భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-63

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాని అక్కడ వారికి బాబా కనిపించలేదు.
అంతలో స్టేషను వారు ట్రైను రెండు గంటలు ఆలస్యంగా వస్తుందని చెప్పారు.
బాబాకు ఉన్న దయామృతాన్ని వారు తలుచుకున్నారు.
బాబాను స్మరిస్తూ ఆయన రొట్టెలు తిన్నాడు.
అలా బాబా దగ్గరకు వచ్చిన వారికి వారు కోరకుండానే వారికేమి కావాలో బాబానే చూసుకునేవారు.
బాబాను నమ్మినవారికి ఇక కొదువ ఏముంటుంది?
సకల దేవతా స్వరూపుడు సాయిబాబా అంటూ మహిల్సాపతి చెపుతున్నాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా నదులన్నీ ఏ విధంగా సముద్రంలోకి కలుస్తాయో అట్లానే ఎవరు ఏ దేవతను కొలిచినా సేవించినా కూడా అవి అన్నీ శ్రీకృష్ణపరమాత్మకే చెందుతాయి. అట్లానే త్రిమూర్తులకన్నా శక్తిస్వరూపుడు ఈ సాయి నివాసుడు కనుక మనం ఇంతకుముందు ఏ దేవుణ్ణి కొలిచినా సేవించినా కూడా ఇప్పుడు ఈ భగవంతుడిని నమ్మి కొలిస్తే చాలు, ఆ దేవుళ్ళకి నమస్కరించినట్లే. దేవుళ్ళని పూజించినట్లు అవుతుంది అన్నాడు మహిల్సాపతి.
అంతలో ఒక అతను మసీదులోకి వచ్చాడు. ఆ సమయంలో సాయి మసీదులో లేరు. వచ్చినతను ‘అయ్యా! శిరిడీ సాయినాథుడు ఉండే చోటు ఇదే కదా. నేను అతనిని కలుసుకోవాలి’’ అన్నారు.
మహిల్సాపతి ‘ఇదే ఆ చోటు, ఇక్కడే సాయి ఉంటారు. ప్రస్తుతం బయటకు వెళ్లి ఉన్నారు. ఇప్పుడే వస్తారు, కూర్చోండి. మీరు ఎక్కడనుంచి వస్తున్నారో’’ అన్నాడు.
నేను ఇక్కడ దగ్గరలో వుండే నాసిక్‌లో ఉంటానరు. నాకు చాలా ఉబ్బస వ్యాధి ఉంది. దానిని నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పాడు. చెప్పేటప్పుడు ఎంతో ఊపిరి పీల్చుకోవడం కోసం నానా కష్టాలు పడుతున్నాడనిపిస్తోంది.
అంతలో సాయి వచ్చారు. వస్తూనే ‘‘ఓ హంసరాజ్ వచ్చావా? ఇక్కడికిరా అని పిలిచారు. చాలామంది కూర్చుని వున్న ఆ మసీదులో హంసరాజు అని ఎవరిని పిలుస్తున్నారో అనుకుంటున్నారు.
అంతలో అక్కడ కూర్చున్న వ్యక్తి లేచి సాయినాథా! మీకు నా పేరు.. అంటూ దగ్గరకు వచ్చారు. అంతే ఉన్నట్టుండి దగ్గరకు వచ్చినతన్ని సాయిబాబా రెండు చెంపదెబ్బలు వేశారు. అతడికి కన్నీళ్ళు ధారాపాతంగా కారసాగాయి. అతడు అమాంతంగా కాళ్ళమీద పడి సాయి అని పదే పదే కలవరించసాగారు.
అక్కడున్న అందరూ అక్కడ జరుగుతున్నది ఏమిటో, సాయి ఎందుకు కొట్టారో, అతడు ఎందుకు ఏడుస్తూ కూడా కాళ్ళమీద ఎందుకు పడ్డాడో అర్థం కాకుండా ఎక్కడివాళ్ళు అక్కడ నిలబడిపోయారు.
‘‘లే, నీకు కావాల్సింది ఇదే కదా! దీనికోసం అక్కడ్నుంచి ఇక్కడికి వచ్చావు. మరి ఇప్పుడు ఎందుకింత ఏడుస్తున్నావు?’’ అంటూ సాయి ఆ హంసరాజును లేపి ఆలింగనం చేసుకున్నాడు.
‘‘బాబా నీ అంత దయాళువు ఎవరు ఉంటారు. నీవే నా నరసింగ్ మహారాజువు నీవే’ అన్నాడు.
బాబా ‘‘ఓ మహిల్సాపతీ, ఇతను నాసిక్ నుంచి ప్రయాసపడి ఇంతదూరం వచ్చాడు. నీవు ఇతనిని తీసుకుని వెళ్లి కాస్త చాయి తాగించి ఏదైనా తినడానికి పెట్టు. తీసుకుని వెళ్లు’’ అన్నాడు. మహిల్సాపతి అలానే బాబా అంటూ ఆ హంసరాజును తీసుకుని వెళ్లాడు.
దారిలో హంసరాజు తన గురించి ఇలా చెప్పాడు.
అయ్యా నేను నాసిక్‌లో నివాసముంటాను. నాకు చాలా రోజుల నుంచి ఉబ్బసం ఉంది. ఈమధ్య నేను నా గురుదేవులు నరసింగ్ మహారాజును కలవాలని అనుకున్నాను. కాని ఒకతను నీవు శిరిడీ వెళ్లి బాబాను కలువు. ఈ వ్యాధి నయమవుతుంది. అంతేకాదు నీవు సంతానవంతుడివి అవుతావు అని చెప్పాడు. పైగా నీవు బాబా దగ్గరకు వెళ్ళంగానే రెండు చెంప దెబ్బలు కొట్టమని అడుగు. ఆ దెబ్బలతో నీలోని వ్యాధి అనే భూతం పారిపోతుంది అని కూడా అన్నాడు. నేను ఇక్కడకు వచ్చాను కాని ఆ దెబ్బల గురించి నేను అడగనే లేదు. నన్ను చూసిన వెంటనే కొట్టాడు. కొట్టిన క్షణంనుంచి నాకు ఉబ్బసం లేదు. అందుకే నేను అంతా ఆనందాశ్చర్యాలకు గురి అయ్యాను అని చెప్పాడు.
మహిల్సాపతి మీరు చెప్పేదంతా నిజమే. నేను ఎన్నో మహిమలు సాయి దగ్గర చూసాను. ఒకసారి ఒక కొత్తగా పెళ్లి అయిన అమ్మాయి వాళ్ళ అత్తగారింట్లో అత్తవల్ల నానా బాధలు పడేది. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743