అని చెప్పారు.
నీకు ఇలా కల వచ్చింది. ఇక ఇప్పుడు మనకు మంచి రోజులు వచ్చినట్లు ఉన్నాయి. కనుక మనం త్వరలో శిరిడీకి వెళ్లిపోదాం అనుకున్నారు. వారు అనుకున్నట్లుగానే కొద్ది రోజుల్లో వారిద్దరూ శిరిడీ వచ్చి అక్కడే స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. బాబా దర్శనానికి వచ్చిన ఆ దంపతులను చూసి బాబా సరే మీరు చెప్పినట్లుగా చేస్తున్నారు కదా. మీ బాధ్యత నాదే ఇక నుంచి అని చెప్పారు. బాబా నీడలో వారి జీవనం సంతోషంగా గడిచిపోతుంది.
బాబా చేసే పనులు సామాన్యులకు అర్థంగాక గాబరా పడుతుండేవారు. కాని బాబా ఆజ్ఞలతో ఆ పనులన్నీ సజావుగా సాగిపోతూ ఉండేవి.
ఒకసారి శిరిడీలో కలరా వ్యాధి సోకింది. చాలామంది కలరా బారిన పడ్డారు. వారంతా వచ్చి బాబా దగ్గర ఊది ప్రసాదం తీసుకుని వెళ్ళేవారు. వారికి ఆ వ్యాధి తగ్గుముఖం పట్టేది. అట్లానే ఒకసారి హరిబాపు ఫనే్స అనునతడు కలరా సోకిన వారి బంధువులకు బాబా ఊది ఇచ్చాడు. వారికి ఆ వ్యాధి తగ్గుముఖం పట్టింది. అప్పటినుంచి హరిబాపు ఫనే్సను ఊదిని ఇవ్వమని అందరూ అడిగేవారు. ఇలా కొంతకాలం అతడు అందరికీ ప్రసాదం ఇచ్చేవాడు. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743