భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-65

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవి తీసుకుని ఇదిగో ఈ మూడు రూపాయలు నీవే తీసుకుని ఇంతకుముందే నీవు ఇచ్చావులే. అయినా నీకు ఏదీ గుర్తుండదు. ఒకనాడు మీ దగ్గరకు వచ్చి బాగా ఆకలి వేస్తుంది, ఏదైనా ఉంటే ఇవ్వమని అడిగాను కదా. అపుడు నీ దగ్గర ఈ ఐదు రూపాయలు ఉన్నాయి. కాని నీకు ఇవ్వబుద్ధి కాలేదు. మూడు రూపాయలు చాల్లే అన్నావు. అందుకే ఇప్పుడు అడుగుతున్నాను అన్నారు.
అతడు జరిగిన విషయాలను గుర్తుతెచ్చుకుంటూ, అంటే ఆ రోజు వౌల్వీ సాహబ్‌గా నా దగ్గరకు వచ్చింది నీవు నా బాబా అని అడుగుతూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఎందుకయ్యా ఆ కన్నీళ్ళు. నీవు దాసుగణు చెప్పితే కదా ఇక్కడకు వచ్చావు. అంతకుముందే నేను నాకు ఐదు రూపాయలు కావాలని అడిగాను కదా అన్నాడు బాబా.
మరింత ఆశ్చర్యానికి లోనై అవును నిజమే. ఇదంతా నాకు గుర్తుకు వస్తోంది. అయితే ఇక నేను పిల్లలు గల్లవాణ్ణి అంటారందరూ. నా కోరిక తీరుతుంది అనుకుంటూ సంతోషంతో అక్కడ్నుంచి షావుకారు వెళ్లిపోయాడు.
బాబా కోరుకున్న వారికి కోరుకున్నట్లుగా ఎన్నో లీలలను చూపించారు.
మరోసారి ఇలాంటి విచిత్రమే జరిగింది.
అక్కల్‌కోట మహారాజుగారు సమాధి చెందారు. ఆయన భక్తుడు కృష్ణజీ అనునతడు అప్పుడప్పుడు అక్కల్ కోటకు వచ్చి సమాధిని దర్శించాడు. అక్కడే నిద్రించాలని ఆ రోజు పడుకున్నారు. ఆయన కలలోకి అక్కల్ కోట మహారాజు కనిపించారు. నీవు నాకోసం విలపించవద్దు. నేను ఇప్పుడు శిరిడీలో ఉన్నాను. నీవు అక్కడికిరా, నేను నీతో మాట్లాడుతాను అని చెప్పారు.
కలనుంచి మేల్కొని ఇదేంటి ఇలా చెప్పారు. నేనిప్పుడు శిరిడీకి వెళ్లాలా? ఎక్కడని వెతకను అని ఆలోచిస్తూ ఉన్నాడు. అంతలో అక్కడికి దాసుగణు వచ్చాడు. కృష్ణజీ అంటే మీరేనా? అని అడిగారు.
కృష్ణజీ ఆశ్చర్యపోతూ అవును నా రు కృష్ణజీనే. మీరు ఎవరో నాకు గుర్తుకురావడంలేదు అన్నాడు.
నేను అసలు మీకు తెలీదు. నేనే శిరిడీలో ఉంటాను. నాకు రాత్రి సాయిబాబా కలలో కనిపించి అక్కల్‌కోటకు వెళ్లు, అక్కడ కృష్ణజీ అను భక్తుడు ఉంటాడు. అతడు శిరిడీ రావాలని అనుకుంటున్నాడు. అతడిని నీవు వెంట వుండి తీసుకురా అని చెప్పారు. అందుకే ఇక్కడకు వచ్చాను. నా మనసు మీరే కృష్ణజీ అని చెప్పింది. అందుకు ఇక్కడకు వచ్చాను అని అన్నాడు.
అరే ఇదేంటి నా కలలో నా ప్రభువు మహారాజ్ కనిపించి నీవు శిరిడీకి వెళ్లు. అక్కడ నేను ఉన్నాను అని చెప్పారు. నేను ఎలా వెళ్లాలని అనుకుంటూ ఉంటే మీరు ఇక్కడకు వచ్చారు అని చెప్పి వారిద్దరూ కలిసి శిరిడకి వెళ్లి అక్కడ స్వామిని దర్శించుకున్నారు.
కృష్ణాజీ బాబా నాకు నీవు అక్కల్ కోట మహారాజులాగే అనిపిస్తున్నారు అని మరోసారి నమస్కారం చేశాడు. భక్తులు కోరిన విధంగా కనిపించడమే కదా నేను చేయాల్సింది. అందులో ఏముంది. నీకు సంతోషమే కదా అని అడిగారు. మీరు నాతో ఎల్లప్పుడూ ఇలా మాట్లాడుతూనే ఉండాలి బాబా అని కృష్ణాజీ కోరుకున్నారు. బాబా చిరునవ్వు ఆయనకు సమాధానం అయింది.
ఇలా బాబాను ఎక్కడెక్కడి వారో వచ్చి దర్శనం చేసుకుంటూ ఉండేవారు.
మరోసారి నాగపూర్‌లో ఉండే బూటి అను ధనవంతుడు, సాయి భక్తుడు శిరిడీ వచ్చాడు బాబా దగ్గర వారం రోజులు అక్కడే ఉన్నాడు. అతని దగ్గరకు నాసిక్‌లో ఉండే శాస్ర్తీ అను నతడు వచ్చాడు. అతడు జ్యోతిష్యం చదివాడు. హస్తసాముద్రికా శాస్త్రం కూడా నేర్చుకున్నాడు. అందుకని అందరి చేతులు పరిశీలించాలని అనుకునేవాడు.
ఒకసారి బూటీతోపాటు బాబా దగ్గరకు శాస్ర్తీ వచ్చాడు. అతడు రాగానే బాబా అపుడు తాను పండ్ల వ్యాపారి దగ్గర కొన్న పండ్లను అందరికీ పంచుతూ ఈ శాస్ర్తీకి నాలుగు పండ్లను ఇచ్చాడు. శాస్ర్తీ ఆ పండ్లను తీసుకుంటూనే బాబా నేను మీ చేయి చూడవచ్చా? అని అడిగాడు. నీకు నాలుగు పండ్లు ఇచ్చాను కదా. ఇంకా నా చేయి నీవేమి చూస్తావు. ముందు ఆ పండ్లు ఎందుకిచ్చి ఉంటనో దాని గురించి ఆలోచించు అన్నారు. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 8374894743