భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-57

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె కాస్త శాంతించింది. నీకో కథ చెప్తాను విను.
కృష్ణుడు యశోదమ్మ దగ్గర పెరిగే సమయంలో అందరి ఇండ్లలో పాలు పెరుగు తాను తింటూ తన స్నేహితులకు పెట్టేవాడని నీవు విన్నావు కదా. ఆయన స్నేహితులకే కాదమ్మా కోతులకు కుక్కలకు కూడా పెట్టేవాడు. అలా పెట్టడం అంటే ప్రతి ప్రాణిలో నా అంశ ఉందని చెప్పక చెబుతున్నట్లే కదా.
అట్లానే మన్ను తింటున్నాడని యశోదమ్మకు బలరాముడు కృష్ణునిమీద ఫిర్యాదు ఇచ్చాడు కదా. అపుడు ఆ గోపబాలుడు ఆ యమ్మ యశోదమ్మకు తన నోరు తెరిచి చూపాడు.
ఆ నోటిలో 14 భువనభాండాలు కనిపించాయి. అందులోనే యశోద కూడా వుంది. కోతులూ ఉన్నాయి. కృష్ణుని స్నేహితులూ ఉన్నారు. అంతేకాదు బ్రహ్మ విష్ణు మహేశ్వరులూ వారి లోకాలు కూడా ఆ యశోదమ్మకు కనిపించాయి.
అపుడు ఆమె ఆ ఇదేంటి ఇతడు నా కొడుకు అనుకోవడమెంత మూర్ఖత్వం. అసలు సిసలైన పరమాత్మనే ఈ బాలుని రూపంలో వచ్చాడు. సర్వం విష్ణుమయం అన్న సంగతి నాకు తెలియడానికే ఈ లీలను నాకు అనుగ్రహించాడు. స్వామి శరణమయ్యా శరణం. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణమం మమ. స్వామి ఇన్నాళ్లు నా కుమారుడివని ఎన్నో మాటలు అన్నాను. నా చనుబాలను నీకిచ్చాను. స్వామి నీవు సాక్షాత్తు పరుమాత్మ స్వరూపానివే అంటూ విష్ణుశక్తిని కీర్తిస్తూ కూర్చుంది.
కొద్దిసేపు తర్వాత కృష్ణుడు యశోదమ్మను తాకుతూ అమ్మా.. అమ్మా.. నిజం అమ్మా నేను అసలు మన్ను తినలేదు. నీవు పెట్టే వెనె్నముద్దలే నాకు చాలా ఇష్టం అన్నాడు. అంతే అప్పటిదాకా ఈ పరమేశ్వరుడు తప్ప అన్యమేదీ ఇక్కడ లేదనుకునే ఆ ఇల్లాలు విష్ణుమాయా ప్రభావితురాలు అయ్యింది. అమ్మా ఆ చిన్నవానికి నేను అమ్మను అనుకుంది. ఆ పిల్లవాడు తప్పులు చేస్తున్నాడు. వానిని మందలించాలని తలచింది. అతడిని పట్టుకుని మీరు శ్రీకృష్ణుల వారు కారట. ఎవరి ఇండ్లకు పోరట.. ఎవరి వెన్న మీగడలు తినరట.. అంటూ కృష్ణుడినే పట్టుకుని కట్టివేసి బుద్ధి చెప్పాలని చూసింది.
ఇదంతా నీకు తెలిసిన కథే గదా అమ్మా. అట్లాగే అందరిలో వున్న నన్ను నీవు గుర్తించకుంటే ఎలా వీలు అవుతుంది. ఆ కుక్క కడుపునిండినా, ఆ బిచ్చపు అమ్మ ఆకలి తీరినా ఆ పరమేశ్వరుడు ఆనందిస్తాడు.
కనుక నీవు నీ దగ్గర ఉన్నవాళ్లకు నీకు చేతనైనంత ఆకలి తీర్చు అమ్మా అదే పదివేలు అని చెప్పారు.
అలా బాబా బోధనలు విన్న జనం అంతా సర్వాంతర్యామి బాబా, అసలు పరమేశ్వరుడే మనకోసం దిగి వచ్చిన బాబా రూపంలో నిల్చున్నారని తలచారు. అందరూ చేతులెత్తి మొక్కారు.
వారినందరినీ చూచి అంతా ఆ పరమేశ్వరుని దయ! సబ్ కా అల్లా మాలిక్ హై అన్నారు.
అప్పటిదాకా బాబా బోధనలు విని అందరూ ఒకటే అనుకున్నవారు బాబా చేసే మహిమలను తలచుకుంటూ సాక్షాత్తు నారాయణ స్వరూపమని కొందరు, కాదు కాదు శివ స్వరూపమే బాబా అని కొందరు, కానేకాదు అల్లాయే ఈ రూపంలో వచ్చాడని కొందరు- ఇలా ఎవరికి తోచిన అభిప్రాయాన్ని అందరూ అనుకుంటూ బాబా లీలలను వారి జీవితానుభవాలను చెప్పుకుంటున్నారు.
***
బాబాకు నమస్కారం చేసి ఎవరు ఏమి కోరినా అది జరిగిపోతుంది అని నమ్మకం సాయి భక్తుల్లో ఏర్పడింది. బాబా అప్పుడప్పుడు మంచి వాక్యాలు చెపుతూ ఉండేవారు. అట్లా ఒకనాడు త్యాగగుణం గూర్చి చెప్పారు. రంతిదేవుడు, అంబరీషుడు శిబి చక్రవర్తి వీరంతా కూడా త్యాగుణాన్ని ప్రోది చేసుకున్నవారే. మనం కష్టపడి సంపాదించినదానిలోనుంచి ఎంతో కొంత భగవంతుని పేరు తెచ్చుకుని లేనివారకి సాయం చేస్తే భగవంతుడు మరో రూపంలో మనకు సాయం చేస్తాడని అందరికీ అర్థం అయ్యేవిధంగా చెప్పేవాడు.
సాయిబాబా కొందరిని దక్షిణ అడిగి తీసుకునేవాడు. మరికొందరు వారంతట వారు ఇచ్చినా వద్దులే అనేవారు. మరికొందరు ఇస్తే తీసుకునేవారు. కొందరిని అడిగి మరీ తీసుకునేవారు.
ఈ దక్షిణ విషయంలోను బాబా ముందు అనేక తమాషా సంఘటనలు జరుగుతూ వుండేవి.
ఓసారి నూల్కర్ అనునతను బాబాను దర్శనం చేసుకోవాలనుకున్నాడు. అతడు శిరిడీ వచ్చాడు. బాబా మహాత్ముడు కదా. నేను దర్శనం చేసుకుని ఇరవై రూపాయలు దక్షిణ కూడా ఇస్తాను. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743