భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-66

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాస్ర్తీకి ఏమీ అర్థం కాలేదు. బూటీ ఇదంతా చూస్తూ ‘శాస్ర్తీగారు, బాబా పురుషార్థాలను ప్రసాదించే భగవంతుని స్వరూపులమని నీకు చెపుతున్నారు. దీని ర్థం అంతే ఉంటుంది’ అని చెప్పాడు.
బాబా దాన్ని విని చిరునవ్వు నవ్వాడు. అంతలో బాబా బూటీ నాకు కాషాయ వస్త్రాలు కట్టాలని ఉంది. నీవు తెప్పిస్తావా అని అడిగాడు.
బూటీ సంతోషంతో ఎందుకు తెప్పించను స్వామీ, తెప్పిస్తాను అంటూ తానే స్వయంగా వెళ్లి కాషాయ వస్త్రాలు తెచ్చి ఇచ్చాడు.
దాంతో శాస్ర్తీకి తనలో వున్న కుల అహంకారం నశించింది. విద్యాగర్వం కూడా తగ్గింది. బాబా నేను ఇంతవరకు తప్పుగా ఆలోచించేవాడిని. నీవే నన్ను రక్షించు. నాలో నా కులమే గొప్పదన్న అహంకారం నాకు తెలియకుండానే ఉంది. అంతేకాక మీరంతా ఏమీ చదువుకోలేదని అనుకునేవాణ్ణి. అందువల్లనే నాలో విద్యా అహంకారం కూడా పెరిగింది. దానివల్ల నేను తప్పు చేశాను. నీవలే నాలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టావు. సద్గురువు ఏ రూపంలో ఉన్నా తెలుసుకోగలిగినవారే శిష్యులు. నాలాగే ఒక గురువును తూలనాడి మరో గురువు గొప్ప అనుకునేవాడు మూర్ఖుడు. నాలో ఎప్పుడూ అహంకారం పొటమరించకుండా నీవే నన్ను కాపాడు బాబా అని నమస్కారం చేశాడు శాస్ర్తీ.
బాబా చిరునవ్వు నవ్వి మనుష్యులందరూ సామాన్యులే కదా. వారి సహజ గుణాలు ఉంటూ ఉంటాయి. వాటిని అదుపులో పెట్టుకుని సత్వగుణాన్ని పెంచుకుంటూ పోతే భగవంతుడు అందరిలో ఉన్నాడన్న నమ్మకాన్ని పెంచుకుంటే ఇక అహంకారం కాని మమకారం కాని కలుగదు అన్నారు.
అందరూ బాబా చెపిప్నదాన్ని విని ఎంతో ఆనందిసల్తూ పండరినాథుని భజన చేశారు. అట్లానే మరోసారి ఓ భక్తుడు సాయి దగ్గరకు వచ్చాడు. బాబా నీమ్‌గావ్ వెళ్ళే దారిలోనే ఆ భక్తుడు కనిపించి బాబాకు నమస్కరించాడు. బాబా వెంటనే నీవు ఇక్కడికి దగ్గరలోనే దాదాకేల్కర్ ఇల్లు ఉంది. ఆయన దగ్గరకు వెళ్లి కాసేపు ఆయన ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకున్న తరువాత నీవు కేల్కరఓ ఇటు రండి అని చెప్పి పంపించారు.
కొద్దిసేపటికి దాదాకేల్కర్‌తోపాటు కొత్తగా వచ్చిన పండిట్ వచ్చారు. వస్త వస్తూ పూలు అగరొత్తులు, చందనం తెచ్చారు. కేల్కర్ యధావిధిగా బాబాను పూజించాడు. అంతలో కొత్తగా వచ్చి తన ఇంటికి వచ్చిన పండిట్ కేల్కర్ చేతిలోని పళ్ళెంలో ఉన్న చందనం తీసుకుని బాబా నొసట పెట్టాడు. కాళ్లమీద పడి నమస్కరించాడు. కేల్కర్ ఆశ్చర్యంగా చూశాడు పండిట్ కన్నీళ్ళతో బాబానే చూస్తూ ఉన్నాడు. కేల్కర్ ‘‘బాబా నీవు ఎప్పుడూ చందనం నేను తెచ్చినా నీవు పెట్టించుకోవు గదా, మరి ఈ పండిట్ పెడితే ఊరుకున్నావేమి?’’ అని అడిగారు.
బాబా చిరునవ్వుతో ఈ పండిట్ నాకు ఈ చందనపు బొట్టు పెట్టలేదు. ధోపేశ్వర్‌లో కాకా మహారాజ్ అనే మహానుభావుడు ఉన్నాడు. ఆయన్ను నాలో చూస్తూ ఆయనకు పెట్టాననుకుంటూ నాకే పెట్టాడు. దానికి నేను ఏం చేయగలను కేల్కర్ అవి బాబా కట్టుకోకుండా నీ దగ్గరే అట్టే పెట్టు అని చెప్పారు.
అంతలో శాస్ర్తీ బసకు వెళ్లి అక్కడ స్నానం సంధ్యలు చేసుకుంటూ ఉన్నారు. అక్కడికి కాకా వచ్చాడు.
అయ్యా మీ దగ్గర నుంచి రెండు రూపాయలు తీసుకోమని బాబా చెప్పారు, ఇస్తారా అని అడిగాడు.
ఇదేంటి నన్ను డబ్బులు అడగడం? నేను జ్యోతిష్యం తెలిసిన బ్రాహ్మణుడిని. వేదవిద్యను కూడా నేర్చుకున్నాను. ఇన్ని విద్యలు వచ్చిన నన్ను సత్కరించడం మానేసి నా దగ్గర దక్షిణ అడగడమూ అందులోనూ ఒక అన్య మతానికి చెందిన వారు ఫకీరు అని నేను ఇవ్వను. కాసేపు ఆగితే ఎట్లాను బూటీ కోసం రావాలి కదా, నేను వచ్చి మీ బాబాతో మాట్లాడుతానులే, నీవు వెళ్లు’ అని చెప్పాడు.
ఎప్పటిలాగా బూటీ వచ్చాడు. ఆయనతోపాటు శాస్ర్తీ కూడా వచ్చాడు. ఇంకా మసీదు మెట్లు ఎక్కకముందే లోపలికి చూశాడు. అక్కడ ఆయనకు తన గురువైన ఘోలప్‌స్వామి కూర్చుని ఉన్నట్లు కనిపించింది. వెంటనే అతడు గురుస్తోత్రం చేశాడు. గురునామాన్ని అనుసంధానిస్తూ ఉండిపోయాడు. అందరూ శాస్ర్తీని వింతగా చూస్తున్నారు. లోపలికి వచ్చి స్వామి ఇన్నాళ్లకు నాపై దయ గల్గిందా మీకు, ఇప్పుడు దర్శనం వచ్చారు అంటూ బాబా పాదాలపైపడి నమస్కారం చేశాడు. నిలబడి చూసేసరికి బాబా కనిపించారు. కొద్దిసేపటికి మళ్లీ ఘోలప్ స్వామి కనిపించారు. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743