భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-59

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరేలే అదిగో అక్కడ నీ పెట్టెలోనుంచి తీసిన జీతం బట్టలు అన్నీ అక్కడే ఉన్నాయి, తీసుకుని వెళ్లు. ఇందాక తీసుకుని వచ్చాను అన్నాడు బాబా.
అక్కడే కూర్చుని ఉన్న మహిల్సాపతి బాబా మీరు పొద్దున్ననుంచి ఇక్కడే ఉన్నారు కదా మీరెప్పుడు వెళ్ళారు అన్నాడు.
వెంటనే శ్యామా బాబా ఏమన్నా మా ఇంటికి రావాలా? దీన్ని తీసుకోవడానికి? మనసున స్మరించుకుంటే మనుషులే వచ్చి వాలుతున్నారు కదా. ఇదంతా నాకు బుద్ధి తెప్పించడానికి చేశారులే అని తాను దాచిన 2 రూపాయలు బాబాకు ఇచ్చివేశాడు. తరువాత తన జీతాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. అట్లా బాబా కొన్ని పనులు చేసేవారు. అవి సామాన్యులకు అర్థం అయ్యేవి కావు.
మరోసారి తన దగ్గరకు వచ్చిన వారినంతా దక్షిణ అడిగి అడిగి తీసుకుంటూ ఉన్నాడు. అక్కడే కూర్చున్న కొలంబే అనువాడు కూడా బాబాకు నమస్కరించాడు. బాబా అతనిని డబ్బు అడగలేదు. బాబా మసీదు నుంచి బయటకు వెళ్ళాడు. అంతలో కొలంబే అను వాడు చూశారా మిమ్మల్నంతా దక్షిణ అడిగారు. బాబా నన్ను మాత్రం అడగలేదు. పైగా నా దగ్గర పది రూపాయలు ఉన్నాయి. కాని నేను బాబా చెప్పినట్లే మందు తాగడం మానేసాను కదా. దానికి నన్ను మెచ్చుకుని దక్షిణ అడగలేదు. ఇట్లా నేను ఎంత గొప్పవాడిని. సంకల్ప శక్తి నాలో ఎంత ఉందో బాబాకే అర్థం అయింది అని చెబుతూనే ఉన్నాడు. అంతలో బాబా వెనుతిరిగి వచ్చి, ఆ.. కొలంబే ఇలారా.. నీ జేబులో ఉన్న పది రూపాయలు ఇలా ఇవ్వు అని అడిగారు.
కొలంబే విస్తుపోయి తన దగ్గర ఉన్న పది రూపాయలు తీసి బాబాకు ఇచ్చాడు. ఎవరికైనా అహంకారం ఉండకూడదు బాబూ, ఎప్పుడు నేర్చుకుంటావు అంటూ ఆ పది రూపాయలు తీసి ఓ వృద్ధురాలికి ఇచ్చాడు.
తన తప్పు తెలుసుకున్న కొలంబే చెంపలు వేసుకున్నాడు. ఇంకెప్పుడూ ఇలా చేయను అని అనుకున్నాడు.
ఇలా ఎన్నో సంగతులు బాబా సమక్షంలో జరుగుతూ వుండేవి.
దాసుగణు ఒకసారి శిరిడీ వెళుతుంటే కోపర్గామ్‌లో ఒక స్టేషన్ మాస్టరు మాట్లాడుతూ బాబా గురించి దాసుగణు చెపుతున్నపుడు- అందరూ ఫకీర్లు మంచి వారుండరు. ఎవరినీ అసలు నమ్మకూడదు అని అన్నాడు.
దాసుగణు ఎవరి గురించి నాకు తెలియదు కాని శిరిడీలోని సాయిబాబా గురించి మాత్రం అలా మాట్లాడకు. కావాలంటే నీవే వచ్చి స్వయంగా చూడు అని అన్నాడు.
సరే చూద్దామని అతడు కూడా శిరిడీ వచ్చాడు. వారిద్దరూ మసీదుకు వచ్చేసరికి అక్కడ బాబా పచ్చి కుండలను బోర్లిస్తున్నాడు. దాసుగణు పలకరిస్తూ బాబా ఎందుకు కుండలను బోర్లిస్తున్నావు అని అడిగాడు.
ఏం చేయను దాసు నా దగ్గరకు వచ్చేవన్నీ ఖాళీ కుండలే. కేవలం ఖాళీ కుండలైతే నింపచ్చు. లేదు జిజ్ఞాసతోను తెలియనితనంతోను వస్తే కూడా ఏదో ఒకటి చేయవచ్చు. కాని అహంకారంతోను అజ్ఞానంతోనో వస్తే నేను ఎంతని చెప్పేది అన్నారు. దాంతో అక్కడే నిల్చున్న స్టేషను మాస్టారు మనసులో చైతన్యం కలిగింది. వెంటనే అతడు బాబా మీరు చెప్పేది నా గురించే. నిజంగా నాకు ఇంతవరకు అజ్ఞానమే వుండేది. కాని ఇపుడు మీ దగగ్గరకు వచ్చాక నా మనసెంతో హాయిగా ఉంది. ఏదో తెలియని సంతోషం వేస్తోంది అని అన్నాడు.
సరే అయితే ఇకనుంచి అయినా తెలియకపోతే తెలుసుకో కాని అన్నీ తెలిసినట్టు మాట్లాడకు అని అన్నాడు బాబా.
***
బాబాకు కేవలం మనుష్యుల గురించి అక్కడ వున్నవారి గురించో కాదు సర్వమానవాళి గురించి వారు ఎక్కడున్నా సరే వారందరి గురించి కూడా బాబాకు తెలిసిపోతూనే ఉండేది. ఒకసారి బాబా బాగా కడుపునొప్పిగా ఉందని తలకిందులు అవుతున్నారు. అక్కడే ఉన్న భక్తులంతా ఇదేమిటి డాక్టర్ల దగ్గరకు తీసుకుని వెళ్దామా అని ఆలోచిస్తున్నారు. అప్పుడే అక్కడికి మహిల్సాపతి వచ్చాడు.
ఆయన అక్కడ జరిగేదంతా చూస్తున్నాడు.
బాబా కడుపునొప్పి బాధపడుతున్నట్లు చూసాడు. చిన్న చిరునవ్వు వచ్చింది మహిల్సాపతికి.
బాబా అతనిని చూశాడు. బాబా పెదవులపైన చిరునవ్వు వచ్చింది. దాన్ని ఎవరూ గమనించలేదు. అందరూ ఎక్కడికి తీసుకుని వెళ్ళాలా చర్చిస్తున్నారు. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743