భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-62

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏమీ ఫర్వాలేదు అంతా సవ్యంగా జరిగిపోతుంది అని ఆ మిత్రుడన్నాడు.
***
మరోసారి సాయిబాబాకు ఎక్కడినుంచో ఓ భక్తుడు మామిడిపండ్లు తెచ్చి ఇచ్చాడు. వాటిని అందరికీ పంచుతూ అందులోంచి నాలుగు పండ్లను దాచిపెట్టారు. ఎందుకు బాబా నాలుగు పండ్లు దాచావు అని హేమాదిపంత్ అడిగాడు.
ఏమీ లేదు. దామోదర్ రాస్నే వస్తాడు కదా. వానికి ఇద్దామని అన్నాడు మళ్లీ హేమాదిపంతు.
దామోదర్ ఇపుడు కోపర్గాంలో ఉన్నాడు. ఇపుడు వస్తాడు అని అన్నాడు. కొద్దిసేపట్లో దామోదర్ రానే వచ్చాడు.
బాబా అతనిని చూస్తూ ఇదిగో నీకోసమే ఇవి. ఇవి నీవు తీసుకో ఇవి నీ రెండవ భార్యకు ఇవ్వు. నీకు ఇద్దరు కొడుకులు పుడ్తారు. వారికి నీవు దౌలత్ షా అని, రెండవ వానికి తానీషా అని పేర్లు పెట్టుకో. అంతా బాగుంటుంది అన్నాడు. అతడు మహాప్రసాదం అని మామిడిపండ్లు తీసుకుని వెళ్లి తన భార్యకు ఇచ్చాడు.
బాబా అన్నట్లుగానే కొన్ని రోజులకు దామోదర్ రాస్నే పిల్లల తండ్రి అయ్యాడు. బాబా సూచించిన పేర్లే తన కొడుకులకు పెట్టుకున్నాడు. బాబా స్వప్న దర్శనం ఇవ్వడం అంటే వారిని బాబా తన భక్తులుగా అనుకున్నట్టే అని భక్తులంతా అనుకునేవారు.
మరో రోజు బాలక్‌రామ్ శిరిడీకి వచ్చాడు. వచ్చి చాలాసేపు గడిచింది. మసీదులో కూర్చుని ఎన్నో విషయాలు మాట్లాడారు. బాబా ఇక నేను వస్తాను అని లేచాడు బాలక్‌రామ్.
అది ఎలా వెళ్తావు. నా కోసం తెచ్చిన పాలకోవ ఇవ్వకుండానే వెళ్లిపోతావా ఏమిటి? ఎన్నో సంగతులు చెప్పావు కాని నా పాలకోవ మాత్రం చెప్పలేదు. ఇప్పుడేమో వెళ్తానంటున్నావు అంటూ బాబా చిన్నపిల్లవానిలాగా నా కోవా నాకు కావాలి, నాకు ఇచ్చేయి అన్నారు.
అప్పుడు బాలక్‌రామ్ అయ్యో మరిచిపోయాను. నిజమే మా శ్రీమతి బాబాకివ్వమని పాలకోవా ఇచ్చింది. నేను మరిచిపోయాను. అంతేకాదు బాబా అది ఒక్కటే ఉంది అన్నాడు.
అయితే ఏంటి, నాకు పంపింది నాకు ఇవ్వకపోతే ఎలా అంటూ బాలక్‌రామ్ చేతిలోంచి పాలకోవా తీసుకుని నోట్లో వేసుకుంటూ ఆహా ఎంత రుచిగా ఉందో అన్నాడు.
ఇలా బాబా ఏం చెప్పినా అది జరుగుతూ ఉండేది. కొందరు బాబా చెప్పినట్లే విని ఏ కష్టాలు రాకుండా ఉండేవారు. మరికొందరు బాబాను నమ్మకుండా వారికిష్టమైన పనులు చేసేవారు. కష్టాలు కొ ని తెచ్చుకునేవారు. ఆ తరువాత బాబా దగ్గరకు వచ్చి మమ్ము క్షమించండి అని కోరుకునేవారు.
ఇట్లానే ఒకసారి బొంబాయి నుంచి ఇద్దరు మిత్రులు వచ్చారు. వారు వెళ్లిపోయేటపుడు బాబా వారిని అన్నం తిని వెళ్లండి అని చెప్పాడు. అందులో ఒకరు లేదు లేదు ట్రైన్ వచ్చే సమయం అయిపోతుంది. మనం వెళ్దాం అన్నాడు. నేను బాబా చెప్పినట్లే అన్నం తిని వస్తాను. ఏం కాదు అని ఆ ఇద్దరిలో ఒకరు వడివడిగా స్టేషను చేరారు. ట్రైను టైము అయింది. కాని రైలు రాలేదు. అంతలో తన మిత్రుడు అన్నం తిని స్టేషనుకు వచ్చాడు. అందాకా ట్రైను రానేలేదు. అపుడు చూశావా బాబా చెప్పినట్లు అన్నం తిని వచ్చి ఉంటే సరిపోయేది కదా అనుకున్నారు.
అవును నిజమే నాకు చాలా ఆకలిగా ఉంది అన్నాడు.
అంతలో అక్కడికి ఒక అమ్మాయి వచ్చి బాబా నా కోసం ఈ రొట్టెలు తెచ్చుకున్నాను. కానీ నేను తినగా కూడా ఇవి మిగులుతాయి. కనుక మీరు ఈ రొట్టెలు తీసుకోండి అని చెప్పింది.
అదిగో బాబా నీ కోసం నీ ఆకలి చూసి పంపించి ఉంటారు తీసుకో అన్నాడు.
బాబాకు ఎలా తెలుస్తుంది అని ఆ మిత్రుడు అనగానే-
ఆ అమ్మాయి, బాబూ ఒక విషయం- ఇందాక ఇక్కడికి బాబానే వచ్చారు. అదిగో ఆ కనిపించే ఆయనకు ఈ రొట్టెలు ఇవ్వు. కాని నేను ఇచ్చానని చెప్పకు. నీ కోసం తెచ్చుకున్నవి ఎక్కువగా అయితే ఇస్తున్నానని చెప్పు అని చెప్పారు.
అలా ఎందుకు బాబా అని అడిగాను. నేను ఇస్తానంటే ఆయన తీసుకోడు అమ్మా. ఈ ట్రైను ఇంకా రెండు గంటలు లేటుగా వస్తుంది. అందుకే ఈ రొట్టెలు ఆయనకు ఇవ్వు అని చెప్పారు. అందుకే నేను ఇలా చెప్పాను అని చెప్పింది.
తమ తప్పు తెలుసుకున్న మిత్రులిద్దరూ పరిగెత్తి బాబా కోసం బయటకు వెళ్లారు. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743